MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/tollywood-directors-e231002a-576d-44a4-832d-e30f17cbdf01-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/tollywood-directors-e231002a-576d-44a4-832d-e30f17cbdf01-415x250-IndiaHerald.jpgలెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణ రావు గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ఇండస్ట్రీలో ఎంతోమంది నటులకు జీవితాన్ని ఇచ్చారు. ఎంతో మంది దర్శకులకు ఆయన ఆదర్శం. కుటంబ కథా చిత్రమైనా, సమాజాన్ని మేల్కొలిపే సినిమాలైనా, రంజుగా సాగే రాజకీయ మువీ అయినా తీయడం ఆయనకే చెల్లింది. దర్శకుడిగా నటుడిగా తెలుగు సినిమా పై తనదైన ముద్రను వేశారు దాసరి. tollywood-directors;chinna;dasari narayana rao;ramu;రాజీనామా;cinema;kannada;mla;director;prize;gift;darsakudu;osey ramulammaఇండస్ట్రీలో ఎంతోమందికి జీవనోపాధిని కల్పించిన లెజెండరీ డైరెక్టర్..!ఇండస్ట్రీలో ఎంతోమందికి జీవనోపాధిని కల్పించిన లెజెండరీ డైరెక్టర్..!tollywood-directors;chinna;dasari narayana rao;ramu;రాజీనామా;cinema;kannada;mla;director;prize;gift;darsakudu;osey ramulammaSat, 22 May 2021 11:00:00 GMTలెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణ రావు గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ఇండస్ట్రీలో ఎంతోమంది నటులకు జీవితాన్ని ఇచ్చారు. ఎంతో మంది దర్శకులకు ఆయన ఆదర్శం. కుటంబ కథా చిత్రమైనా, సమాజాన్ని మేల్కొలిపే సినిమాలైనా, రంజుగా సాగే రాజకీయ మువీ అయినా తీయడం ఆయనకే చెల్లింది. దర్శకుడిగా నటుడిగా తెలుగు సినిమా పై తనదైన ముద్రను వేశారు దాసరి.

దాసరి నారాయణ రావు మే 4న 1947లో పాలకొల్లులో అతిసామాన్యమైన కుటుంబంలో జన్మించారు. దాసరి చిన్న తనంలో ఎన్నో ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చదువుకు డబ్బులు లేక మానేసి పనికి కూడా వెళ్లారు. ఆ తర్వాత స్వతహాగా ఎదుగుతూ.. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడిగా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందారు. అనంతరం అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్‌ పుటలకెక్కారు. ఇండస్ట్రీలో ఏ చిన్న గొడవ జరిగినా ఆయన తలుపు తట్టేవాళ్లు. దాస‌రి నారాయ‌ణ‌రావు ఉన్నపుడు చిన్నా పెద్ద తేడా లేకుండా అంద‌రి సినిమాల‌కు వ‌చ్చేవారు.

అంతేకాదు.. ఆయన దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 53 సినిమాలు స్వయంగా నిర్మించారు. ఆయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశారు. మామగారు, సూరిగాడు , ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. తెలుగు , కన్నడ సినిమాల్లో నటుడిగాను గుర్తింపు పొందిన ఆయన ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందారు.

దాసరి సినిమాల్లో తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, మామగారు వంటి సినిమాలు ఆయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి.  కుటుంబ కథా చిత్రాలు అమ్మా రాజీనామా, సూరిగాడు, భగ్న ప్రేమకథలు ప్రేమాభిషేకం, మజ్ను, స్వయంవరం లాంటి చిత్రాలే కాదు, వర్ణ వివక్షను ప్రశ్నించే బలిపీఠం, అవినీతి మీద ఎమ్మెల్యే ఏడుకొండలు, దొరల పెత్తనం మీద ఒసేయ్ రాములమ్మ లాంటి సామాజిక చిత్రాలు తీశారు. నా అన్నవాళ్లను అక్కున చేర్చుకుని వారికి ఉపాధి కల్పించారు. వందలాది మంది ఆర్టిస్టుల్ని టెక్నీషియన్లను పరిశ్రమకు పరిచయం చేసిన గొప్ప వ్యక్తి దాసరి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అభిరామ్ ఎంట్రీ పై షాకింగ్ ట్విస్ట్ !

టాలీవుడ్ కథానాయకుడు స్టైల్ నే మార్చేసిన పూరీ జగన్నాధ్..

చైనాలో మిస్టరీ బాక్సులు.. చివరికి..?

హెరాల్డ్ స్మరామి : తెలుగు ప్రేక్షకుల మదిలో ఎన్నటికీ గుర్తుండిపోయే నటుడు రావు గోపాల్ రావు..

బయటపడబోతున్న రామ్ చరణ్ నాయకత్వ లక్షణాలు !

ఆనందయ్య కరోనా మందును నమ్మవచ్చా..?

చూద్దాం లే..! అనుకున్నారంటే.. చివ‌రిచూపు ద‌క్క‌దు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>