PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/yanamala-7cd3fffb-d44e-4878-930e-60041cc546fa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/yanamala-7cd3fffb-d44e-4878-930e-60041cc546fa-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాల్లో యనమల రామకృష్ణుడు చాలా సీనియర్ నాయకుడు. టీడీపీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న యనమల తూర్పు గోదావరి రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తూ వచ్చారు. అలాగే తునిలో ఈయనకు తిరుగులేదు. 1983 నుంచి 2004 వరకు తుని నుంచి ఆరుసార్లు విజయం సాధించారు. ఇక 2009లో ఈయనకు తొలిసారి ఓటమి ఎదురైంది. 2014 ఎన్నికలోచ్చేసరికి యనమల ఎన్నికల బరిలో నుంచి తప్పుకుని, ఆయన తమ్ముడు యనమల కృష్ణుడుని తుని బరిలో నిలిపారు.yanamala;krishna;krishnudu;raja;ramakrishna;tiru;godavari river;dadisetti raja;andhra pradesh;2019;air;tdp;local language;ycp;tuni;dookuduయనమల ఫ్యామిలీకి మళ్ళీ ఛాన్స్ లేదా?యనమల ఫ్యామిలీకి మళ్ళీ ఛాన్స్ లేదా?yanamala;krishna;krishnudu;raja;ramakrishna;tiru;godavari river;dadisetti raja;andhra pradesh;2019;air;tdp;local language;ycp;tuni;dookuduSat, 22 May 2021 04:00:00 GMTఏపీ రాజకీయాల్లో యనమల రామకృష్ణుడు చాలా సీనియర్ నాయకుడు. టీడీపీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న యనమల తూర్పు గోదావరి రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తూ వచ్చారు. అలాగే తునిలో ఈయనకు తిరుగులేదు. 1983 నుంచి 2004 వరకు తుని నుంచి ఆరుసార్లు విజయం సాధించారు. ఇక 2009లో ఈయనకు తొలిసారి ఓటమి ఎదురైంది. 2014 ఎన్నికలోచ్చేసరికి యనమల ఎన్నికల బరిలో నుంచి తప్పుకుని, ఆయన తమ్ముడు యనమల కృష్ణుడుని తుని బరిలో నిలిపారు.


అయితే రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే తునిలో మాత్రం వైసీపీ హవా నడిచింది. తునిలో దాడిశెట్టి రాజా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో సైతం యనమల ఫ్యామిలీకి ఎదురుగాలి వీచింది. మళ్ళీ దాడిశెట్టి రాజా విజయం సాధించారు. రెండోసారి విజయం సాధించిన రాజా దూకుడుగా పనిచేస్తున్నారు. యనమల ఫ్యామిలీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా, వైసీపీని మరింతగా బలోపేతం చేస్తున్నారు.


ప్రభుత్వ పథకాలు ఈయనకు బాగా ప్లస్ అవుతున్నాయి. అలాగే ఇళ్ల పట్టాల కార్యక్రమం కూడా బాగా అడ్వాంటేజ్ అయింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మంచి విజయాలు సాధించింది. అటు యనమల ఫ్యామిలీ దాడిశెట్టి హవాకు అడ్డుకట్ట వేయలేకపోతుంది. యనమల రామకృష్ణుడు పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. అటు కృష్ణుడు సైతం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలపై పెద్దగా పోరాటం చేయడం లేదు.


పైగా గతంలో టీడీపీ అధికారంలో ఉండటంతో యనమల ఫ్యామిలీ చేసిన అక్రమాలు చాలానే ఉన్నాయి. రామకృష్ణుడు మంత్రిగా ఉండటంతో, కృష్ణుడు నియోజకవర్గంలో పెత్తనం చేశారు. అలాగే పలు అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు కూడా ఉన్నాయి. అందుకే ప్రజలు 2019లో దాడిశెట్టిని మళ్ళీ గెలిపించారు. ఇక వచ్చే ఎన్నికల్లో సైతం తునిలో దాడిశెట్టికి తిరుగుండదని తెలుస్తోంది. యనమల ఫ్యామిలీ టీడీపీ తరుపున బరిలో ఉంటే మళ్ళీ విజయం దాడిశెట్టిదే అని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. మొత్తానికైతే తునిలో యనమల ఫ్యామిలీకి పెద్ద ఛాన్స్ లేనట్లే కనిపిస్తోంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"ఆర్ ఆర్ ఆర్ " కు రూ.325 కోట్ల ఆఫర్ ?

రాజ‌స్థాన్ లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిలిచేనా..?

అక్కినేని సుమంత్ ఆ 5 సినిమాలు చేసుంటే.. !

రఘురామ ఎపిసోడ్ లో ఆ ఒక్క తప్పూ... ?

రవితేజ మూడు లక్షల రూపాయల హీరో.. దర్శకుడి కామెంట్స్ వైరల్.. ?

మరో హీరోను లాక్ చేసిన మాటల మాంత్రికుడు..?

టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడుతున్న వైసీపీ యువ‌నేత‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>