MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavala-shyamalad6d5116f-21dc-4f85-b15a-a5036d867904-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavala-shyamalad6d5116f-21dc-4f85-b15a-a5036d867904-415x250-IndiaHerald.jpgసినిమాల్లో చిన్న చిన్న పాత్రాలు చేసుకుంటూ రోజులు గడిపే వారి పరిస్థితి అవకాశాలు రాకపోతే చాలా దారుణంగా ఉంటుంది. సాయం కోసం కళ్ళు కాయలుకాసేలా  ఎదురుచూస్తూ  ఎంతో మంది సినీకార్మికులు ఉన్నారు. తాజాగా.. తన మాటలతో కామెడీ టైమింగ్ తో ఎంతోమందిని కడుపుబ్బా నవ్వించిన సీనియర్ నటి పావలా శ్యామల పరిస్థితి కూడా ఇప్పుడు దయనీయంగా ఉంది. దాదాపు 250కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె. ఇప్పుడు వయసు మీదపడటంతో పాటు అవకాశాలు కూడా లేక పోవడంతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు కుమార్తె అనారోగ్యం.. మరోవైపు ఆర్థిక సమసpawala shyamala;chiranjeevi;jeevan;jeevan reddy;comedy;syamala;reddy;facebook;kalyaniపాపం అన్న నోటితోనే శ్యామల గారి మీద విమర్శలు..పాపం అన్న నోటితోనే శ్యామల గారి మీద విమర్శలు..pawala shyamala;chiranjeevi;jeevan;jeevan reddy;comedy;syamala;reddy;facebook;kalyaniSat, 22 May 2021 16:00:00 GMTసినిమాల్లో చిన్న చిన్న పాత్రాలు చేసుకుంటూ రోజులు గడిపే వారి పరిస్థితి అవకాశాలు రాకపోతే చాలా దారుణంగా ఉంటుంది. సాయం కోసం కళ్ళు కాయలుకాసేలా  ఎదురుచూస్తూ  ఎంతో మంది సినీకార్మికులు ఉన్నారు. తాజాగా.. తన మాటలతో కామెడీ టైమింగ్ తో ఎంతోమందిని కడుపుబ్బా నవ్వించిన సీనియర్ నటి పావలా శ్యామల పరిస్థితి కూడా ఇప్పుడు దయనీయంగా ఉంది. దాదాపు 250కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె. ఇప్పుడు వయసు మీదపడటంతో పాటు అవకాశాలు కూడా లేక పోవడంతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు కుమార్తె అనారోగ్యం.. మరోవైపు ఆర్థిక సమస్యలతో పావలా శ్యామల పరిస్థితి దారుణంగా మారింది.

  శ్యామల పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. వెంటనే ఆమెకు ‘మా’ అసోసియేషన్ సభ్యత్వంతోపాటు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు. అయితే శ్యామల పరిస్థితిని చూసి చలించిపోయిన కొంత ఆర్థిక సాయం చేయడమే కాకుండా.. శ్యామల కోసం దాతల నుంచి విరాళాలు సేకరించి పెద్ద మొత్తంలో శ్యామలకి అందించారు. ఆ తరువాత ఒక్కొక్కరుగా శ్యామలకు ఆర్థిక సాయం అందిస్తూనే ఉన్నారు. అలా నటుడు జీవన్ రెడ్డి కూడా ఇలా ఆమెకి రోజు భోజన వసతి కల్పిస్తామని చెప్తే పావలా శ్యామల గారు "మేము బ్రహ్మణులం ఎవరి పెట్టిన తినం " అని ఆమె అన్నారట. అయితే ఈ విషయం తెలిసిన చాలామంది ఆమె మీద విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఈ సమయంలో కూడా కులాన్ని ఎందుకు తెస్తున్నారు అని అంటున్నారు. 

ఇక ఆమెకి మొదట సాయం అందించిన కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. ‘‘మొదట ఆరు వేలు ఉంటే చాలని చెప్పిన శ్యామల.. ఇప్పుడు నెలకు లక్ష రూపాయలు కావాలని అంటుందంటూ పైగా డబ్బు తప్ప ఎలాంటి వస్తువులు ఇచ్చినా తీసుకోవడం లేదని పైగా తను పరువు తీశానంటూ తనపై ఆరోపణ చేస్తోందంటూ వాపోయింది కరాటే కళ్యాణి. ఈ విషయాలన్నీ కరాటే కల్యాణి తన ఫేస్బుక్ అకౌంట్ లో లైవ్ పెట్టి మరీ చెప్పారు.ఈ విషయంలో ఎవరిని తప్పు అనాలో లేక కరెక్ట్ అనాలో ఎవరికి అర్థం కావట్లేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఊర్మిళ మీద కంగనా కామెంట్స్.. ఆర్జీవీ రియాక్షన్ అదుర్స్!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?

చేసిన పాత్రతో విమర్శల ఎదుర్కొన్న నటులు వీరే

మాటల మాంత్రికుడి దర్శకత్వ శైలి నిజంగా అద్భుతం .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>