PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/corona36ab08b1-71cc-4334-b205-7152e6148748-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/corona36ab08b1-71cc-4334-b205-7152e6148748-415x250-IndiaHerald.jpg వైర‌స్ మ‌హ‌మ్మారి శ‌రీరంలోకి ప్ర‌వేశించి మ‌న రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌పై దాడిచేస్తుంటే నిస్స‌హాయుల‌మైపోతాం. రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను పెంపొందించుకొని మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు ఉప‌యోగ‌ప‌డే ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను టీకా రూపంలో తీసుకుంటుంటాం. ఎటువంటి అంటువ్యాధుల‌కైనా ఇదే ప‌ద్ధ‌తిని పాటించాం.. పాటిస్తున్నాం.. పాటించ‌బోతాం. శ‌రీర వ్య‌వ‌స్థ‌పై దాడిచేసిన మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు టీకా తీసుకుంటున్న‌ప్పుడు.. సమాజంలోని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసేవారికి.. ఆ వ్య‌వ‌స్థ‌ల‌ను ధ్వంసం చేసేవారికి ఎటువంటి టీcorona;courtప్ర‌భుత్వాల‌కు "టీకా" వేసేదెవ‌రు?ప్ర‌భుత్వాల‌కు "టీకా" వేసేదెవ‌రు?corona;courtSat, 22 May 2021 13:18:17 GMT
వైర‌స్ మ‌హ‌మ్మారి శ‌రీరంలోకి ప్ర‌వేశించి మ‌న రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌పై దాడిచేస్తుంటే నిస్స‌హాయుల‌మైపోతాం. రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను పెంపొందించుకొని మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు ఉప‌యోగ‌ప‌డే ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను టీకా రూపంలో తీసుకుంటుంటాం. ఎటువంటి అంటువ్యాధుల‌కైనా ఇదే ప‌ద్ధ‌తిని పాటించాం.. పాటిస్తున్నాం.. పాటించ‌బోతాం. శ‌రీర వ్య‌వ‌స్థ‌పై దాడిచేసిన మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు టీకా తీసుకుంటున్న‌ప్పుడు.. సమాజంలోని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసేవారికి.. ఆ వ్య‌వ‌స్థ‌ల‌ను ధ్వంసం చేసేవారికి ఎటువంటి టీకా ఇవ్వాలి?  ప్ర‌జారంజ‌క‌మైన ప‌రిపాల‌న అందిస్తామ‌ని చెప్పి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించే పాల‌కుల‌కు ఏ టీకా ప‌నిచేస్తుంది?  దాన్ని ఎవ‌రైనా క‌నిపెట్ట‌గ‌ల‌రా? అంటే అది స‌మాధానం లేని ప్ర‌శ్నే అవుతోంది.

మారుతున్న పాల‌కుల తీరుతెన్నులు
ప్ర‌జ‌ల చేత‌, ప్ర‌జ‌ల కొర‌కు ప్ర‌జాస్వామ్య‌మంటూ అధికారం చేప‌ట్టిన పాల‌కుల తీరుతెన్నులు మారిపోతున్నాయి. మాయ‌మాట‌లు చెబుతూ, భావోద్వేగాలు పండిస్తూ, ప్ర‌చార ఆర్భాటాల‌కు ప్రాధాన్య‌మిస్తూ, దేశ సంక్షేమానికి ఎవ‌రి స‌ల‌హాలు స్వీక‌రించ‌కుండా, ఎవ‌రి సూచ‌న‌లు పాటించ‌కుండా.. కీల‌క‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో  వేలుపెడుతూ న‌ల్లేరుబాట‌పై న‌డుస్తున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కుప్ప‌కూల్చేవారికి ఎటువంటి టీకాలివ్వాలి?  ప్ర‌స్తుతం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌కు ప్రాధాన్య‌మివ్వ‌కుండా మ‌న‌చేతిలో లేనిదాని కోసం ఆరాట‌ప‌డుతూ ప‌రుగులుతీసి దేశ‌ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని ప‌ణంగా పెట్టిన‌వారికి టీకాలు ఎవ‌రూ క‌నుగొన‌లేరేమోన‌నిపిస్తోంది. అధికార‌మే ఆలంబ‌న‌గా, అధికార‌మే శ్వాస‌గా, అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా మారిన‌ప్పుడు ప్ర‌జాస్వామ్యం కాస్తా నియంతృత్వంగా మారిపోతుంది. ప్ర‌జాస్వామ్యంలో ఉన్నామ‌ని మ‌భ్య‌పెడుతూ మ‌న‌కు తెలియ‌కుండానే ఎప్పుడో నియంతృత్వంలోకి తీసుకువెళ్లిపోయార‌నే స్పృహ ఇంకా క‌ల‌గ‌లేదు. ఈ త‌ర‌హా ఆలోచ‌న‌ల నుంచి పాల‌కుల తీరుతెన్నులు మార్చ‌డానికి ఎటువంటి టీకాలు ఉండ‌వా? అని అమాయ‌కంగా అడిగితే వాటిని ఎవ‌రూ ఇంకా క‌నుగొన‌లేద‌నే స‌మాధాన‌మే వ‌స్తుంది.

అభివృద్ధి గాలికి..
కోర్టుల్లో ప్ర‌భుత్వ న్యాయ‌వాదులు న్యామూర్తుల‌నే గ‌ద్దించి మాట్లాడుతున్న‌ప్పుడు.. ఆ న్యాయ‌వాదుల‌ను నియ‌మించిన పాల‌కుల తీరు కూడా అలాగే ఉంటుంద‌ని తెలుసుకుంటే ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు. వ్య‌వ‌స్థ‌ల‌ను గుప్పిట‌ప‌ట్టి, అభివృద్ధిని గాలికి వ‌దిలి సంక్షేమం పేరిట తాయిలాలు ప్ర‌క‌టిస్తూ ప్ర‌జ‌ల్ని సోమ‌రుల్ని చేస్తూ.. సంవ‌త్స‌రానికోసారి ఆ ప్ర‌భుత్వ‌మిచ్చే ప‌దీప‌ర‌కా కోసం ఎదురుచూసేలా చేసేవారికి టీకా లేదా? ఒక‌చేత్తో ఇచ్చిన సొమ్ముల‌ను మ‌రోచేత్తో మ‌ద్యం దుకాణాల‌ద్వారా తిరిగి తీసుకునే చాణ‌క్యం నెరిపే పాల‌కుల‌కు టీకా లేదా? అంటే అవి ఉండ‌వు.. వాటిని ఎవ‌రూ క‌నుగొన‌లేర‌ని సామాజిక‌వేత్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ధ్వంస‌మ‌వుతున్న సామాజిక వ్య‌వ‌స్థ‌ల‌కు పున‌రుత్తేజం క‌ల్పించాల్సిన బాధ్య‌త ప్ర‌జ‌ల‌పైనే ఉంటుంద‌ని.. అందుకు ఓటు అనేదే ఆయుధంగా ఉప‌యోగించుకోవాల‌ని సూచిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మరి కొన్నాళ్లలో కరోనా ఖతం.. కానీ..?

ఈ ఫ్లాప్ డైరెక్టర్ కి నాగార్జున మరోసారి అవకాశం ఇస్తాడా..?

పవన్ హీరోయిన్ కి రెండు షాకులు ఏమైందంటే..?

భూమిపై అనేక జాతుల అభివృద్ధే.. జీవవైవిధ్యం

ఎంతోమంది యువదర్శకులకు ప్రేరణే డైరెక్టర్ మారుతి ...

ఆ అబ్బాయి సంథింగ్ స్పెషల్ అంటున్న కీర్తి సురేష్..

టాలీవుడ్ చిరస్మరణీయం : నాగార్జున నిర్ణయం భేష్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>