MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/salman-khan-raadhe24da9821-b4cd-4489-9ccb-a1b54d2c1253-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/salman-khan-raadhe24da9821-b4cd-4489-9ccb-a1b54d2c1253-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో ఇటీవల ఓటిటిలో విడుదలైన 'రాధే' సినిమా డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే వసూళ్ల పరంగా మాత్రం ఈ సినిమా దుమ్ములేపిందనే చెప్పాలి.అయినా సినిమాకు ఎంత బ్యాడ్ టాక్ వస్తే ఏంటి.. సోషల్ మీడియాలో ఈ చిత్రం గురించి ఎంత ట్రోలింగ్ జరిగితే ఏంటి.. అంతిమంగా ఈ సినిమా నిర్మాత లాభపడ్డాడా.. నష్టపోయాడా అన్నది కీలకం. ఈ విషయంలో మేకర్స్ ఫుల్ ఖుషీనే అన్నది ట్రేడ్ వర్గాల మాట. రాధె సినిమాను నిర్మించింది స్వయంగా సల్మాన్ ఖానే. తనకున్న క్రేజ్‌నSalman Khan Raadhe;koti;prabhu deva;salman khan;bollywood;cinema;producer;producer1ప్లాప్ సినిమాకి '110 కోట్ల' కలెక్షన్స్.. ఇది సల్లూ భాయ్ రేంజ్ అంటే..!!ప్లాప్ సినిమాకి '110 కోట్ల' కలెక్షన్స్.. ఇది సల్లూ భాయ్ రేంజ్ అంటే..!!Salman Khan Raadhe;koti;prabhu deva;salman khan;bollywood;cinema;producer;producer1Sat, 22 May 2021 17:00:00 GMTబాలీవుడ్  కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో ఇటీవల ఓటిటిలో విడుదలైన 'రాధే' సినిమా డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే వసూళ్ల పరంగా మాత్రం ఈ సినిమా దుమ్ములేపిందనే చెప్పాలి.అయినా సినిమాకు ఎంత బ్యాడ్ టాక్ వస్తే ఏంటి.. సోషల్ మీడియాలో ఈ చిత్రం గురించి ఎంత ట్రోలింగ్ జరిగితే ఏంటి.. అంతిమంగా ఈ సినిమా నిర్మాత లాభపడ్డాడా.. నష్టపోయాడా అన్నది కీలకం. ఈ విషయంలో మేకర్స్ ఫుల్ ఖుషీనే అన్నది ట్రేడ్ వర్గాల మాట. రాధె సినిమాను నిర్మించింది స్వయంగా సల్మాన్ ఖానే. తనకున్న క్రేజ్‌ను కొన్నేళ్లుగా సల్మాన్ బాగానే క్యాష్ చేసుకుంటున్నాడు. సొంత సినిమాలే ఎక్కువ చేస్తున్నాడు.

రాధె కూడా ఆ కోవలోని సినిమానే. ఈ చిత్రాన్ని రూ.80 కోట్ల బడ్జెట్లో పూర్తి చేశారట.థియేటర్లలో రిలీజ్ చేద్దామని చూసి చూసి, ఇక లాభం లేదని ఇటీవలే జీ వాళ్లకు థియేట్రికల్, డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కలిపి జీ నెట్ వర్క్ వాళ్లకు ఒకేసారి అమ్మేశారు.ఈ డీల్ రూ.190 కోట్లకు తెగినట్లు సమాచారం. అంటే సల్మాన్ ఖాన్ ప్రస్తుతానికి రూ.110 కోట్ల లాభం అందుకున్నాడన్నమాట. తక్కువ ఖర్చులో, తక్కువ సమయంలో ఓ సినిమా పూర్తి చేసి రూ.110 కోట్లు జేబులో వేసుకున్నాడు సల్మాన్. ఆయనకు ఇంతకంటే ఏం కావాలి?

ఈ సినిమాను కొన్ని జీ నెట్ వర్క్ వాళ్లకు కూడా బాగానే గిట్టుబాటు అయినట్లే ఉంది.జీ నెట్ వర్క్ వాళ్లు ఇంటర్నేషనల్ మార్కెట్లో వీలున్నంత మేర సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసి థియేటర్లు మూతపడి ఉన్న ఇండియాలో ఓటీటీలు, డీటీహెచ్‌ల ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఓటీటీలు, డీటీహెచ్‌ల్లో కోటి మందికి పైగానే చూశారు ఇప్పటిదాకా. సినిమాను ఒకసారి చూసేందుకు పెట్టిన రేటు రూ.249. ఆ ప్రకారం రూ.250 కోట్లకు పైగానే ఆదాయం వచ్చి ఉంటుంది. ఇంకా జీ ఛానెల్లో సినిమాకు ప్రిమియర్స్ వేయాల్సి ఉంది. ఆ మార్గంలో కూడా వచ్చే ఆదాయం కూడా కలుపుకుంటే జీ వాళ్లు కూడా రూ.100 కోట్ల వరకు లాభాలు వచ్చినట్టే అంటున్నారు...!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కోట్లు కుమ్మరించిన నో ఎక్సపోసింగ్ అంటున్న హీరోయిన్స్ వీళ్ళే. !

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?

చేసిన పాత్రతో విమర్శల ఎదుర్కొన్న నటులు వీరే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>