LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/sago-idly-easy-preparationd169435d-26de-4e3f-a733-981f31f0be5b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/sago-idly-easy-preparationd169435d-26de-4e3f-a733-981f31f0be5b-415x250-IndiaHerald.jpgసగ్గు బియ్యం.. ఈ పేరు అన్నీ ప్రాంతాల వారికి తెలిసే ఉంటుంది.. సగ్గు బియ్యం తో పాయసం లేదా స్నాక్ ఐటమ్స్ చుసాము.. ఇంకా సైడ్ డిష్ లను చేసుకోవడం చూసి ఉంటాము.. ఇంకా కిచిడి లాంటి టిఫిన్ లను చేసుకుంటారు. అయితే ఎప్పుడు చేసినవి కాకుండా వెరైటీగా ట్రై చేయాలంటే ఇడ్లి చేసుకోవచ్చు.. మరి ఆలస్యం చేయకుండా ఆ ఇడ్లీ లను ఎలా తయారు చేసుకోవాలి, ఎటువంటి పదార్థాలను వాడాలి అనేది ఇప్పుడు ఒకసారి చూసేద్దాం.. sago idly easy preparation;idili;chilli;cumin;coriander.;oilసగ్గు బియ్యం తో టేస్టీ ఇడ్లి.. ఎలా చేయాలంటే ?సగ్గు బియ్యం తో టేస్టీ ఇడ్లి.. ఎలా చేయాలంటే ?sago idly easy preparation;idili;chilli;cumin;coriander.;oilSat, 22 May 2021 19:00:00 GMTసగ్గు బియ్యం.. ఈ పేరు అన్నీ ప్రాంతాల వారికి తెలిసే ఉంటుంది.. సగ్గు బియ్యం తో పాయసం లేదా స్నాక్ ఐటమ్స్ చుసాము.. ఇంకా సైడ్ డిష్ లను చేసుకోవడం చూసి ఉంటాము.. ఇంకా కిచిడి లాంటి టిఫిన్ లను చేసుకుంటారు. అయితే ఎప్పుడు చేసినవి కాకుండా వెరైటీగా ట్రై చేయాలంటే ఇడ్లి చేసుకోవచ్చు.. మరి ఆలస్యం చేయకుండా ఆ ఇడ్లీ లను ఎలా తయారు చేసుకోవాలి, ఎటువంటి పదార్థాలను వాడాలి అనేది ఇప్పుడు ఒకసారి చూసేద్దాం..

కావలసిన పదార్థాలు:

ఇడ్లి రవ్వ: 2 కప్పులు,

సగ్గు బియ్యం: 1 కప్పు,

పెరుగు: 2 కప్పులు,

క్యారెట్‌ తురుము: రెండు టేబుల్‌ స్పూన్లు,

పచ్చిమిర్చి: నాలుగు,

పచ్చి కొబ్బరి తురుము: రెండు టేబుల్‌ స్పూన్లు,

ఉప్పు: తగినంత,

ఆవాలు, జీలకర్ర, మినుపపప్పు, శనగపప్పు: అర టీ స్పూన్‌ చొప్పున,

కరివేపాకు: ఒక రెమ్మ,

కొత్తిమీర: కొద్దిగా,

నూనె: సరిపడా

తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో ఇడ్లి రవ్వ, సగ్గుబియ్యం కలిపి పెరుగు వేసి తగినన్ని నీళ్లు పోసి 'ఇడ్లిపిండి'లా కలిపి, ఆరు గంటలు నాననివ్వాలి. బాగా నానిన పిండిలో తగినంత ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపాలి.ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపట లాడాక మినుపపప్పు, శనగపప్పు వేసి కొంచెం వేగగానే పిండిలో వేసి కలపాలి. నూనె రాసిన ఇడ్లి ప్లేట్లలో గరిటెతో సగ్గు బియ్యం మిశ్రమం వేసి ఆవిరిమీద ఉడికించాలి.. అంతే ఎంతో రుచిగా ఉండే ఇడ్లీలు రెడీ.. చూసారుగా చాలా తర్వగా అవ్వడంతో పాటుగా చాలా రుచిగా కూడా ఉంటాయి.. ఈ ఇడ్లీలకు పుదీనా చట్నీ లేదా, టమోటా చట్నీ వేసుకొని తింటే ఇక వదలరు..  మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చెయ్యండి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పదో తరగతి పరీక్షల రద్దుపై బాంబే హైకోర్టు ఆగ్రహం..

తెలుగు సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చిన దర్శ‌కుడు

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>