EditorialThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/krishnapatnam-anandayyae97fdb76-f7cb-4bcd-93f1-4168ef2590ce-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/krishnapatnam-anandayyae97fdb76-f7cb-4bcd-93f1-4168ef2590ce-415x250-IndiaHerald.jpgప్ర‌పంచ వ్యాప్తంగా కొవిడ్ అతిపెద్ద మార్కెటింగ్ వ‌న‌రుగా ఉంది. ఒక్క భార‌త‌దేశంలోనే సుమారు ల‌క్ష కోట్ల విలువైన మార్కెట్‌గా కొవిడ్ విస్త‌రించింది. అదికూడా కేవ‌లం 30రోజుల్లోనే. మ‌రికొన్ని నెల‌లు ఇలాగే కొన‌సాగితే కొవిడ్ మార్కెట్ విలువ భార‌త్‌లోనే 60ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగే అవ‌కాశాలుంటాయ‌ని మార్కెటింగ్ అధ్య‌య‌న సంస్థ‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో కొవిడ్ రోగాన్ని ఉచితంగా ఆయుర్వేద చుక్క మందుతో న‌యం చేస్తానంటూ ముందుకొచ్చారు ఆనంద‌య్య‌. కానీ కొన్ని వ‌ర్గాలు ఇలాంటి ఔష‌ధాల‌పై త‌ప్పుడు ప్ర‌చాKrishnapatnam-Anandayya;andhra pradesh;vegetable market;ayurveda;districtకరోనా రోగులకు "ఆనందం'' అయ్యా..!కరోనా రోగులకు "ఆనందం'' అయ్యా..!Krishnapatnam-Anandayya;andhra pradesh;vegetable market;ayurveda;districtSat, 22 May 2021 11:57:46 GMTజిల్లా కృష్ణ‌ప‌ట్ట‌ణంకు చెందిన ఆనంద‌య్య‌. ఉచితంగా ఆయుర్వేద ఔష‌ధాన్ని ఇస్తూ కొవిడ్‌ను న‌యం చేస్తున్నారు. గ‌త నెల రోజులుగా వంద‌లాది మందికి ఔష‌ధం ఇస్తున్నారు.. ఈ ఔష‌ధం తీసుకున్న వారిలో ఇప్ప‌టి వ‌ర‌కు దుష్ప్ర‌భావాలు ఏమీ క‌నిపించ‌లేదు.

దేశ ప్ర‌జానీకం క‌రోనా సెకండ్‌వేవ్‌తో అత‌లాకుత‌లం అవుతుంది. వైర‌స్ వ్యాప్తి వేగంగా జ‌రుగుతుండ‌టంతో ల‌క్ష‌లాది మంది కొవిడ్ బారిన ప‌డుతూ ఆస్ప‌త్రుల‌వైపు ప‌రుగులు తీస్తున్నారు. రోజుకు వేల సంఖ్య‌లో మృత్యువాత ప‌డుతున్నారు. ఇంత‌టి విప‌త్త‌ను అడ్డుకొనేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ర‌ణాలు మాత్రం ఆగ‌డం లేదు. కొవిడ్ వైర‌స్ నుంచి ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడేందుకు ప్ర‌భుత్వం రెండు ర‌కాల టీకాల‌ను అందుబాటులోకి తెచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ టీకా పంపిణీ ప్ర‌క్రియ కొన‌సాగింది. నెల‌రోజుల పాటు 45యేళ్ల పైబ‌డిన వారికి వ్యాక్సినేష‌న్ ఇచ్చారు. పూర్తిస్థాయిలో స‌ర‌ఫ‌రా లేక‌పోవ‌టంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ నిలిచిపోయింది. కేవ‌లం ఇంట్లో ఉండి ప్రాణాల‌ను ర‌క్షించుకోవ‌ట‌మే త‌ప్ప చేసేదేమీలేని ప‌రిస్థితి.

ఇలాంటి స‌మ‌యంలో అనంద‌య్య మూలికా ఔషధం కొవిడ్ రోగుల‌కు కొత్త ఊపిరిలూదుతుంది. కొవిడ్ బాధితులు ఆనంద‌య్య ఇచ్చే కంటి చుక్క‌ల‌ను తీసుకొనేందుకు క్యూ క‌డుతున్నారు. బుధ‌, గురువారాల్లో రోజుకు 30వేల మంది వ‌ర‌కు ఆనంద‌య్య ఇచ్చే కంటిలో చుక్క‌కోసం బారులు తీరారు. వేసుకున్న కొద్దిరోజుల్లో శ‌రీరంలో కొవిడ్ ఆన‌వాళ్లు పోతున్నాయ‌ని చుక్క‌ల మందుకు వేయించుకున్న వారు వెల్ల‌డిస్తున్నారు. ఏపీ ప్ర‌భుత్వం ఈ ఔష‌ధానికి శాస్త్రీయ‌త లేద‌ని నిలిపివేసింది. అనంద‌య్యను అదుపులోకి తీసుకుంది. ఈక్ర‌మంలో ప్ర‌భుత్వం తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌స్తుత కాలంలో ఇది ఊహించిన  అంశ‌మే.

ప్ర‌పంచ వ్యాప్తంగా కొవిడ్ అతిపెద్ద మార్కెటింగ్ వ‌న‌రుగా ఉంది. ఒక్క భార‌త‌దేశంలోనే సుమారు ల‌క్ష కోట్ల విలువైన మార్కెట్‌గా కొవిడ్ విస్త‌రించింది. అదికూడా కేవ‌లం 30రోజుల్లోనే. మ‌రికొన్ని నెల‌లు ఇలాగే కొన‌సాగితే కొవిడ్ మార్కెట్ విలువ భార‌త్‌లోనే 60ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగే అవ‌కాశాలుంటాయ‌ని మార్కెటింగ్ అధ్య‌య‌న సంస్థ‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో కొవిడ్ రోగాన్ని ఉచితంగా ఆయుర్వేద చుక్క మందుతో న‌యం చేస్తానంటూ ముందుకొచ్చారు ఆనంద‌య్య‌. కానీ కొన్ని వ‌ర్గాలు ఇలాంటి ఔష‌ధాల‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేసేందుకు, పెద్దెత్తున విమ‌ర్శ‌లు చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. ఇక్క‌డ అదేజ‌రిగింది.  ఆనంద‌య్య ఔష‌ధానికి శాస్త్రీయ‌త లేద‌న్న వాద‌న‌ను తెర‌పైకి తెచ్చారు. దీంతో ప్ర‌భుత్వం శాస్త్రీయ‌త నిర్ధార‌ణ కోసం ఐసీఎంఆర్ బృందాన్ని నియ‌మించింది. మూడు రోజుల్లో ఈ బృందం నివేదిక‌ను ఇవ్వ‌నుంది.

ఆయుర్వేద దేశంగా ప్ర‌సిద్ధిగాంచిన భార‌త్‌లో ప్ర‌స్తుతం ఆయుర్వేదానికే చోటు లేకుండా పోతుండ‌టం ఆందోళ‌న‌క‌ర విష‌య‌మే. కొన్ని వ‌ర్గాలు దేశాన్ని ఇలా మార్చేశాయ‌న‌డంలో అబ‌ద్ద‌మేమీలేదు. శాస్త్రీయ‌త నిర్ధార‌ణ కోసం ప్ర‌భుత్వం ఆనంద‌య్య ఇచ్చే మందును నిలిపివేయ‌డంలోనూ త‌ప్పుప‌ట్ట‌లేం. అయితే డ్ర‌గ్స్ మాఫియా దారుపై మాత్రం ప్ర‌భుత్వాలు ఎందుకు ఇంత శ్ర‌ద్ద‌చూప‌డం లేద‌న్న‌ది ప్ర‌స్తుతం ప్ర‌తీఒక్క‌రిలో మెదులుతున్న ప్ర‌శ్న‌. ఇటీవ‌ల స‌హ‌జ‌మైన ఉత్ప‌త్తుల‌తో రోగాల‌ను న‌యం చేస్తాన‌ని, ల‌క్ష‌లాది మందికి మార్గ‌ద‌ర్శిగా మారిన వ్య‌క్తిని ఓ వ‌ర్గం ఎలా తొక్కేసిందో మ‌న తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు తెలుసు. అయితే ఆ ప‌రిస్థితే ఆనంద‌య్య‌కు ఎదురైతే.. ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హావేశాలు క‌ట్ట‌లు తెచ్చుకోక మాన‌దు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బెయిల్ వచ్చినా నో రిలీజ్.. ఎందుకంటే?

పవన్ హీరోయిన్ కి రెండు షాకులు ఏమైందంటే..?

భూమిపై అనేక జాతుల అభివృద్ధే.. జీవవైవిధ్యం

ఎంతోమంది యువదర్శకులకు ప్రేరణే డైరెక్టర్ మారుతి ...

ఆ అబ్బాయి సంథింగ్ స్పెషల్ అంటున్న కీర్తి సురేష్..

టాలీవుడ్ చిరస్మరణీయం : నాగార్జున నిర్ణయం భేష్!

అభిరామ్ ఎంట్రీ పై షాకింగ్ ట్విస్ట్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>