Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/keerthi-suresh-took-vaccine-first-dose-and-posted-this84d2405a-2d4c-4ef0-a41b-56b80dc28cec-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/keerthi-suresh-took-vaccine-first-dose-and-posted-this84d2405a-2d4c-4ef0-a41b-56b80dc28cec-415x250-IndiaHerald.jpgసెలబ్రిటీలంతా కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. తాము వ్యాక్సిన్ వేయించుకున్నామని, అందరూ వేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ కూడా చేరింది. వ్యాక్సిన్ వేయించుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కీర్తి సురేశ్.. ‘నా కర్తవ్యం నిర్వర్తించాను’ అంటూ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. అయితే కీర్తి సురేశ్ వ్యాక్సిన్..keerthy suresh;mahesh;amitabh bachchan;mohanlal;rajinikanth;editor mohan;keerthi suresh;kirti;nayantara;india;bollywood;cinema;telugu;rajani kanth;nenu sailaja;heroine;posters;mahanati;adimulapu suresh;chitramకీర్తి కూడా అలానే వ్యాక్సిన్ వేయించుకుందేంటి..? అందుకే ట్రోలింగ్కీర్తి కూడా అలానే వ్యాక్సిన్ వేయించుకుందేంటి..? అందుకే ట్రోలింగ్keerthy suresh;mahesh;amitabh bachchan;mohanlal;rajinikanth;editor mohan;keerthi suresh;kirti;nayantara;india;bollywood;cinema;telugu;rajani kanth;nenu sailaja;heroine;posters;mahanati;adimulapu suresh;chitramSat, 22 May 2021 23:43:57 GMTసెలబ్రిటీలంతా కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. తాము వ్యాక్సిన్ వేయించుకున్నామని, అందరూ వేయించుకోవాలని సూచిస్తున్నారు. సౌత్ ఇండియా సూపర్ స్టార్, రజనీకాంత్, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఇంకా ఎంతోమంది సినీ నటులు కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇక ఈ జాబితాలో తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ కూడా చేరింది. వ్యాక్సిన్ వేయించుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కీర్తి సురేశ్.. ‘నా కర్తవ్యం నిర్వర్తించాను’ అంటూ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. అయితే కీర్తి సురేశ్ వ్యాక్సిన్ వేయించుకోవడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

‘నీవు ఇంజెక్షన్ వేయించుకునేప్పుడు ఇంజెక్షన్ కనిపించలేదేంటి..?’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే సీనియర్ హీరోయిన్ నయనతార కూడా వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు ఇంజెక్షన్ కనిపించలేదు. దాంతో ఆమెపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ నడిచాయి. ఇక ఇప్పుడు కీర్తి విషయంలోనూ అదే జరగడంతో.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

కాగా.. కీర్తి ప్రస్తుతం మహేశ్ సరసన సర్కారు వారి పాట చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే రజినీ అన్నాత్తే సినిమాలో ఆయనకు చెల్లెలిగా నటిస్తోంది. అలాగే మరికొన్ని చిత్రాల్లోనూ కొన్ని సినిమాలు చేస్తోంది. అందులో మళయాళంలో మోహన్ లాల్ సరసన మరక్కర్ చిత్రం చేయగా.. ఆ చిత్రం ఇంకా విడుదల కాలేదు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ ఓ రాణిగా కనిపించబోతోందని టాక్ నడుస్తోంది. ఇటీవలే ఈ సినిమాలో ఆమె లుక్‌కు సంబంధించి ఓ పోస్టర్ కూడా విడుదలై మంచి స్పందన రాబడుతోంది.

ఇదిలా ఉంటే నేను శైలజ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన కీర్తి సురేశ్ ఆ తర్వాత అద్భుతమైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకుంది. మహానటి ఆమె కెరీర్‌ని గొప్ప మలుపు తిప్పింది. నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ ఈ మధ్య కాలంలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా వచ్చిన రంగ్‌దే, మిస్ ఇండియా వంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద అంత హిట్ కొట్టలేకపోయాయి. దీంతో తదుపరి చిత్రాలపై ఆమె చాలా ఆశలే పెట్టుకుంది.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాధేశ్యామ్ సినిమా కోసం మరో పాట చేయబోతున్న ప్రభాస్..?

తెలుగు సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చిన దర్శ‌కుడు

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>