EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/shockula-meeda-shock-isthunna-kcr-antaga-maripoyada296d574d-5a0c-4d30-bc70-077fad50c490-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/shockula-meeda-shock-isthunna-kcr-antaga-maripoyada296d574d-5a0c-4d30-bc70-077fad50c490-415x250-IndiaHerald.jpgతెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రజల నాడి బాగా తెలిసిన నాయకుడు. రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఏం చేయాలో బాగా తెలిసినవాడు.. ప్రజల్లో చెడ్డపేరు వస్తుందని గ్రహిస్తే ఎంతకైనా తగ్గేందుకు వెనుకాడడు. ప్రజలు మెచ్చే నిర్ణయాల అమలులో ఎన్ని విమర్శలు వచ్చినా పెద్దగా పట్టించుకోరు. కొన్ని రోజులాగా కేసీఆర్ తీరుపై తెలంగాణలోని అనేక వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. రాష్ట్రం కరోనా కోరల్లో చిక్కుకున్నా కేసీఆర్ పెద్దగా పట్టించుకోవడం లేదని విమర్శలు వచ్చాయి. అంతే కాదు.. తెలంగాణ హైకోర్టు అనేక సార్లు కేసీఆర్ సర్కారు తీరును తీవ్రంగా తపkcr;kcr;amala akkineni;mandula;telangana;mohandas karamchand gandhiషాకుల మీద షాకులిస్తున్న కేసీఆర్.. అంతగా మారిపోయాడా..?షాకుల మీద షాకులిస్తున్న కేసీఆర్.. అంతగా మారిపోయాడా..?kcr;kcr;amala akkineni;mandula;telangana;mohandas karamchand gandhiFri, 21 May 2021 07:00:00 GMTతెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రజల నాడి బాగా తెలిసిన నాయకుడు. రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఏం చేయాలో బాగా తెలిసినవాడు.. ప్రజల్లో చెడ్డపేరు వస్తుందని గ్రహిస్తే ఎంతకైనా తగ్గేందుకు వెనుకాడడు. ప్రజలు మెచ్చే నిర్ణయాల అమలులో ఎన్ని విమర్శలు వచ్చినా పెద్దగా పట్టించుకోరు. కొన్ని రోజులాగా కేసీఆర్ తీరుపై తెలంగాణలోని అనేక వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. రాష్ట్రం కరోనా కోరల్లో చిక్కుకున్నా  కేసీఆర్ పెద్దగా పట్టించుకోవడం లేదని విమర్శలు వచ్చాయి.

అంతే కాదు.. తెలంగాణ హైకోర్టు అనేక సార్లు కేసీఆర్ సర్కారు తీరును తీవ్రంగా తప్పుబట్టింది. కరోనా టెస్టుల విషయంలో.. కరోనా జాగ్రత్తల విషయంలో.. కరోనా మందుల పంపిణీ విషయంలో అనేక సార్లు తెలంగాణ సర్కారుకు హైకోర్టు తలంటింది. అయితే ఎన్నిసార్లు చెప్పినా కేసీఆర్ సర్కారు సీరియస్‌గా తీసుకోలేదని కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి విమర్శలు వస్తున్న సమయంలో కేసీఆర్ స్వయంగా  కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత కోలుకున్నారు.

ఆయన తాజాగా గాంధీ ఆసుపత్రికి వెళ్లి నేరుగా కరోనా పేషెంట్లను పరామర్శించడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఆయన ఇటీవలే కరోనా బారిన పడ్డారు. అయినా.. ఏకంగా కరోనా పేషెంట్లు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లి మరీ పరామర్శించారు. అది కూడా పీపీఈ కిట్లు వంటి రక్షణ లేకుండా నేరుగా కేవలం డబల్ మాస్క్ పెట్టుకుని రోగులను పరామర్శించారు. కనీసం చేతులకు గ్లవుసులు కూడా వేసుకోలేదు.

అలా కేసీఆర్ నేరుగా ఐసీయూ వార్డుల్లోకి వెళ్లడం.. అక్కడి రోగుల బాధలు శ్రద్ధగా వినడం, నేనున్నానని ధైర్యం చెప్పడం.. ఆ దృశ్యాలన్నీ మీడియాలో ప్రముఖంగా రావడంతో సీన్ మారిపోయింది. కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇన్నాళ్లూ వచ్చిన విమర్శలన్నీ ఈ ఒక్క 40 నిమిషాల పర్యటనతో కొట్టుకుపోయినట్టయింది. అయితే ఇదేదో పబ్లిసిటీ కోసం చేసిన జిమ్మిక్కు కాదని నిరూపించుకునేందుకో ఏమో కానీ.. కేసీఆర్ ఇప్పుడు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిని కూడా సందర్శించాలని నిర్ణయించారు. అందుకే ఇప్పుడు కేసీఆర్ ఇస్తున్న వరుస షాకులు చూసి.. కేసీఆర్ ఇంతగా మారిపోయాడా అని ఆశ్చర్యపోతున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రేణూ దేశాయ్ కి రెండోసారి కూడా చేదు అనుభవం..

ఇక రెండవ వాక్సిన్ కోసం మూడు నెలలు

ఏపీపై మోదీకి ఎందుకింత‌ వివ‌క్ష‌..?

చందమామ సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా..?

ఇక స్టూడెంట్స్‌కు దేవుడే దిక్కు.. బాంబే హైకోర్టు వైరాగ్యం..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రాపాకకు జగన్ హ్యాండ్ ఇచ్చేస్తారా?

ఢిల్లీ వైపు చూస్తున్న బాబు... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>