WomenMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/yayathi63a8a8fa-4372-417e-be3e-09d567d23578-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/yayathi63a8a8fa-4372-417e-be3e-09d567d23578-415x250-IndiaHerald.jpgఒకానొక సమయంలో శుక్రాచార్యుని గారాలపట్టి దేవయాని ఆమె స్నేహితురాలు శర్మిష్ట లు ఒక చిన్న గొడవ పెట్టుకుంటారు.. ఆ క్రమంలో శర్మిష్ఠ నూతిలో దేవయానిని తోస్తుంది.. అలా పడిపోయిన దేవయానిని యయాతి మహారాజు కాపాడాడు.. ఆ క్రమంలో దేవయానికి యయాతి పై ప్రేమ పుడుతుంది.. ఇదే విషయాన్ని యయాతి తో చెప్పగా క్షత్రియుడైన నేను బ్రాహ్మణ అమ్మాయి అయిన నిన్ను పెళ్లి చేసుకోవడం శాస్త్ర విరుద్ధం అని చెప్పగా దేవయాని తండ్రి శుక్రాచార్యుడు శాస్త్రాన్ని సవరించి కూతురు పెళ్లి యాయతి తో చేస్తాడు .. yayathi;devayani;hari;hari music;jeevitha rajaseskhar;prema;kshatriya;marriage;history;love;girl;letter;fatherప్రపంచమంతట వ్యాపించిన రాజవంశాలకి మూలం ఈ మహారాజే..!!ప్రపంచమంతట వ్యాపించిన రాజవంశాలకి మూలం ఈ మహారాజే..!!yayathi;devayani;hari;hari music;jeevitha rajaseskhar;prema;kshatriya;marriage;history;love;girl;letter;fatherFri, 21 May 2021 10:09:29 GMTఒకానొక సమయంలో శుక్రాచార్యుని గారాలపట్టి దేవయాని ఆమె స్నేహితురాలు శర్మిష్ట లు ఒక చిన్న గొడవ పెట్టుకుంటారు.. ఆ క్రమంలో శర్మిష్ఠ నూతిలో దేవయానిని తోస్తుంది..  అలా పడిపోయిన దేవయానిని యయాతి మహారాజు కాపాడాడు.. ఆ క్రమంలో దేవయానికి యయాతి పై ప్రేమ పుడుతుంది.. ఇదే విషయాన్ని యయాతి తో చెప్పగా క్షత్రియుడైన నేను బ్రాహ్మణ అమ్మాయి అయిన నిన్ను పెళ్లి చేసుకోవడం శాస్త్ర విరుద్ధం అని చెప్పగా దేవయాని తండ్రి శుక్రాచార్యుడు శాస్త్రాన్ని సవరించి కూతురు పెళ్లి  యాయతి తో చేస్తాడు ..

అలా శర్మిష్టను కూడా తన చెలికత్తె గా తీసుకెళుతుంది దేవయాని.. శర్మిష్టను చూసిన యయాతి ఆమెను కూడా ఇష్టపడతాడు.. వారి మధ్య ప్రేమ సంబంధాన్ని దేవయాని ద్వారా తెలుసుకున్న శుక్రాచార్యుడు శర్మిష్ఠ తో సంబంధం కూడదని ఆదేశించాడు.. అయిన రహస్యంగా శర్మిష్టను వివాహం చేసుకొని కొడుకులను కంటాడు యయాతి.. ఈ విషయాన్ని తెలుసుకున్న శుక్రాచార్యుడు ఆగ్రహించి యయాతి ని నపుంసకుడు కావలసిందిగా శపిస్తాడు.. అయితే తన శాపాన్ని ఉపసంహరించుకోవల్సిందిగా ఎంతగానో ప్రాధేయపడగా శుక్రాచార్యుడు జరిగే ఓ పరిష్కారం చూపుతాడు..

నీ పుత్రులలో ఒకరు నీకు బదులుగా ముసలితనాన్ని అనుభవించడానికి అంగీకరిస్తే వారి యవ్వనాన్ని మీకు ధార పోయొచ్చునని సమాధానం ఇస్తాడు.. పురు అనే అతని చిన్న కొడుకు తండ్రి కోరికను అంగీకరించి తన యవ్వనాన్ని తండ్రికి ఇస్తాడు.. అలా వెయ్యేళ్ళ పాటు తన శారీరక వాంఛను తీర్చుకున్నాడు యయాతి.. చివరికి అతనికి తన వాంఛ పూరితమైన జీవితంపట్ల వెగటు పుట్టి భౌతిక ప్రపంచం అంటేనే విరక్తి కలిగింది.. తిరిగి తన యవ్వనాన్ని కుమారుడికి ప్రసాదించి అతనికి తన సామ్రాజ్యాన్ని కూడా ఇచ్చేసాడు.. యయాతికి దేవయాని ద్వారా ఇద్దరు, శర్మిష్ట ద్వారా ముగ్గురు పుత్ర సంతానం కలిగారు.. వారి ద్వారా ప్రపంచమంతా ఐదు రాజవంశాలు విస్తరించాయి.. యదువంశం, తుర్వసు వంశము, భోజ వంశం, గ్రీకులు, పౌర వంశము.. ఇలా ఈ యయాతి మహారాజు యొక్క వంశ చరిత్ర ప్రపంచమంతటా వ్యాపించింది..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆక్సిజన్ కోరిన డాక్టర్ కి సోను సూద్ చేయూత

త్రిష అంటే మెగా ఫ్యాన్స్‌కు ఎందుకంత కోపం?

అనుపమ పరమేశ్వరన్ ఫాలోయింగ్ మాములుగా లేదుగా..

ఆండ్రియా.. అందాలకే సరికొత్త అర్థం ఆమె అందం..!!

రేణూ దేశాయ్ కి రెండోసారి కూడా చేదు అనుభవం..

కేసీఆర్‌ను ఫాలో అవుతున్న‌ర‌ట‌.. ఎందుకంటే!

ఆపరేషన్ హుజూరాబాద్.. మొదలెట్టిన కేసీఆర్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>