PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cm-jagan-ys-jagan-8fc31ce2-fda5-4719-90bc-3613794d8bfb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cm-jagan-ys-jagan-8fc31ce2-fda5-4719-90bc-3613794d8bfb-415x250-IndiaHerald.jpgకరోనా కష్టకాలంలో కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చడం, ఇతరత్రా ఆర్థిక సాయాలతో ఏపీ ప్రభుత్వం అందరికీ ఆదర్శంగా నిలిచింది. కరోనా వైద్యంతోపాటు, బ్లాక్ ఫంగస్ ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చారు సీఎం జగన్. అంతే కాదు, కరోనాతో మరణించినవారి అంత్యక్రియలకోసం కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందిస్తోంది జగన్ సర్కారు. ఇక కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు మరో గొప్ప సాయాన్ని ప్రకటించింది ప్రభుత్వం. పిల్లలకు రూ.10లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకాన్ని ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వం కూడా ఫాలోcm jagan, ys jagan,;amala akkineni;amarinder singh;jagan;andhra pradesh;telangana;government;chief minister;job;degree;arogyasri;lie;punjabసీఎం జగన్ ని ఫాలో అవుతున్న మరో ముఖ్యమంత్రి..సీఎం జగన్ ని ఫాలో అవుతున్న మరో ముఖ్యమంత్రి..cm jagan, ys jagan,;amala akkineni;amarinder singh;jagan;andhra pradesh;telangana;government;chief minister;job;degree;arogyasri;lie;punjabFri, 21 May 2021 08:00:00 GMTఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చడం, ఇతరత్రా ఆర్థిక సాయాలతో ఏపీ ప్రభుత్వం అందరికీ ఆదర్శంగా నిలిచింది. కరోనా వైద్యంతోపాటు, బ్లాక్ ఫంగస్ ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చారు సీఎం జగన్. అంతే కాదు, కరోనాతో మరణించినవారి అంత్యక్రియలకోసం కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందిస్తోంది జగన్ సర్కారు. ఇక కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు మరో గొప్ప సాయాన్ని ప్రకటించింది ప్రభుత్వం. పిల్లలకు రూ.10లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకాన్ని ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వం కూడా ఫాలో అవుతోంది. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్.. జగన్ నిర్ణయాన్ని ఆదర్శంగా తీసుకున్నారు.

కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరిట ఏపీ ప్రభుత్వం రూ.10లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తుంది. దాని ద్వారా వచ్చే వడ్డీతో పిల్లల చదువులు, ఇతర అవసరాలు తీర్చేలా బంధువులకు బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఇలాగే పంజాబ్ లో కూడా తల్లిదండ్రుల్ని కోల్పోయిన కరోనా కారణంగా అనాథలైన పిల్లలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. అయితే ఏపీ తరహాలో భారీ ఆర్థిక సాయం ప్రకటించకుండా.. నెల నెలా 1500 రూపాయలు పింఛన్ రూపంలో అందిస్తామని చెప్పారు సీఎం అమరీందర్ సింగ్.

కొవిడ్ కారణంగా తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయిన సంతానానికి సామాజిక భ‌ద్ర‌త ఫించ‌న్ కింద నెల‌కు రూ 1500తో పాటు ఉచిత రేష‌న్ అంద‌జేస్తామని తెలిపారు. అనాథలైన పిల్లలకు డిగ్రీ వరకు ఉచితంగా ప్రభుత్వం విద్యను అందిస్తుంది. ఇక కరోనాతో కుటుంబ పెద్ద మరణిస్తే.. కుటుంబ సభ్యులకు పరిహారం అందించబోతోంది. జులై-1నుంచి ఆశీర్వాద్ అనే పథకం పంజాబ్ లో అమలులోకి రాబోతోంది. దీని ద్వారా కొవిడ్ తో మరణించినవారి కుటుంబాలకు 51వేల ఆర్థిక సాయం అందుతుంది.

మొత్తమ్మీద కరోనా కష్టకాలంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటున్నాయి. ఏపీలో కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చడంతో అటు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇప్పటికీ ప్రతిపక్షాలు ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేర్చాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దటీజ్ బాలయ్య : కోవిడ్ పేషెంట్స్ కోసం ఏం చేశారంటే?

ఇక రెండవ వాక్సిన్ కోసం మూడు నెలలు

ఏపీపై మోదీకి ఎందుకింత‌ వివ‌క్ష‌..?

చందమామ సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా..?

ఇక స్టూడెంట్స్‌కు దేవుడే దిక్కు.. బాంబే హైకోర్టు వైరాగ్యం..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రాపాకకు జగన్ హ్యాండ్ ఇచ్చేస్తారా?

ఢిల్లీ వైపు చూస్తున్న బాబు... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>