PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/amaravati-tdp-ycp-jagan6e5756f6-fa2e-413a-955a-212a46c41fcf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/amaravati-tdp-ycp-jagan6e5756f6-fa2e-413a-955a-212a46c41fcf-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి ఒక 25 సంవ‌త్స‌రాలు వెన‌క‌బ‌డిందా? ల‌క్ష‌ల కోట్ల‌రూపాయ‌ల ప్రాజెక్టు కాబ‌ట్టి.. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ కూడా డ‌బ్బులివ్వ‌లేదుకాబ‌ట్టి నిర్మాణాలేం జ‌ర‌గ‌లేదా? అమ‌రావ‌తికి మ‌ద్ద‌తు ప‌లికిన జ‌గ‌న్ ఆ త‌ర్వాత దాన్ని గురించి ఎందుకు ప‌ట్టించుకోలేదు? అనే ప్ర‌శ్న‌ల‌కు రాజ‌కీయ విశ్లేష‌కులు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు త‌మదైన శైలిలో స‌మాధానాలిస్తున్నారు. అమ‌రావ‌తి రాజ‌ధానిగా తీర్మానం చేసిన‌ప్పుడు వైసీపీ మ‌ద్ద‌తు ప‌లికింది. త‌ర్వాత ప‌నులు జ‌ర‌గ‌లేదు కాబ‌ట్టి ఆ పార్టీ మూడు రాamaravati, tdp, ycp, jagan;telugu desam party;telugu;central government;ycp;party;amaravathiఅమ‌రావ‌తి పాతికేళ్లు వెన‌క‌బ‌డిందా??అమ‌రావ‌తి పాతికేళ్లు వెన‌క‌బ‌డిందా??amaravati, tdp, ycp, jagan;telugu desam party;telugu;central government;ycp;party;amaravathiFri, 21 May 2021 12:09:28 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి ఒక 25 సంవ‌త్స‌రాలు వెన‌క‌బ‌డిందా? ల‌క్ష‌ల కోట్ల‌రూపాయ‌ల ప్రాజెక్టు కాబ‌ట్టి.. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ కూడా డ‌బ్బులివ్వ‌లేదుకాబ‌ట్టి నిర్మాణాలేం జ‌ర‌గ‌లేదా? అమ‌రావ‌తికి మ‌ద్ద‌తు ప‌లికిన జ‌గ‌న్ ఆ త‌ర్వాత దాన్ని గురించి ఎందుకు ప‌ట్టించుకోలేదు? అనే ప్ర‌శ్న‌ల‌కు రాజ‌కీయ విశ్లేష‌కులు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు త‌మదైన శైలిలో స‌మాధానాలిస్తున్నారు. అమ‌రావ‌తి రాజ‌ధానిగా తీర్మానం చేసిన‌ప్పుడు వైసీపీ మ‌ద్ద‌తు ప‌లికింది. త‌ర్వాత ప‌నులు జ‌ర‌గ‌లేదు కాబ‌ట్టి ఆ పార్టీ మూడు రాజ‌ధానులంద‌ని.. స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డి మండ‌లిలో బిల్లును అనైతికంగా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశార‌నేది వారి విశ్లేష‌ణ‌గా ఉంది. అందుకు మండ‌లి చైర్మ‌న్‌గా ఉన్న ష‌రీఫ్ స‌హ‌క‌రించారు కాబ‌ట్టి పాలాభిషేకాలు జ‌రిగాయంటున్నారు.

రాజ‌ధానికి నిధులు లేవుగా!!
అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణ‌మ‌నేది తొంద‌ర‌గా జ‌రిగిపోతుంద‌నుకున్నారు. కానీ నిధులు లేక‌పోవ‌డం, కేంద్రం నుంచి స‌హ‌కారం లేక‌పోవ‌డంతో నిర్మాణం న‌త్త‌న‌డ‌క‌న సాగింది. చంద్ర‌బాబునాయుడు భూ స‌మీక‌ర‌ణ‌తోపాటు దేశ‌, విదేశాల నుంచి నిధులు స‌మీక‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న క్ర‌మంలో మోడీతో గొడ‌వ‌ప‌డ‌టం కూడా రాజ‌ధాని నిర్మాణానికి శాపంగా మారింద‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు అంటున్నారు. 25 సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డితేకానీ అమ‌రావ‌తి ఒక రూపుకు రాద‌నే భావ‌న వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మూడు రాజ‌ధానుల బిల్లుకు మండ‌లిలో త‌న‌కున్న బ‌లంతో తెలుగుదేశం అడ్డుప‌డింది. అందుకు చైర్మ‌న్‌గా ఉన్న ష‌రీఫ్ స‌హ‌క‌రించార‌ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్ర‌చారం చేసుకున్నాయి.

తాను తీసుకుంది దైవ నిర్ణ‌య‌మ‌న్న ష‌రీఫ్‌!
మండ‌లిలో ఆరోజు తాను తీసుకున్న నిర్ణ‌యం దైవ‌నిర్ణ‌య‌మ‌ని ష‌రీఫ్ అన్నారు. త‌న‌కు జ‌రిగిన వీడ్కోలు కార్య‌క్ర‌మంలో ష‌రీఫ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. తాను ఎప్పుడు క‌న‌ప‌డినా జ‌గ‌న్ ఆప్యాయంగా ప‌ల‌క‌రించేవార‌ని, నాపై ఆయ‌న ముఖ క‌వ‌ళిక‌ల్లో ఎక్క‌డా వ్య‌తిరేక‌త వ్య‌క్తం కాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింద‌న్నారు. అందుకు జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాన‌న్నారు. ఈ మాట‌ల‌ను వైసీపీ నేత‌లు త‌మ‌కు అనుకూలంగా ప్ర‌చారం చేసుకున్నారు. చూశారుక‌దా.. ష‌రీఫ్ త‌మ నేత గురించి, పార్టీ గురించి ఏమ‌న్నారో అని చెబుతున్నారు. వాస్త‌వానికి అక్క‌డ జ‌రిగింది.. అక్కడ మాట్లాడింది విశ్లేషిస్తే.. ఒక వ్య‌క్తి త‌న ప‌ద‌వి నుంచి దిగిపోయేట‌ప్పుడో, ఉద్యోగం నుంచి ప‌ద‌వీ విర‌మ‌ణ చేసేట‌ప్పుడో త‌న‌కు స‌హ‌క‌రించిన‌వారికి, స‌హ‌క‌రించ‌నివారికి అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తారు. ఎందుకంటే శేష జీవితాన్ని ప్ర‌శాంతంగా గ‌డుపుదామ‌నే ఆలోచ‌న‌లో ఆ మ‌నిషి ఉంటారు. కాబ‌ట్టి ప్ర‌త్యేకంగా ఎవ‌రితోను క‌య్యం ఉండ‌కూడ‌ద‌ని వారి భావ‌న‌. మ‌నిషి స‌హ‌జంగా అలానే ఆలోచిస్తార‌ని సామాజిక‌వేత్త‌లు అంటున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోహన్ లాల్ తో చరణ్.. ఏమన్నాడంటే ..!

కుర్రకారును కట్టిపడేస్తున్న మలైకా.. ఎంతలా అంటే..?

ఇక ఓవ‌ర్సీస్ మార్కెట్, క‌లెక్ష‌న్లు క‌లేనా ?

త‌న అందాల‌తో కుర్రాళ్ల‌ను మ‌త్తులోకి దించుతున్న యాంక‌ర్‌

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ర‌ద్దుకు అదే కార‌ణ‌మా ?

అన్న విషయంలో జూనియర్ ఎందుకలా... ?

బ్రేకింగ్‌: హైకోర్టు తీర్పుతో వైసీపీకి అదిరిపోయే షాక్‌...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>