MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tolly64c08cef-320c-44e1-9ff4-8ad0284854d0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tolly64c08cef-320c-44e1-9ff4-8ad0284854d0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఇపుడు విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. చేయాల్సిన పనులన్నీ పెండింగులో ఉన్నాయి. యాక్టివిటీస్ అన్నీ కూడా మూలన‌ పడ్డాయి. దానికి కారణం కరోనా అన్న సంగతి తెలిసిందే. కరోనా తగ్గాక మొత్తం చిత్ర పరిశ్రం ఫుల్ బిజీ అవుతుంది అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ;pawan;ntr;prabhas;venkatesh;balakrishna;gopichand;jr ntr;kalyan;koratala siva;prasanth;prashanth neel;tara;tollywood;rrr movie;hero;prasanth neel;house;arjun 1;prashant kishor;pawan-kalyan;allu arjun;chiranjeevi;cinema;anil music;nag ashwin;naga aswinహౌస్ ఫుల్ అంటున్న టాప్ స్టార్స్... ?హౌస్ ఫుల్ అంటున్న టాప్ స్టార్స్... ?;pawan;ntr;prabhas;venkatesh;balakrishna;gopichand;jr ntr;kalyan;koratala siva;prasanth;prashanth neel;tara;tollywood;rrr movie;hero;prasanth neel;house;arjun 1;prashant kishor;pawan-kalyan;allu arjun;chiranjeevi;cinema;anil music;nag ashwin;naga aswinFri, 21 May 2021 19:00:00 GMTటాలీవుడ్ లో ఇపుడు విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. చేయాల్సిన పనులన్నీ పెండింగులో ఉన్నాయి. యాక్టివిటీస్ అన్నీ కూడా మూలన‌ పడ్డాయి. దానికి కారణం కరోనా అన్న సంగతి తెలిసిందే. కరోనా తగ్గాక మొత్తం చిత్ర పరిశ్రం ఫుల్ బిజీ అవుతుంది అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇదిలా ఉంటే టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ రెండేసి మూడేసి సినిమాలు ఒప్పుకున్నారు. అయితే కరోనాతో షూటింగ్స్ అన్నీ కూడా వాయిదా పడ్డాయి. కరోనా తీవ్రత తగ్గాక ముందుగా సెట్స్ మీద ఉన్న సినిమాల మీద అందరూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో కొత్తగా కమిట్ అయిన  ప్రాజెక్టులు విషయం కూడా చూడాలి. అలా కనుక ఆలోచించుకుంటే కచ్చితంగా ఇక్కడ నుంచి రెండేళ్ల పాటు టాలీవుడ్ హీరోలు అంతా కంప్లీట్ బిజీ అవుతారు. మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం చేస్తున్న ఆచార్య మూవీ సెట్స్ మీద ఉంది.

మూవీ తరువాత లూసీఫర్ తో పాటు మరో రెండు మూవీస్ ని కూడా ఆయన లైన్ లో పెట్టారు. ఇవన్నీ కంప్లీట్ కావాలంటే 2023 వరకూ సరిపోతుంది అంటున్నారు. బాలయ్య విషయానికి వస్తే ఆయన నటిస్తున్న అఖండ మూవీ కొంత  పార్ట్ ఇంకా షూటింగ్ దశలో ఉంది. ఆ తరువాత గోపీచంద్ మలినేని మూవీ కూడా ఉంది. ఇక అనిల్ రావిపూడితో మూవీ అంటున్నారు. ఇవన్నీ చూస్తే కచ్చితనా బాలయ్య కూడా 2023 వరకూ బిజీ అనుకోవాలి.

ఇక వెంకటేష్ చేతుల్లో కూడా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఎఫ్ త్రీ తరువాత ఆయన తన 75వ చిత్రం మీద దృష్టి పెడతారు అంటున్నారు. నాగ్ కూడా మూడు నాలుగు ప్రాజెక్టులను కమిట్ అయి ఉన్నారు. అలాగే అల్లు అర్జున్ పుష్ప మూవీ రెండవ పార్ట్ తో పాటు మరో రెండు కొత్త ప్రాజెక్టులకు కమిట్ అయ్యారు. జూనియర్ ఎన్టీయార్ అయితే ఆర్.ఆర్.ఆర్ పెండింగ్ వర్క్ పూర్తి చేశాక కొరటాల శివతో పాటు ప్రశాంత్ నీల్ మూవీ చేయాలి. పవన్ కళ్యాణ్ విషయానికే వస్తే నాలుగైదు సినిమాలు చేతిలో ఉన్నాయి. ఇక ప్రభాస్ అయితే  ఆదిపురుష్, సలార్ తో పాటు నాగ్ అశ్విన్ మూవీస్ చేయాలి. ఇలా చూసుకుంటే ఏ పెద్ద హీరో కూడా ఖాళీగా మాత్రం ఉండే సీన్ లేదు అంటున్నారు.
           



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడానికి కారణం ఆదేనా ?

అక్కినేని సుమంత్ ఆ 5 సినిమాలు చేసుంటే.. !

రఘురామ ఎపిసోడ్ లో ఆ ఒక్క తప్పూ... ?

రవితేజ మూడు లక్షల రూపాయల హీరో.. దర్శకుడి కామెంట్స్ వైరల్.. ?

మరో హీరోను లాక్ చేసిన మాటల మాంత్రికుడు..?

టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడుతున్న వైసీపీ యువ‌నేత‌

బ్రేకింగ్ : రఘురామ కు విముక్తి.. బెయిల్ మంజూరు ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>