MoviesMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/rajamouli-rrr4e15203a-e026-4240-be85-32ba3a32d894-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/rajamouli-rrr4e15203a-e026-4240-be85-32ba3a32d894-415x250-IndiaHerald.jpgద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి సినిమా అంటేనే ఊహించ‌ని ట్విస్టుల‌కూ, ఉత్కంఠ క‌లిగించే స‌న్నివేశాల‌కూ కొద‌వ ఉండ‌దు. అందుకే అత‌డి చిత్రాలంటే ప్రేక్ష‌కుల్లో అంత క్రేజ్‌. అయితే ఇప్పుడు జ‌క్క‌న్న త‌న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ విష‌యంలోనూ ప్ర‌స్తుతం ఇలాంటి ఉత్కంఠనే క‌లిగిస్తున్నాడు. క‌రోనా వైర‌స్ రెండో వేవ్ ప్ర‌భావం నిర్మాణంలో ఉన్న చిత్రాల‌తోపాటు, రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న‌వాటిపైనా గ‌ట్టిగానే ప‌డిన విష‌యం తెలిసిందే. Rajamouli-RRR;rajamouli;komaram bheem;rrr movie;cinemaఆర్ఆర్ఆర్ రిలీజ్ ఆ డేట్ కే జక్కన్న ఫిక్స్ అయ్యాడా..?ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఆ డేట్ కే జక్కన్న ఫిక్స్ అయ్యాడా..?Rajamouli-RRR;rajamouli;komaram bheem;rrr movie;cinemaFri, 21 May 2021 05:00:00 GMTద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి సినిమా అంటేనే ఊహించ‌ని ట్విస్టుల‌కూ, ఉత్కంఠ క‌లిగించే స‌న్నివేశాల‌కూ కొద‌వ ఉండ‌దు. అందుకే అత‌డి చిత్రాలంటే ప్రేక్ష‌కుల్లో అంత క్రేజ్‌. అయితే ఇప్పుడు జ‌క్క‌న్న త‌న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ విష‌యంలోనూ ప్ర‌స్తుతం ఇలాంటి ఉత్కంఠనే క‌లిగిస్తున్నాడు. క‌రోనా వైర‌స్ రెండో వేవ్ ప్ర‌భావం నిర్మాణంలో ఉన్న చిత్రాల‌తోపాటు, రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న‌వాటిపైనా గ‌ట్టిగానే ప‌డిన విష‌యం తెలిసిందే.  ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏ సినిమా ఎప్పుడొస్తుందో చెప్ప‌డం ఎవ‌రికీ సాధ్యం కాని ప‌ని. పెద్ద సినిమాలకైతే ఈ ఇబ్బందులు మ‌రింత ఎక్కువ‌నే చెప్పాలి. ఇక రాజ‌మౌళి సాధార‌ణ ప‌రిస్థితుల్లోనే త‌న చిత్రాల‌ను పూర్తి చేసేందుకు సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి స‌మ‌యం తీసుకుంటాడు. క్వాలిటీ విష‌యంలో రాజీప‌డ‌టం అనేది అత‌డి డిక్ష‌న‌రీ లోనే విషయం కాబ‌ట్టి అది త‌ప్ప‌దు.
 
 రాజ‌మౌళి- తార‌క్‌- చెర్రీ కాంబోలో తెర‌కెక్కుతున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం రౌద్రం ర‌ణం రుధిరం  విడుద‌ల ఈ నేప‌థ్యంలోనే  ప‌లుసార్లు వాయిదా ప‌డింది. ఈ అక్టోబ‌రు 13న ఈ సినిమా తీస్తుకొస్తున్నామ‌ని చిత్ర‌బృందం ఎప్పుడో ప్ర‌క‌టించేసింది.అయితే కోవిడ్ కార‌ణంగా ఈ సినిమా ఇక ఈ ఏడాది రావ‌డం దాదాపు అసాధ్య‌మేన‌ని చిత్ర ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు ఇప్ప‌టికే ఫిక్స్ అయిపోయాయి.  ఇక్క‌డే రాజ‌మౌళి త‌న మార్కు ట్విస్ట్ చూపించాడు. ఇది ఉద్ధేశ‌పూర్వ‌కంగా జ‌రిగిన ప్ర‌చార కార్య‌క్ర‌మంలో భాగ‌మో, మ‌రొక‌టో తెలియ‌దు కానీ.. తాజాగా విడుద‌లైన కొమ‌రం భీమ్ పోస్ట‌ర్ లో రిలీజ్ డేట్ కూడా కనిపించింది. అక్టోబరు 13న ఈ సినిమాని విడుద‌ల చేస్తున్న‌ట్టుగా చిత్ర‌బృందం పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించిది. ఇప్పుడిది ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో వేడి పుట్టిస్తోంది. ప్ర‌స్తుతం అన్నిసినిమాల విడుద‌ల డేట్‌లూ వాయిదా వేసుకుంటూ వెళుతున్న స‌మ‌యంలో.. రాజ‌మౌళి ఆర్‌.ఆర్‌.ఆర్  ముందుగా ప్ర‌క‌టించిన తేదీన ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశాలున్నాయా అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే జ‌క్క‌న్న చిత్రం వాయిదా ఖాయం కాబ‌ట్టి తమ చిత్రాల విడుద‌ల‌కు స‌న్న‌ద్ద‌మ‌వుతున్న ఇత‌ర నిర్మాత‌ల‌కు ఆర్‌.ఆర్‌.ఆర్ విష‌యంలో రాజ‌మౌళి ఏం చేయ‌ద‌లుచుకున్నాడ‌నేది కొరుకుడు ప‌డ‌టంలేదు.  జ‌క్క‌న్న చిత్రం సంక్రాంతికి వ‌స్తే ఆ స‌మ‌యంలో త‌మ సినిమా లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుందామ‌నుకున్నవారు ఇప్పుడు ఏం చేయాలో తెలియ‌క అయోమ‌యంలో ప‌డ్డారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఢిల్లీ వైపు చూస్తున్న బాబు... ?

శ్యామ్ సింగరాయ్ : ఒక్క రాత్రిలో కోట్ల నష్టం!

రఘురామ బెయిల్ పై తీవ్ర ఉత్కంఠ... ?

డైరెక్ట్ అటాక్ .. నో కాంప్ర‌మైజ్ .. కేసీఆర్ కీల‌క నిర్ణ‌యాలు

ఎన్టీఆర్ లోని రొమాంటిక్ యాంగిల్ ను కూడా పరిచయం చేసిన బృందావనం..ఇద్దరితో..!!

'ఎన్టీఆర్' వాడే '9999' నెంబర్ వెనక ఉన్న అసలు రహస్యం అదే..!!

ఈ ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగ్స్ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>