PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-cf4643f7-3417-4552-a467-e877f3f055ca-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-cf4643f7-3417-4552-a467-e877f3f055ca-415x250-IndiaHerald.jpgమోడీ వంటి బలమైన ప్రధాని విషయంలో ఏం మాట్లాడాలి అన్నా కూడా కొంత జంకు ఉండేది. అయితే అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత కొంత సీన్ మారింది అనే చెప్పాలి. మోడీని కేంద్రాన్ని విమర్శించేందుకు చాలా రాష్ట్రాలు రెడీగా ఉన్నాయి. అదే సమయంలో పెండింగులో ఉన్న అనేక అంశాల మీద కూడా మోడీని గట్టిగా అడగాలని కొందరు సీఎంలు భావిస్తున్నారుట. modi;modi;hema;hemanth;jagan;andhra pradesh;mp;industries;vishakapatnam;cm;prime minister;assembly;heart;jharkhand;partyమోడీని ఢీ కొట్టేందుకు రెడీ... ?మోడీని ఢీ కొట్టేందుకు రెడీ... ?modi;modi;hema;hemanth;jagan;andhra pradesh;mp;industries;vishakapatnam;cm;prime minister;assembly;heart;jharkhand;partyFri, 21 May 2021 20:00:00 GMTమోడీ వంటి బలమైన ప్రధాని విషయంలో ఏం మాట్లాడాలి అన్నా కూడా కొంత జంకు ఉండేది. అయితే అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత కొంత సీన్ మారింది అనే చెప్పాలి. మోడీని కేంద్రాన్ని విమర్శించేందుకు చాలా రాష్ట్రాలు రెడీగా ఉన్నాయి. అదే సమయంలో పెండింగులో ఉన్న అనేక అంశాల మీద కూడా మోడీని గట్టిగా అడగాలని కొందరు సీఎంలు భావిస్తున్నారుట.

ఇక ఏపీ విషయానికి వస్తే జగన్ మోడీని మొదటి నుంచి ఏమీ విమర్శించడంలేదు. పైగా కరోనా రెండవ దశలో మోడీకి అంతా సహకరించాలని ఆయన తాజాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కి సూచించారు. ఇదిలా ఉంటే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో మాత్రం మోడీ సర్కార్ తోనే  తేల్చుకోవాలనే జగన్ నిర్ణయించరా అన్న డౌట్లు అయితే అందరిలో ఉన్నాయి.

నిజానికి ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో అసెంబ్లీ తీర్మానం చేసింది అంటే కచ్చితంగా మోడీని ఢీ కొట్టేందుకే అన్న మాట కూడా వినిపిస్తోంది. దానికి తగినట్లుగా ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే ఢిల్లీకు విశాఖ ఉక్కు గుండె చప్పుడు వినిపిస్తామని అంటున్నారు. ఈ విషయంలో అసలు రాజీపడమని కూడా చెబుతున్నారు. అంటే ఒక విధంగా ప్రైవేటీకరణ విషయంలో అమీ తుమీ తేల్చుకుంటామని చెప్పడమే అంటున్నారు. మరి కేంద్రమేమో ప్రైవేటీకరణ మా పాలసీ అంటోంది. సరిగ్గా ఇక్కడే వస్తోంది లడాయి. దాంతో మోడీ తో జగన్ మంచిగానే ఉంటూ స్టీల్ ప్రైవేటీకరణను ఆపుతారా లేక గట్టిగానే దీని మీద నిలబడతారా అన్నది చూడాల్సి ఉంది. స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ ఇంతలా పట్టుపట్టడానికి కూడా కారణాలు ఉన్నాయని అంటున్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రతిపాదిస్తున్న జగన్ కి విశాఖ స్టీల్ కనుక ప్రైవేట్ పరమైతే  అది ఇబ్బందిగానే ఉంటుంది. దాంతోనే ప్రతిష్టగా తీసుకుంటున్నారు అంటున్నారు. పైగా విశాఖలో అతి పెద్ద పరిశ్రమ కూడా అదే కావడంతోనే సీరియస్ ఇష్యూగా అవుతోంది.










Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడానికి కారణం ఆదేనా ?

అక్కినేని సుమంత్ ఆ 5 సినిమాలు చేసుంటే.. !

రఘురామ ఎపిసోడ్ లో ఆ ఒక్క తప్పూ... ?

రవితేజ మూడు లక్షల రూపాయల హీరో.. దర్శకుడి కామెంట్స్ వైరల్.. ?

మరో హీరోను లాక్ చేసిన మాటల మాంత్రికుడు..?

టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడుతున్న వైసీపీ యువ‌నేత‌

బ్రేకింగ్ : రఘురామ కు విముక్తి.. బెయిల్ మంజూరు ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>