PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/corona90557c80-b383-42fa-9d4f-cdd30eea915e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/corona90557c80-b383-42fa-9d4f-cdd30eea915e-415x250-IndiaHerald.jpgదేశ వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు ఆయుష్ కమిషనర్ రాములు బృందం కొద్ది సేపటి క్రితమే వచ్చింది. ఆనందయ్య తయారుచేసే వివిధ చెట్ల ఆకులు, పదార్థాలు పరిశీలించి, తయారీ విధానాన్ని బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఆ ఆయుర్వేద మందులో ఏమేమి వస్తువులు కలుపుతున్నారు ? ఎలా తయారు చేస్తున్నారు ? అనే విషయాలను దగ్గరుండి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇక ఈ ఆయుర్వేద మందు వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా లేదా అనే విషయంపై ఐసీఎంఆర్ బృందం దృష్టి పెట్టినట్టు సమాచారం. అలాగే వైద్యం తీసుకుcoronavirus;kumaar;anil music;ramu;andhra pradesh;district;ayurveda;central government;anil kumar singhal;krishnapatnam portకృష్ణపట్నంలో ముగిసిన ఐసిఎంఆర్ బృందం పర్యటన.. ఏమన్నారంటే?కృష్ణపట్నంలో ముగిసిన ఐసిఎంఆర్ బృందం పర్యటన.. ఏమన్నారంటే?coronavirus;kumaar;anil music;ramu;andhra pradesh;district;ayurveda;central government;anil kumar singhal;krishnapatnam portFri, 21 May 2021 21:06:23 GMTదేశ వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు ఆయుష్ కమిషనర్ రాములు బృందం కొద్ది సేపటి క్రితమే వచ్చింది.  ఆనందయ్య తయారుచేసే వివిధ చెట్ల ఆకులు,  పదార్థాలు పరిశీలించి, తయారీ విధానాన్ని  బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఆ ఆయుర్వేద మందులో ఏమేమి వస్తువులు కలుపుతున్నారు ? ఎలా తయారు చేస్తున్నారు ? అనే విషయాలను  దగ్గరుండి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇక ఈ ఆయుర్వేద మందు వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా లేదా అనే విషయంపై ఐసీఎంఆర్ బృందం దృష్టి పెట్టినట్టు సమాచారం. 


అలాగే వైద్యం తీసుకున్న వారి దగ్గరికి వెళ్లి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నారని అంటున్నారు. నివేదిక రెండు మూడు రోజుల్లో వస్తుందని చెబుతున్నారు. ఇక అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఆనందయ్య గారు లేరని ఆయన వచ్చిన తర్వాత మళ్లీ ఒకసారి వచ్చి పరిశీలన చేస్తామని పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఒక నెగెటివ్ మార్కు కూడా లేదు... మొత్తం అంత ఫాస్ట్ గానే ఉందని, త్వరగా నివేదిక వచ్చేలా చూస్తామని వారు పేర్కొన్నారు. ఇక అంతకుముందు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ ఆనందయ్య ఆయుర్వేద చికిత్సపై అధ్యయనం జరుగుతోందని అన్నారు. 


కేంద్ర ఆయుష్ శాఖ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపామని పేర్కొన్న ఆయన ఆయుష్ విభాగం అధ్యయనం చేయనుందని, ఏపీ ఆయుష్ కమిషనర్ ఇప్పటికే వెళ్లారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన అధ్యయనంలో ఆనందయ్య ఆయుర్వేదం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదనే చెబుతున్నారని హానికారకాలు ఉన్నట్టు తేలలేదని చెప్పుకొచ్చారు. అయితే శాస్త్రీయపరంగా మరింత అధ్యయనం చేయాల్సి ఉందని అన్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్కినేని సుమంత్ ఆ 5 సినిమాలు చేసుంటే.. !

రఘురామ ఎపిసోడ్ లో ఆ ఒక్క తప్పూ... ?

రవితేజ మూడు లక్షల రూపాయల హీరో.. దర్శకుడి కామెంట్స్ వైరల్.. ?

మరో హీరోను లాక్ చేసిన మాటల మాంత్రికుడు..?

టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడుతున్న వైసీపీ యువ‌నేత‌

బ్రేకింగ్ : రఘురామ కు విముక్తి.. బెయిల్ మంజూరు ..!

హంసలాంటి అందాల నిధి..హంసా నందిని..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>