PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/israeld59a7865-5a67-4532-8f4f-4fec63c59c69-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/israeld59a7865-5a67-4532-8f4f-4fec63c59c69-415x250-IndiaHerald.jpgమరోసారి పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య అప్రకటిత యుద్ధంగా సాగుతోంది. వారం నుంచి నడుస్తున్న ఈ ఘర్షణలో 200 మంది వరకూ పాలస్తీనావాసులు మరణించారు. ఇజ్రాయిల్ నుంచి ప్రాణనష్టం 20లోపే ఉండొచ్చంటున్నారు. హమాస్ నేతలందరినీ చంపేవరకూ యుద్ధం ఆపబోమంటున్నారు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు. అయితే భారత్‌లోని క్రైస్తవులు ఇజ్రాయిల్‌కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే అది సరికాదంటున్నారు ఇండస్‌ మార్టిన్ అనే విశ్లేషకులు. ఆయన వాదన ఏమిటంటే.. “ మా ముత్తాతకు కలలో దేవుడు కనబడి మీ పొలాన్ని మా వంశానisrael;deva;dharma;manu;tara;kamma;prime minister;population;war;sanskrit;local language;international;hindus;lieఇజ్రాయిల్-పాలస్తీనా యుద్ధం: భారత క్రైస్తవులకు ఓ ప్రశ్న..?ఇజ్రాయిల్-పాలస్తీనా యుద్ధం: భారత క్రైస్తవులకు ఓ ప్రశ్న..?israel;deva;dharma;manu;tara;kamma;prime minister;population;war;sanskrit;local language;international;hindus;lieFri, 21 May 2021 08:13:00 GMTమరోసారి పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య అప్రకటిత యుద్ధంగా సాగుతోంది. వారం నుంచి నడుస్తున్న ఈ ఘర్షణలో 200 మంది వరకూ పాలస్తీనావాసులు  మరణించారు. ఇజ్రాయిల్ నుంచి ప్రాణనష్టం 20లోపే ఉండొచ్చంటున్నారు. హమాస్ నేతలందరినీ చంపేవరకూ యుద్ధం ఆపబోమంటున్నారు  ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు. అయితే భారత్‌లోని క్రైస్తవులు ఇజ్రాయిల్‌కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే అది సరికాదంటున్నారు ఇండస్‌ మార్టిన్ అనే విశ్లేషకులు.

ఆయన వాదన ఏమిటంటే..
“ మా ముత్తాతకు కలలో దేవుడు కనబడి మీ పొలాన్ని మా వంశానికి దారాదత్తం చేస్తాను అని ప్రామిస్ చేశాడు. కాబట్టి మీ పొలం ఇక మాదే. మీరు తక్షణం ఇక్కడినుండి దయచేయండి. కాదూ కూడదూ ఇది మాపొలమే అని మీరు అంటే, మా వాగ్ధాన హక్కును కాలరాస్తున్నందుకు మిమ్మల్ని తన్ని తగలేస్తాం. మా ముత్తాతకు కలవచ్చిందని పొరుగున ఉన్న అనేక మంది పెద్ద ఆసాములు కూడా నమ్మి మాకు సాయంగా నిలబడుతున్నారు. ఇక మీ ఆటలు సాగవు.
 
ఇలా ఎవరైనా మాట్లాడితే మీరేం చేస్తారూ? ఇది న్యాయం అంటారా లేక దోపిడీ అంటారా? సరిగ్గా ఇదే చేస్తుంది ఇజ్రాయేల్. క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాలకు పూర్వం, అంటే ఇప్పటికి 4000 ఏళ్ళకు ముందు తమ మూలపురుషుడైన అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై పాలస్తీనా దేశాన్ని మీ భవిష్య తరాలకు స్వాధీనంగా ఇస్తాను. నాకు విధేయులై ఉండండి అని చెప్పాడంట. కాబట్టి అది వాళ్ళ వాగ్ధాన భూమి అంటా. అందుకే ప్రపంచలో నలుమూలలా ఎన్నో దేశాల్లో వివిద సంస్కృతులలో స్థిరపడిన యూదులు అందరూ ఒక మాట అనుకుని 1882 నుండి 1948 వరకూ మిలియన్ల మంది అప్పటికే అంతర్జాతీయ గుర్తింపు కలిగిన పాలస్తీనా అనే దేశంలోకి వలస వెళ్ళారు.

తమ జనాభా సంఖ్యను పదేళ్ళకు ఒకసారి డబుల్ సైజుకు పెంచుకుంటూ లోకల్ పాలస్తీనీయులను అల్పసంఖ్యాక వర్గంగా చేసి వాళ్ళ భూమిని లాగేసుకుని అది తమ వాగ్ధాన భూమి కాబట్టి దానిమీద హక్కు తమదే అన్నారు. అన్నట్టుగానే పాలస్తీనా ప్రజల్ని అన్నివైపులనుండీ కమ్ముకుని మధ్యలో ఒక చిన్న వృత్తానికి పరిమితం చేసి చుట్టూ ఉన్న భూభాగాన్ని ఇజ్రాయేల్ దేశంగా ప్రకటించుకున్నారు. ఇందుకు సహాయ పడిన పెద్దతలలు బ్రిటన్, అమెరికాలు. తమ భూమి విముక్తి కోసం పోరాడుతున్న పాలస్తీనీయులు ప్రస్తుతం టెర్రరిస్టులు అని పిలవబడుతున్నారు. ఇది న్యాయమేనా?
 
ఇక్కడ క్రైస్తవ సమాజానికి ఒక ప్రశ్న. ఒకవేళ నాలుగు వేల ఏళ్ళ క్రితం దేవుడు ప్రత్యక్షమై ఫలానా భూమిని మాకు రాసిచ్చాడు అని ఇజ్రాయేల్ చెప్పే మాట మీకు సమ్మతం అయితే, 1500 ఏళ్ళక్రితం వేదాలలో, మనుధర్మంలో, భగవద్గీతలో, రామాయణ మహాభారతాల్లో రాసిన వర్ణ, కుల వివక్షల వ్యవస్థకూడా అదే దేవుడు/ దేవుళ్ళ ఆజ్ఞ అనేకదా హిందువులు చెబుతారు. మరి ఇదికూడా మీరు అంగీకరిస్తారా? లేక ఇక్కడ తిరస్కరించి మీ మతవిశ్వాసాలకు దగ్గరగా ఉన్న ఇజ్రాయేల్ గూండాయిజాన్ని అక్కడ మాత్రం సమర్ధిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు ఇండస్ మార్టిన్. ఆలోచించాల్సిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దటీజ్ బాలయ్య : కోవిడ్ పేషెంట్స్ కోసం ఏం చేశారంటే?

ఆపరేషన్ హుజూరాబాద్.. మొదలెట్టిన కేసీఆర్..

సీఎం జగన్ ని ఫాలో అవుతున్న మరో ముఖ్యమంత్రి..

ఇక రెండవ వాక్సిన్ కోసం మూడు నెలలు

ఏపీపై మోదీకి ఎందుకింత‌ వివ‌క్ష‌..?

చందమామ సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా..?

ఇక స్టూడెంట్స్‌కు దేవుడే దిక్కు.. బాంబే హైకోర్టు వైరాగ్యం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>