PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kamal2df2ddef-4110-4dd4-80c6-6df3f4fdffa0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kamal2df2ddef-4110-4dd4-80c6-6df3f4fdffa0-415x250-IndiaHerald.jpgసినిమా నటుడుగా కమల్ హాసన్ విశ్వవిఖ్యాతమైన ఖ్యాతిని గడించారు. ఆయన వేయని పాత్ర లేదు. చేయని ప్రయోగం లేదు. కమల్ అంటే జాతీయ నటుడు అన్న పేరు తెచ్చుకున్నారు. ఆయన సూపర్ స్టార్ గా కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. kamal;kamal hassan;uday kiran;udhayanidhi stalin;2019;cinema;rajani kanth;assembly;tamilnadu;stalin;party;jayalalithaగో టూ పెవిలియన్ అంటున్న కమల్... ?గో టూ పెవిలియన్ అంటున్న కమల్... ?kamal;kamal hassan;uday kiran;udhayanidhi stalin;2019;cinema;rajani kanth;assembly;tamilnadu;stalin;party;jayalalithaFri, 21 May 2021 22:00:00 GMTసినిమా నటుడుగా కమల్ హాసన్ విశ్వవిఖ్యాతమైన ఖ్యాతిని గడించారు. ఆయన వేయని పాత్ర లేదు. చేయని ప్రయోగం లేదు. కమల్ అంటే జాతీయ నటుడు అన్న పేరు తెచ్చుకున్నారు. ఆయన సూపర్ స్టార్ గా కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నారు.

అలాంటి కమల్ తన సినీ అభిమానాన్ని రాజకీయాల వైపు మళ్ళించుకోవడానికి చేసిన ప్రయత్నం మాత్రం విఫలం అయింది. కమల్ 2019 ఎన్నికల్లో తన పార్టీ మక్కల్ నీది మయ్యమ్ తరఫున లోక్ సభకు అభ్యర్ధులను నిలబెడితే భారీ ఓటమి ఎదురు అయింది. ఇక ఇపుడు చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా కమల్ హాసనే ఓటమి పాలు అయ్యారు.

ఈ పరిణామాలకు తోడు పార్టీ కమల్ మరొకరు తప్ప అందరి డిపాజిట్లూ కూడా గల్లంతు అయ్యాయని అంటున్నారు. ఒక విధంగా తమిళనాడు జనం అయితే డీఎంకే, లేకపోతే అన్నాడీఎంకే పార్టీతోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక డీఎంకే తరఫున సీఎం అయిన స్టాలిన్ విశేష అనుభవం ఉన్నవాడు. ఆయన సీఎం అయ్యాడు అంటే కచ్చితంగా మరిన్ని టెర్ములు పార్టీని అధికారంలోకి తెచ్చే సత్తా కలిగిన వాడే అవుతాడు అంటున్నారు. ఆయన కుమారుడు ఉదయ్ స్టాలిన్ కూడా వారసుడిగా ఉన్నాడు.

అంటే తమిళనాడులో  మరికొన్నేళ్ల పాటు డీఎంకేకు ఎదురులేదు అనుకోవచ్చు. అదే సమయంలో అన్నాడీఎంకే పరిస్థితి ఏంటి అంటే అక్కడ కూడా క్యాడర్ గట్టిగా ఉంది. సరైన సారధి ఉంటే మాత్రం డీఎంకేకు పోటీ ఇస్తుంది. జయలలిత మరణించి అయిదేళ్ళు అయినా కూడా పార్టీ చీలలేదు అంటే పునాది గట్టిదే అని చెప్పుకోవాలి. పార్టీ ఉంటే నాయకుడు తయారు కావడం విశేషం కాదు. అందువల్ల తమిళ‌నాడులో సీన్ చూస్తే ఆ రెండు పార్టీల మధ్యనే ఉంది అని అర్ధమవుతున్న వేళ కమల్ ఇక తన పార్టీని నడిపించగలరా అన్న డౌట్లు వస్తున్నాయట. ఇపుడు కమల్ వయసు 67 ఏళ్ళు. మరో అయిదేళ్ళకు అంటే 72 ఏళ్ళు కమల్ కి వస్తాయి. ఇక ఈ అయిదేళ్ళూ పార్టీని నడపడమూ కష్టమే. దానితో పాటు బలమైన పునాది లేకపోవడం, ఉన్న నాయకులు కూడా తప్పుకోవడంతో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడింది అంటున్నారు. మొత్తానికి కమల్ రాజకీయాలను పక్కన పెడతారు అన్న మాట మాత్రం ప్రచారంలో ఉంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాజ‌స్థాన్ లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిలిచేనా..?

అక్కినేని సుమంత్ ఆ 5 సినిమాలు చేసుంటే.. !

రఘురామ ఎపిసోడ్ లో ఆ ఒక్క తప్పూ... ?

రవితేజ మూడు లక్షల రూపాయల హీరో.. దర్శకుడి కామెంట్స్ వైరల్.. ?

మరో హీరోను లాక్ చేసిన మాటల మాంత్రికుడు..?

టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడుతున్న వైసీపీ యువ‌నేత‌

బ్రేకింగ్ : రఘురామ కు విముక్తి.. బెయిల్ మంజూరు ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>