PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-19c4963d4c-4038-413a-aca1-f683cef3d97c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-19c4963d4c-4038-413a-aca1-f683cef3d97c-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ కరోనా కట్టడి కావడం లేదు. దేశంలో కరోనా బారిన పడిన వారిని రక్షించేందుకు డాక్టర్లు, మహమ్మారి బారిన ఇక ఎవరు పడకుండా చూసేందుకు పోలీసు, పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా తమ విధులు..covid-19;delhi;central government;indianకరోనా కాటుకు వైద్యులూ బలి.. రోజూ అంతమందా..?కరోనా కాటుకు వైద్యులూ బలి.. రోజూ అంతమందా..?covid-19;delhi;central government;indianFri, 21 May 2021 18:24:00 GMTన్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ కరోనా కట్టడి కావడం లేదు. దేశంలో కరోనా బారిన పడిన వారిని రక్షించేందుకు డాక్టర్లు, మహమ్మారి బారిన ఇక ఎవరు పడకుండా చూసేందుకు పోలీసు, పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా తమ విధులు నిర్వర్తుస్తున్నారు. అందులోనూ డాక్టర్లు తమ ప్రాణాలను ప్రమాదంలో పెట్టి మరీ రోగుల ప్రాణాలను కాపాడుతున్నారు.


అయితే కరోనా దెబ్బకు వైద్యులు విలవిలలాడుతున్నారు. ప్రతి రోజు ఎందరో వైద్యులు కరోనా బారిన పడి మరణిస్తున్నారు. దేశంలో ప్రతిరోజూ దాదాపు 20 మంది వైద్యులను ఈ మహమ్మారి బలితీసుకుంటుంది. అందులోనూ కరోనా సెకండ్ వేవ్ విజృంభణ ప్రారంభమయినప్పటి నుంచి వైద్యుల్లో మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. కరోనా సెకండ్ వేవ్ వచ్చినప్పటి నుంచి దాదాపు 329 మంది వైద్యులను ఈ మహమ్మారి బలికొందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలిపింది. వీరిలో బీహార్‌కు చెందిన వారు 80 మంది కాగా ఢిల్లీకి చెందిన వారు 73 మంది అని ఉత్తర్ ప్రదేశ్ వైద్యులు 41 మంది ప్రాణాలు కోల్పోయారని ఐఎంఏ ప్రకటించింది.


ఈ మహమ్మారి బారిన పడి ప్రతి రోజు దేశంలో 20 మంది వైద్యులు ప్రాణాలు వదులుతున్నారని ఐఎంఏ ఆవేదన వ్యక్తం చేసింది. మునుముందు ఈ సంఖ్య మరింత అధికం అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా ఐఎంఏ తెలిపింది. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వైద్యుల్లో ప్రభుత్వ, ప్రైవేటు, మెడికల్ ఆసుపత్రుల వారు ఉన్నారని ఐఎంఏ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే గత ఏడాది కరోనా మొదటి వేవ్‌లో 748 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అంతేకాకుండా కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనే టీకాలను త్వరగా వైద్యులను అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విజయ్ ఒక సెన్సేషన్ !

భూమిపై అనేక జాతుల అభివృద్ధే.. జీవవైవిధ్యం

ఎంతోమంది యువదర్శకులకు ప్రేరణే డైరెక్టర్ మారుతి ...

ఆ అబ్బాయి సంథింగ్ స్పెషల్ అంటున్న కీర్తి సురేష్..

టాలీవుడ్ చిరస్మరణీయం : నాగార్జున నిర్ణయం భేష్!

అభిరామ్ ఎంట్రీ పై షాకింగ్ ట్విస్ట్ !

టాలీవుడ్ కథానాయకుడు స్టైల్ నే మార్చేసిన పూరీ జగన్నాధ్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>