PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrcd312e9f-baf0-4a6f-95ca-2224f6274241-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrcd312e9f-baf0-4a6f-95ca-2224f6274241-415x250-IndiaHerald.jpgవరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. జిల్లాలోని సెంట్రల్‌ జైలును సందర్శించారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత సీఎం కేసీఆర్ వరంగల్ సెంట్రల్ జైలును పరిశీలించారు. జైల్లో ఖైదీలు తయారు చేసిన చేనేత, స్టీలు తదితర ఉత్పత్తులను పరిశీలించారు. జైలు బ్యారకుల్లో కలియతిరిగారు. జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలతో కొద్దిసేపు మాట్లాడారు. వారు జైలుకు ఏ శిక్ష మేరకు వచ్చారు? వారి ఊరు ఎక్కడ? వారి కుటుంబ పరిస్థితి ఏంటిది? అని అడిగి తెలుసుకున్నారు. అంతే కాదు.. ఖైదీలతో కొద్దిసేపు మాట్లాడిన కేసీఆర్.. జైల్లో వారిసమసkcr;kcr;amala akkineni;darshana;warangal;district;central government;cherlapalli;mantraవరంగల్‌ జైల్లో కేసీఆర్‌.. ఖైదీలతో ఏం మాట్లాడారంటే..?వరంగల్‌ జైల్లో కేసీఆర్‌.. ఖైదీలతో ఏం మాట్లాడారంటే..?kcr;kcr;amala akkineni;darshana;warangal;district;central government;cherlapalli;mantraFri, 21 May 2021 20:04:23 GMTవరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. జిల్లాలోని సెంట్రల్‌ జైలును సందర్శించారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత సీఎం కేసీఆర్ వరంగల్ సెంట్రల్ జైలును పరిశీలించారు. జైల్లో ఖైదీలు తయారు చేసిన చేనేత, స్టీలు తదితర ఉత్పత్తులను పరిశీలించారు. జైలు బ్యారకుల్లో కలియతిరిగారు. జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలతో కొద్దిసేపు మాట్లాడారు. వారు జైలుకు ఏ శిక్ష మేరకు వచ్చారు? వారి ఊరు ఎక్కడ? వారి కుటుంబ పరిస్థితి ఏంటిది? అని అడిగి తెలుసుకున్నారు.


అంతే కాదు.. ఖైదీలతో కొద్దిసేపు మాట్లాడిన కేసీఆర్.. జైల్లో వారిసమస్యలు ఏంటో అడిగి తెలుసుకున్నారు. వారి బాధలు ఓపికతో ఆలకించారు.. జైల్లో వారికి అందుతున్న సౌకర్యాలను ఆరా తీశారు. ఈ సమయంలో కొందరు ఖైదీలు సీఎం కేసీఆర్‌కు కొన్ని అభ్యర్థనలు అందించారు. సీఎం కేసీఆర్ వారి అభ్యర్థనలను స్వీకరించారు. వరంగల్ పర్యటనలో భాగంగా.. ఎంజీఎం సందర్శన, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.


వరంగల్ సెంట్రల్ జైలును నగర శివార్లకు తరలించి ఓపెన్ ఎయిర్ జైలుగా మారుస్తామని కేసీఆర్ తెలిపారు. అదే స్థలంలో సకల సౌకర్యాలతో అత్యాధునిక మాతా శిశు సంరక్షణ కేంద్రం ఎంసీహెచ్ నిర్మిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ ఎంజీఎం దవాఖానాను విస్త్రృత పరిచి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రోగులు వైద్యం కోసం ఇక్కడికి వచ్చే విధంగా సకల సౌకర్యాలతో దీన్ని తీర్చిదిద్దుకుందామని సీఎం కేసీఆర్ అన్నారు.

వరంగల్ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వెంటనే పటిష్ట పరుచుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు.  ఇక్కడి నుంచి తరలించే సెంట్రల్ జైలు కోసం నగర శివార్లలో విశాలమైన ప్రదేశాన్ని గుర్తించి, అక్కడ ఏర్పాటు చేసుకుందామన్నారు. ఈ సెంట్రల్ జైలును చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలులాగా, ఖైదీల పరివర్తన కేంద్రంగా నిర్మించుకుందామని సీఎం కేసీఆర్ అన్నారు. అదేవిధంగా జిల్లాలో ప్రభుత్వ దవాఖానాలో కరోనా బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలు, కరోనా కట్టడి, ధాన్యం సేకరణ, లాక్ డౌన్ అమలు పై కూడా సీఎం కేసీఆర్ కూలంకంశంగా చర్చించారు.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కృష్ణపట్నంలో ముగిసిన ఐసిఎంఆర్ బృందం పర్యటన.. ఏమన్నారంటే?

అక్కినేని సుమంత్ ఆ 5 సినిమాలు చేసుంటే.. !

రఘురామ ఎపిసోడ్ లో ఆ ఒక్క తప్పూ... ?

రవితేజ మూడు లక్షల రూపాయల హీరో.. దర్శకుడి కామెంట్స్ వైరల్.. ?

మరో హీరోను లాక్ చేసిన మాటల మాంత్రికుడు..?

టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడుతున్న వైసీపీ యువ‌నేత‌

బ్రేకింగ్ : రఘురామ కు విముక్తి.. బెయిల్ మంజూరు ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>