PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pallad15a46f3-d4d0-49b5-9576-30524f48972d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pallad15a46f3-d4d0-49b5-9576-30524f48972d-415x250-IndiaHerald.jpgవిశాఖపట్నంలో టీడీపీ బలం తగ్గలేదా? మూడు రాజధానుల ఎఫెక్ట్ టీడీపీపై పెద్దగా లేదా? విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడుగా పల్లా శ్రీనివాస్ పనితీరు బాగుందా? అంటే కాస్త అవుననే చెప్పొచ్చు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ వేవ్ ఉన్నా సరే విశాఖ నగరంలో టీడీపీ జెండా ఎగిరింది. నాలుగు దిక్కుల్లో టీడీపీ గెలిచింది. విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇలా టీడీపీ సత్తా చాటడంతో, ఆ పార్టీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా సీఎం జగన్, విజయసాయిరెడ్డిలు పావులు కదిపారు. అందులో భాగంగానే మూడు రpalla;srinivas;tiru;jagan;ganta srinivasa rao;amaravati;vijayawada;2019;vishakapatnam;capital;parliment;tdp;ycp;partyఆ విషయంలో గంటా కంటే పల్లా చాలా బెటర్..!ఆ విషయంలో గంటా కంటే పల్లా చాలా బెటర్..!palla;srinivas;tiru;jagan;ganta srinivasa rao;amaravati;vijayawada;2019;vishakapatnam;capital;parliment;tdp;ycp;partyFri, 21 May 2021 04:00:00 GMTవిశాఖపట్నంలో టీడీపీ బలం తగ్గలేదా? మూడు రాజధానుల ఎఫెక్ట్ టీడీపీపై పెద్దగా లేదా? విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడుగా పల్లా శ్రీనివాస్ పనితీరు బాగుందా? అంటే కాస్త అవుననే చెప్పొచ్చు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ వేవ్ ఉన్నా సరే విశాఖ నగరంలో టీడీపీ జెండా ఎగిరింది. నాలుగు దిక్కుల్లో టీడీపీ గెలిచింది. విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇలా టీడీపీ సత్తా చాటడంతో, ఆ పార్టీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా సీఎం జగన్, విజయసాయిరెడ్డిలు పావులు కదిపారు. అందులో భాగంగానే మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చి, విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయనున్నట్లు ప్రకటించారు.


అయితే అమరావతికి మద్ధతుగా ఉన్న టీడీపీపై విశాఖలో వ్యతిరేకిత వస్తుందని అంతా అనుకున్నారు. వైసీపీ సైతం ఆ వ్యతిరేకితని సృష్టించడానికి గట్టిగానే ప్రయత్నించింది. కానీ అది సాధ్యం కాలేదు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో మిగతా కార్పొరేషన్లలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. కానీ విశాఖలో మాత్రం వైసీపీకి టఫ్ ఫైట్ ఇచ్చింది. 98 డివిజన్లలో 30 వరకు గెలిచింది. అలాగే తమ మద్ధతుతో మరో మూడు డివిజన్లలో కమ్యూనిస్టులు, ఇతరులు గెలిచారు. ఇక వైసీపీ 58 గెలుచుకుని కార్పొరేషన్ దక్కించుకుంది.


అమరావతి పక్కనే ఉన్న గుంటూరు, విజయవాడ నగరాల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోతే విశాఖలో మాత్రం సత్తా చాటింది. అలా విశాఖలో సత్తా చాటాడానికి కారణాలు లేకపోలేదు. విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పార్టీ కోసం గట్టిగానే కష్టపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్ష చేశారు. గంటా శ్రీనివాసరావుతో పాటు మిగతా సీనియర్లు చేతులెత్తేయడంతో పల్లా అన్నీ తానై పార్టీని నడిపించారు. కష్ట సమయంలో తప్పించుకుని తిరుగుతున్న గంటా కంటే బెటర్‌గా పల్లా పార్టీ కోసం పనిచేశారు. ఈ విధంగా చేయడం వల్లే విశాఖలో టీడీపీ నిలబడింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఆ డేట్ కే జక్కన్న ఫిక్స్ అయ్యాడా..?

ఢిల్లీ వైపు చూస్తున్న బాబు... ?

శ్యామ్ సింగరాయ్ : ఒక్క రాత్రిలో కోట్ల నష్టం!

రఘురామ బెయిల్ పై తీవ్ర ఉత్కంఠ... ?

డైరెక్ట్ అటాక్ .. నో కాంప్ర‌మైజ్ .. కేసీఆర్ కీల‌క నిర్ణ‌యాలు

ఎన్టీఆర్ లోని రొమాంటిక్ యాంగిల్ ను కూడా పరిచయం చేసిన బృందావనం..ఇద్దరితో..!!

'ఎన్టీఆర్' వాడే '9999' నెంబర్ వెనక ఉన్న అసలు రహస్యం అదే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>