PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajiv-b92fb90c-fd26-47fe-9cd8-f9909ba36d61-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajiv-b92fb90c-fd26-47fe-9cd8-f9909ba36d61-415x250-IndiaHerald.jpgరాజీవ్ గాంధీ ఈ దేశానికి కేవలం ప్రధానిగా అయిదేళ్ళ పాటు పని చేశారు. ఇక్కడ విశేషం ఏంటి అంటే రాజీవ్ కేవలం 40 ఏళ్ల వయసులోనే ప్రధాని కావడం. అంత చిన్న వయసులో ప్రధాని అయిన వారు అప్పటికీ ఇప్పటికీ కూడా భారత్ లో మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదేమో. rajiv;rajeev;sree;india;mohandas karamchand gandhi;rajiv gandhi;congress;smart phone;vishakapatnam;prime minister;tamilnadu;murder.;central government;house;partyరాజీవ్ హత్యకు ముందు విశాఖలో ఏం జరిగింది... ?రాజీవ్ హత్యకు ముందు విశాఖలో ఏం జరిగింది... ?rajiv;rajeev;sree;india;mohandas karamchand gandhi;rajiv gandhi;congress;smart phone;vishakapatnam;prime minister;tamilnadu;murder.;central government;house;partyFri, 21 May 2021 10:00:00 GMTరాజీవ్ గాంధీ ఈ దేశానికి కేవలం ప్రధానిగా అయిదేళ్ళ పాటు పని చేశారు. ఇక్కడ విశేషం ఏంటి అంటే రాజీవ్ కేవలం 40 ఏళ్ల వయసులోనే ప్రధాని కావడం. అంత చిన్న వయసులో ప్రధాని అయిన వారు అప్పటికీ ఇప్పటికీ కూడా భారత్ లో మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదేమో.

ఇదిలా ఉంటే రాజీవ్ అయిదేళ్ల పాలనలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా టెక్నాలజీని ఆయన దేశంలోకి తీసుకువచ్చారు. టెలికమ్  వ్యవస్థ కొత్త పుంతలు తొక్కడానికి రాజీవ్ కారణమని చెప్పాలి. ఇదిలా ఉంటే రాజీవ్ గాంధీ 1991 లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో ప్రచారానికి తమిళనాడుకు వెళ్ళి అక్కడ శ్రీ పెరుంబుదూర్ లో ఉగ్రవాదుల మానవ బాంబు దాడిలో దారుణ హత్యకు గురి అయ్యారు.

రాజీవ్ గాంధీ హత్యకు గురి అయి ఈ రోజుకు సరిగ్గా మూడు దశాబ్దాలు అవుతోంది. 1991 మే 21న ఆయన దారుణ హత్య కావించబడ్డారు. ఈ దారుణానికి గంట ముందు వరకూ రాజీవ్  విశాఖలోనే గడిపారు. ఆ రోజున విశాఖలో  లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. విశాఖ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఉమా గజపతిరాజు పోటీ చేశారు. ఆమె 1989లో గెలిచారు. రెండేళ్ళు తిరగకుండానే ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ కి మద్దతుగా ప్రచారం కోసం రాజీవ్ వచ్చారు. ఆయన ఆ రోజు రాత్రి  విశాఖలో జరిగిన బ్రహ్మాండమైన సభలో మాట్లాడారు. చాలా హుషార్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కేంద్రంలో వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రచారం ముగించుకుని రాజీవ్ గాంధీ అదే రోజు రాత్రి చెన్నైకి బయలుదేరి వెళ్ళాలి. అయితే  విశాఖ విమానాశ్రయ అధికారులు కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పడంతో రాజీవ్ గాంధీ ప్రయాణాన్ని మానుకుని తిరిగి ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో బస చేసేందుకు  వెనుతిరిగారు. అయితే తిరిగి ఎయిర్ పోర్ట్ నుంచి ఫోన్ వచ్చింది. సాంకేతిక సమస్యలు తొలగిపోయాయి. చెన్నైకి వెళ్లవచ్చు అని. దాంతో  మళ్ళీ విశాఖ విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో రాజీవ్ శ్రీ పెరుంబుదూర్ వెళ్లారు. అక్కడకు వెళ్ళిన వెంటనే  ఎల్టీటీఈ ఉగ్రవాదుల మానవబాంబులో ఆయన దారుణ హత్యకు గురి అయ్యారు. రాజీవ్ హత్యకు ముందు గడిపింది, ఉల్లాసంగా తిరిగింది విశాఖలోనే కావడంతో ఆయన తీపి గురుతులను ఇక్కడ ప్రజలు పదిలంగా దాచుకుంటారు. ఆయన వర్ధంతి  వేళ వాటిని స్మరించుకుంటారు.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కోవిడ్ వ్యాక్సినేషన్ ఎన్ని కోట్ల మంది తీసుకున్నారు

త్రిష అంటే మెగా ఫ్యాన్స్‌కు ఎందుకంత కోపం?

అనుపమ పరమేశ్వరన్ ఫాలోయింగ్ మాములుగా లేదుగా..

ఆండ్రియా.. అందాలకే సరికొత్త అర్థం ఆమె అందం..!!

రేణూ దేశాయ్ కి రెండోసారి కూడా చేదు అనుభవం..

కేసీఆర్‌ను ఫాలో అవుతున్న‌ర‌ట‌.. ఎందుకంటే!

ఆపరేషన్ హుజూరాబాద్.. మొదలెట్టిన కేసీఆర్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>