PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/yanamala-ramakrishnudu722b9c0c-1aa1-45ab-bb06-22f0a62db62c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/yanamala-ramakrishnudu722b9c0c-1aa1-45ab-bb06-22f0a62db62c-415x250-IndiaHerald.jpgఏపీ ప్రభుత్వం తాజాగా బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2.28 లక్షల కోట్లతో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. కరోనా సమయం కావడంతో సమావేశాన్ని ఒక్కరోజులోనే ముగించేశారు. ఇలా సమావేశాన్ని ఒక్కరోజే పెట్టడంతో ప్రతిపక్ష టీడీపీ బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరించింది. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి జూమ్ యాప్‌లో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. yanamala ramakrishnudu;ramakrishna;jagan;nara lokesh;andhra pradesh;buggana rajendranath reddy;2020;assembly;minister;tdp;ycp;reddy;party;mantra;lokesh;lokesh kanagarajయనమల అప్పుడు ఎలా నడిపించారో?యనమల అప్పుడు ఎలా నడిపించారో?yanamala ramakrishnudu;ramakrishna;jagan;nara lokesh;andhra pradesh;buggana rajendranath reddy;2020;assembly;minister;tdp;ycp;reddy;party;mantra;lokesh;lokesh kanagarajFri, 21 May 2021 14:56:49 GMTఏపీ ప్రభుత్వం తాజాగా బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2.28 లక్షల కోట్లతో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. కరోనా సమయం కావడంతో సమావేశాన్ని ఒక్కరోజులోనే ముగించేశారు. ఇలా సమావేశాన్ని ఒక్కరోజే పెట్టడంతో ప్రతిపక్ష టీడీపీ బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరించింది. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి జూమ్ యాప్‌లో మాక్ అసెంబ్లీ నిర్వహించారు.

ఇక ఇందులో పాల్గొన్న మాజీ ఆర్ధిక మంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి రేటు గణనీయంగా పడిపోయందని మైనస్ వృద్ధిరేటులో ప్రస్తుత ప్రభుత్వం ఉందని, 2020-21 సంవత్సరంలో ఆర్థికాభివృద్ధి రేటు మైనస్ 5 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని మాట్లాడారు. రాష్ట్ర అర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అన్నారు.

ఇక తెచ్చిన అప్పులు కట్టడానికి రానున్న రోజుల్లో లక్ష కోట్లకు పైగా అవసరం ఏర్పడుతుందని, అప్పులు తీర్చటానికే మళ్లీ అప్పులు చేయాల్సి ఉంటుందని,  భవిష్యత్తులో అభివృద్ధి అనేది లేకుండా ఆర్థిక సంక్షోభం, రెవెన్యూ సంక్షోభంతోనే ప్రభుత్వం నడవాల్సి ఉంటుందని విమర్శలు చేశారు. అయితే జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడేలా సంక్షేమ పథకాలకు పెద్ద పీఠ వేశారు. ఈ పథకాల వల్ల ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరుగుతుంది.

అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా రెవెన్యూ లోటు ఎక్కువగానే ఉంది. అప్పుడు ఆర్ధిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు బడ్జెట్‌లో అంకెల గారడీనే చేశారని వైసీపీ విమర్శిస్తుంది. పైగా అభివృద్ధి కాగితాలకే పరిమితమైందని, సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు టోకరా వేశారని, దీనికి తోడు యనమల, తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీల చిల్లర ఖర్చులని సైతం రాష్ట్ర ప్రభుత్వ సొమ్మునే వాడారని, అటు నారా లోకేష్ చాక్లెట్లు, బిస్కెట్లు, ఇతర స్నాక్స్ ఖర్చు ప్రభుత్వ సోమ్మే అని వైసీపీ కౌంటర్లు ఇస్తుంది. యనమల ఆర్ధిక మంత్రిగా ఉండి ఆర్ధిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారని విమర్శించారు.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆనందయ్య కరోనా మందు : స్థానికులలో భ‌యాందోళ‌న‌!

మహేష్ బాబు బిగ్గెస్ట్ డిజాస్టర్ కు ఐదేళ్లు.. ఇప్పటికీ బాధ పడుతున్న ప్రిన్స్..!!

బ్రేకింగ్‌: ర‌ఘురామ మెడిక‌ల్ రిపోర్టు ఇదే

ఆ స్టార్ విలన్ కు ... మెగాస్టార్ ఆర్ధిక సాయం .... ??

రఘురామ గాయాలపై సుప్రీం విచారణ ..!

మన హీరోలు ఎవరెవరు ఎన్ని రీమేక్ సినిమా ల్లో నటించారో తెలుసా..?

ఆనందయ్య ఆయుర్వేదం.. జగన్ను మెప్పిస్తుందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>