LifeStyleSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/international-tea-day-574fe012-e0fe-43e2-b0f0-d0e1a28a1cd4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/international-tea-day-574fe012-e0fe-43e2-b0f0-d0e1a28a1cd4-415x250-IndiaHerald.jpgచాయ్ అని పిలిచే ఆ గోధుమరంగు ద్రవం ఉత్తి ద్రవం మాత్రమే కాదు. అది కనీస మర్యాద. తలనొప్పికి మందు. కాలక్షేపానికి సాకు. కలిసి కూర్చోవడానికి ఉపాయం. రోజును సాఫీగా సాగనిచ్చే ఓ దివ్యౌషదం. అందుకే ప్రపంచం దానికోసం గ్లాసులెత్తి గౌరవం ప్రకటిస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఈజిప్ట్, మయన్మార్ లాంటి దేశాల్లో టీ ‘జాతీయ డ్రింకు’ హోదా సంపాదించుకుంది. మన దేశంలో కూడా అలా ప్రకటిస్తామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటేక్‌సింగ్ అహ్లువాలియా ముందు వెల్లడించినా, కాఫీ పరిశ్రమకు ఎదుగుదల ఉండదనే కారణంగా ఆ ప్రతిపాదనను వెనక్కి తీసinternational-tea-day;jasmine;jeevitha rajaseskhar;jiya;egypt;korcha;australia;history;heart;green tea;international;coffee;masala;manadesamచరిత్ర తిరగరాసిన టీ..గొప్పదనం ఇదేచరిత్ర తిరగరాసిన టీ..గొప్పదనం ఇదేinternational-tea-day;jasmine;jeevitha rajaseskhar;jiya;egypt;korcha;australia;history;heart;green tea;international;coffee;masala;manadesamFri, 21 May 2021 12:05:13 GMTచాయ్ అని పిలిచే ఆ గోధుమరంగు ద్రవం ఉత్తి ద్రవం మాత్రమే కాదు. అది కనీస మర్యాద. తలనొప్పికి మందు. కాలక్షేపానికి సాకు. కలిసి కూర్చోవడానికి ఉపాయం. రోజును సాఫీగా సాగనిచ్చే ఓ దివ్యౌషదం. అందుకే ప్రపంచం దానికోసం గ్లాసులెత్తి గౌరవం ప్రకటిస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఈజిప్ట్, మయన్మార్ లాంటి దేశాల్లో టీ ‘జాతీయ డ్రింకు’ హోదా సంపాదించుకుంది. మన దేశంలో కూడా అలా ప్రకటిస్తామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటేక్‌సింగ్ అహ్లువాలియా ముందు వెల్లడించినా, కాఫీ పరిశ్రమకు ఎదుగుదల ఉండదనే కారణంగా ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ నేషనల్ డ్రింక్ అదే. దేశంలోని 83 శాతం ఇళ్లల్లో టీ తాగనిదే ఆ రోజు స్టార్ట్ అవ్వదు. నేడు అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్బంగా అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు ఆ టీ చరిత్రేంటో తెలుసుకుందాం.

తూర్పు, దక్షిణాసియాలోనే తేయాకు చెట్లను తొలుత గుర్తించారు. కాబట్టి, ఇది ఆసియా భూభాగం ప్రపంచానికి సగర్వంగా సమర్పించిన మొక్క. అయితే, తేయాకులో ఉన్న మహత్తును మొట్టమొదటగా పసిగట్టింది చైనీయులు. క్రీస్తు పూర్వం పదో శతాబ్దంలోనే చైనాలో తేనీరు తాగినట్టుగా చెప్పే ఆధారాలు దొరికాయి. అయితే, ఇప్పుడు తాగుతున్నట్టుగా కాకుండా వైద్యపానీయంగా సేవించేవాళ్లు. క్రమంగా అది వాళ్ల జీవితంలో భాగమై కూర్చుంది. చైనాలో ఒకరోజును ప్రారంభించడానికి కావాల్సిన ఏడు ముఖ్యావసరాల్లో చాయ్ కూడా ఒకటి. టీ గుండె సంబంధిత జబ్బుల్ని తగ్గిస్తుందనీ, కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధిస్తుందనీ, నోటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందనీ, రక్తపోటును తగ్గిస్తుందనీ, ఊబకాయాన్ని నియంత్రిస్తుందనీ, ఇంకా రకరకాల ఆరోగ్య కారణాలు టీకి ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. మన దగ్గర తేయాకు పండినా మనకు దాన్ని తాగడం అలవాటు చేసింది ఇంగ్లీష్‌వాళ్లే. ఇంగ్లీష్‌వాళ్లకు పోర్చుగీస్‌వాళ్లు పరిచయం చేశారు. స్వాతంత్య్రం తర్వాతే మనదేశంలో టీ అధిక ప్రజాదరణ పొందింది. జనానికి టీ అలవాటు చేయడానికి కంపెనీలు ఎలా ప్రచారం చేశాయి. భిన్నమైన విధానాలవల్ల వివిధ ‘టీ’లు పుట్టాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ, ఎల్లో టీ, ఊలాంగ్ టీ, పు ఎర్ టీ, ఫ్లవర్ టీ, జాస్మిన్ టీ, బార్లీ టీ, బక్‌వీట్ టీ, హైడ్రాంజియా టీ, అల్లం టీ, మసాలా టీ ఇలా రకరకాలు పుట్టుకొచ్చాయని చెప్పొచ్చు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీ ప‌రిష‌త్ పోరు.. హైకోర్టు నాడు అలా.. నేడు ఇలా..!

అమ‌రావ‌తి పాతికేళ్లు వెన‌క‌బ‌డిందా??

కుర్రకారును కట్టిపడేస్తున్న మలైకా.. ఎంతలా అంటే..?

ఇక ఓవ‌ర్సీస్ మార్కెట్, క‌లెక్ష‌న్లు క‌లేనా ?

త‌న అందాల‌తో కుర్రాళ్ల‌ను మ‌త్తులోకి దించుతున్న యాంక‌ర్‌

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ర‌ద్దుకు అదే కార‌ణ‌మా ?

అన్న విషయంలో జూనియర్ ఎందుకలా... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>