PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-visit-to-gandhi-hospital-ts-news-telangana-12f08ee1-4c38-43ba-a11f-95fb4487d357-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-visit-to-gandhi-hospital-ts-news-telangana-12f08ee1-4c38-43ba-a11f-95fb4487d357-415x250-IndiaHerald.jpgక‌రోనా వైర‌స్ సోకింద‌న‌గానే రోగుల్లో భ‌యం పెరుగుతుంది. ఈ క్ర‌మంలో వారిలో ఆత్మ‌స్థైరం దెబ్బ‌తిని భ‌రోసా ఇచ్చేవారు లేక భ‌యం భ‌యంగా గ‌డుపుతూ వైద్య సేవ‌లు అందుతున్నా మృత్యువాత ప‌డుతున్నారు. కొవిడ్ సోకిన‌వారికి అతి విలువైన మందు ధైర్యంగా ఉండ‌ట‌మేన‌ని వైద్యులు ప‌దేప‌దే చెబుతున్నారు. ఈ క్ర‌మంలో సీఎం కేసీఆర్ కొవిడ్ పేసెంట్ల‌లో భ‌రోసా క‌ల్పించేందుకు కొత్త విధానాన్ని ఎంచుకున్నారు. కొవిడ్ రోగులున్న ఆస్ప‌త్రుల వైపు వెళ్లేందుకు భ‌య‌ప‌డుతున్న క్ర‌మంలో.. గాంధీలో కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న రోగుల వ‌ద్ద‌కుKCR visit to Gandhi Hospital, TS NEWS, telangana;kcr;telangana rashtra samithi trs;telangana;mp;district;mla;minister;local language;kamareddy;reddy;mantraకేసీఆర్‌ను ఫాలో అవుతున్న‌ర‌ట‌.. ఎందుకంటే!కేసీఆర్‌ను ఫాలో అవుతున్న‌ర‌ట‌.. ఎందుకంటే!KCR visit to Gandhi Hospital, TS NEWS, telangana;kcr;telangana rashtra samithi trs;telangana;mp;district;mla;minister;local language;kamareddy;reddy;mantraFri, 21 May 2021 08:17:28 GMTక‌రోనా వైర‌స్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుంది. ఈ వైర‌స్ బారిన ప‌డి ప్ర‌జ‌లు ఆస్ప‌త్రుల బాట ప‌డుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ వైర‌స్ వ్యాప్తి తీవ్రంగానే ఉంది. వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు సీఎం కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో అధికార యంత్రాంగం తీవ్రంగా కృషిచేస్తుంది. అయినా కొన్నిలోపాల‌తో కొవిడ్ రోగుల‌కు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. దీంతో ప్ర‌తిప‌క్షాలుసైతం అధికార పార్టీపై విమ‌ర్శ‌ల దాడికి దిగుతున్నాయి. ఇటీవ‌ల వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రిగా ఉన్న ఈట‌ల‌ను సీఎం కేసీఆర్ బ‌ర్త‌ర‌ఫ్ చేసి ఆ శాఖ‌ను త‌న‌వ‌ద్దే ఉంచుకున్నారు. ఈ క్ర‌మంలో వ‌రుస స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ అధికారుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు కేసీఆర్ అప్ర‌మ‌త్తం చేస్తున్నారు.

క‌రోనా వైర‌స్ సోకింద‌న‌గానే రోగుల్లో భ‌యం పెరుగుతుంది. ఈ క్ర‌మంలో వారిలో ఆత్మ‌స్థైరం దెబ్బ‌తిని భ‌రోసా ఇచ్చేవారు లేక భ‌యం భ‌యంగా గ‌డుపుతూ వైద్య సేవ‌లు అందుతున్నా మృత్యువాత ప‌డుతున్నారు. కొవిడ్ సోకిన‌వారికి అతి విలువైన మందు ధైర్యంగా ఉండ‌ట‌మేన‌ని వైద్యులు ప‌దేప‌దే చెబుతున్నారు. ఈ క్ర‌మంలో సీఎం కేసీఆర్ కొవిడ్ పేసెంట్ల‌లో భ‌రోసా క‌ల్పించేందుకు కొత్త విధానాన్ని ఎంచుకున్నారు. కొవిడ్ రోగులున్న ఆస్ప‌త్రుల వైపు వెళ్లేందుకు భ‌య‌ప‌డుతున్న క్ర‌మంలో.. గాంధీలో కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న రోగుల వ‌ద్ద‌కు వెళ్లి సీఎం కేసీఆర్ వారికి ధైర్యంగా ఉండాలంటూ సూచించారు. ఈ స‌మ‌యంలో కేసీఆర్ కేవ‌లం మాస్క్ మాత్ర‌మే ధ‌రించ‌డం గ‌మ‌నార్హం.

సీఎం కేసీఆర్ చూపిన బాట‌లోనే ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు న‌డుస్తున్నారు. వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి వ‌న‌ప‌ర్తి ఆస్ప‌త్రిలోని కొవిడ్ రోగుల వ‌ద్ద‌కు వెళ్లి ప‌రామ‌ర్శించ‌గా, నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా ప్ర‌భుత్వాస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగుల‌ను తెరాస ఎమ్మెల్యే మ‌ర్రి జ‌నార్ద‌న్‌రెడ్డి నేరుగా వెళ్లి ప‌రామ‌ర్శించారు. మ‌హ‌బూబాబాద్‌లో మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌, మెద‌క్‌లో మంత్రి హ‌రీష్‌రావు, ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి, క‌ల్వ‌కుర్తిలో ఎంపీ, ఎమ్మెల్యే, కామారెడ్డి జిల్లాలో మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ ఇలా ఆయా జిల్లాల్లోని ప్ర‌భుత్వాస్ప‌త్రిలో కొవిడ్‌తో చికిత్స పొందుతున్నవారివ‌ద్ద‌కు వెళ్లి ప‌రామ‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలో ధైర్యంగా ఉండాల‌ని, మేమున్నామంటూ వారికి భ‌రోసా క‌ల్పిస్తున్నార‌ట‌. మొత్తానికి ఇన్నాళ్ల‌కు సీఎం కేసీఆర్ బాట‌లో న‌డుస్తూ మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు మంచి ప‌నిచేస్తున్నారంటూ ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వలసదారుల ఆకలి తీర్చిన రాచకొండ పోలీసులు

ఆపరేషన్ హుజూరాబాద్.. మొదలెట్టిన కేసీఆర్..

సీఎం జగన్ ని ఫాలో అవుతున్న మరో ముఖ్యమంత్రి..

ఇక రెండవ వాక్సిన్ కోసం మూడు నెలలు

ఇక స్టూడెంట్స్‌కు దేవుడే దిక్కు.. బాంబే హైకోర్టు వైరాగ్యం..?

ఏపీపై మోదీకి ఎందుకింత‌ వివ‌క్ష‌..?

చందమామ సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>