PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/corona-kcr-trs-eetala-harishrao-ktr0e46c423-f896-40f7-9c94-7978e12e6aad-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/corona-kcr-trs-eetala-harishrao-ktr0e46c423-f896-40f7-9c94-7978e12e6aad-415x250-IndiaHerald.jpgముఖ్య‌మంత్రి ప‌ద‌వి అంటే త‌న కేబినెట్ లోని మంత్రులకు కేటాయించిన అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల‌ను కూడా ప‌ర్య‌వేక్షించే స‌ర్వోన్న‌త అధికారాలు క‌లిగివుంటాయి. కొన్ని శాఖ‌ల‌ను వారి వారి వ్య‌క్తిగ‌త అజెండాల మేర‌కు ఎవ‌రికీ కేటాయించ‌కుండా త‌మ‌వ‌ద్దే ఉంచుకుంటారు. అవేకాకుండా ఆ రాష్ట్రానికి సంబంధించినంత వ‌ర‌కు ముఖ్య‌మంత్రి అంటే తిరుగులేని వ్య‌క్తి అనేది మ‌న‌కు తెలిసిందే. అటువంటి ముఖ్య‌మంత్రి ఒక శాఖ‌కు సంబంధించి ఇంత‌వ‌ర‌కు స‌మీక్ష నిర్వ‌హించ‌లేదంటే ఆశ్చ‌ర్య‌మ‌నిపిస్తోంది. అందుకు కార‌ణ‌మేంట‌నేది ఆ ముఖ్య‌మంత్రికే తెలcorona, kcr, trs, eetala, harishrao, ktr;kcr;tiru;telangana;mohandas karamchand gandhi;cabinet;minister;cheque;party;mantraవైద్య‌, ఆరోగ్య‌శాఖ‌లో ఏం జ‌రుగుతోంది?వైద్య‌, ఆరోగ్య‌శాఖ‌లో ఏం జ‌రుగుతోంది?corona, kcr, trs, eetala, harishrao, ktr;kcr;tiru;telangana;mohandas karamchand gandhi;cabinet;minister;cheque;party;mantraThu, 20 May 2021 15:19:28 GMT
ముఖ్య‌మంత్రి ప‌ద‌వి అంటే త‌న కేబినెట్ లోని మంత్రులకు కేటాయించిన అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల‌ను కూడా ప‌ర్య‌వేక్షించే స‌ర్వోన్న‌త అధికారాలు క‌లిగివుంటాయి. కొన్ని శాఖ‌ల‌ను వారి వారి వ్య‌క్తిగ‌త అజెండాల మేర‌కు ఎవ‌రికీ కేటాయించ‌కుండా త‌మ‌వ‌ద్దే ఉంచుకుంటారు. అవేకాకుండా ఆ రాష్ట్రానికి సంబంధించినంత వ‌ర‌కు ముఖ్య‌మంత్రి అంటే తిరుగులేని వ్య‌క్తి అనేది మ‌న‌కు తెలిసిందే. అటువంటి ముఖ్య‌మంత్రి ఒక శాఖ‌కు సంబంధించి ఇంత‌వ‌ర‌కు స‌మీక్ష నిర్వ‌హించ‌లేదంటే ఆశ్చ‌ర్య‌మ‌నిపిస్తోంది. అందుకు కార‌ణ‌మేంట‌నేది ఆ ముఖ్య‌మంత్రికే తెలియాలి.!!

వైద్య‌, ఆరోగ్య‌శాఖ‌పై ఎందుకు దృష్టి పెట్ట‌లేదు?
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హైద‌రాబాద్ గాంధీ ఆసుప‌త్రిని సంద‌ర్శించి క‌రోనా బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. దాదాపు గంట స‌మ‌యం ఆయ‌న క‌రోనా వైర‌స్‌తో చికిత్స పొందుతున్నవారి  మ‌ధ్య గ‌డిపారు. శుక్ర‌వారం వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆసుప‌త్రిని సంద‌ర్శించనున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ నేతృత్వం వ‌హిస్తున్నారు కాబ‌ట్టే ఇన్నిరోజులుగా కేసీఆర్ వైద్య‌, ఆరోగ్య‌శాఖ‌కు సంబంధించి ఎటువంటి స‌మీక్ష నిర్వ‌హించ‌లేద‌ని తెలుస్తోంది. ప్ర‌తి శాఖ ప‌నితీరుపై స‌మీక్ష నిర్వ‌హించే కేసీఆర్ వైద్య‌, ఆరోగ్య‌శాఖ‌పై ఎందుకు దృష్టిపెట్ట‌లేద‌నే ప్ర‌శ్న‌లు విన‌వ‌స్తున్నాయి. ఇటీవ‌లే క్యాబినెట్ నుంచి ఈట‌ల రాజేంద‌ర్ ను తొల‌గించారు. ఒక‌ర‌కంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర‌స‌మితి పార్టీనేత‌గా కొన‌సాగుతున్నారు. అయితే త్వ‌ర‌లోనే రాజేంద‌ర్‌ను పార్టీ నుంచి కూడా స‌స్పెండ్ చేసే అవ‌కాశాలున్న‌ట్లు టీఆర్ ఎస్ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.

విమ‌ర్శ‌ల‌కు మ‌న‌మెందుకు అవ‌కాశం క‌ల్పించాలి?
తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటైన త‌ర్వాత తొలి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ త‌న కుమారుడు కేటీఆర్‌, మేన‌ల్లుడు హ‌రీష్‌తోపాటు స‌మాంత‌రంగా ఈట‌ల రాజేంద‌ర్‌కు ప్రాధాన్య‌మిచ్చారు. రెండోసారి ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌ర్వాత మాత్రం ఈట‌ల‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుందా? అనే అనుమానాలు రాజ‌కీయ విశ్లేష‌కులు వ్య‌క్తం చేశారు. ఒక‌వేళ మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోతే పార్టీలో ఏదో జ‌రిగిపోతోంద‌నే భావ‌న తానే ఎందుకు క‌ల్పించాల‌నే ఉద్దేశంతో రాజేంద‌ర్‌కు కేసీఆర్ మంత్రి ప‌ద‌వి ఇచ్చార‌ని విశ్లేష‌కులు త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. పార్టీలో ఒక బ‌లీయ‌మైన శ‌క్తిగా ఎదుగుతున్నాడ‌నే ఉద్దేశంతో ఈట‌ల‌కు చెక్ పెట్టారా? మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డానికి, పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపించేయ‌డానికి గాలివాటుగా వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఏమైనా ఉప‌యోగించుకున్నారా? అనేదానిపై పార్టీ వ‌ర్గాల నుంచి ఎటువంటి స‌మాచారం లేదు. ఏదేమైన‌ప్ప‌టికీ కేసీఆర్ తాను అనుక‌న్న‌దే చేస్తార‌ని.. చేశార‌ని..  చేసి చూపించార‌ని గులాబీ శ్రేణులు అంటున్నాయి. ఈ వ్య‌వ‌హారం మున్ముందు ఎటువంటి మ‌లుపులు తిరుగుతుందో వేచిచూడాలి మ‌రి.!!





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహారాష్ట్ర నేతలు: "మోదీ" ఎందుకీ పక్షపాతం ?

'ఎన్టీఆర్' కి టాలీవుడ్లో ఎంత మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసా..??

పెళ్లి గురించి ఓపెన్ అయిన మహానటి...

ఇదేం నటన అన్నారు.. నటన కే ప్రతి రూపం అయ్యాడు..

'తారక్' కి అత్త పురంధేశ్వరి స్పెషల్ విషెస్.. ఎంత స్పెషల్ అంటే..?

క‌ళ్యాణ్ రామ్‌, జూ. ఎన్టీఆర్ అనుబంధం గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు!

ఎన్ని వివాదాలు ఉన్నా టెంపర్ సినిమా ఎందుకు సూపర్ హిట్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>