PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona8e6d2da6-d80e-4196-b1b9-5be7085dbdc8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona8e6d2da6-d80e-4196-b1b9-5be7085dbdc8-415x250-IndiaHerald.jpgక‌రోనా రెండోద‌శ‌లో ఎంత విజృంభిస్తుందో చూస్తూనే ఉన్నాం. అల్ల‌క‌ల్లోలంగా మారిన కొవిడ్ వాతావ‌ర‌ణంవ‌ల్ల మ‌ర‌ణాలు ఏ దేశంలో లేనివిధంగా ఎక్కువ సంఖ్య‌లో న‌మోద‌వుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్ల‌దీస్తున్న ప్ర‌జ‌ల‌కు శాస్త్ర‌వేత్త‌లు మ‌రో ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించే వార్త చెప్పారు. మృతుల సంఖ్య మ‌రో వారం రోజులు ఇలాగే కొన‌సాగుతుందని తేల్చిచెప్పారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో ఉధృత దశ ముగిసింది. మరికొన్ని రాష్ట్రాలలో ఇంకా ఉధృత ద‌శ రాలేదుకాబ‌ట్టి మ‌ర‌ణాలు పెరcorona;kerala;delhi;kanpur;gujarat - gandhinagar;karnataka - bengaluru;puducherry;maharashtra - mumbai;job;uttar pradesh;maharashtra;professor;punjab;jharkhandక్ష‌ణ‌క్ష‌ణం.. భ‌యం భ‌యం.. ఇంకొద్ది రోజులు?క్ష‌ణ‌క్ష‌ణం.. భ‌యం భ‌యం.. ఇంకొద్ది రోజులు?corona;kerala;delhi;kanpur;gujarat - gandhinagar;karnataka - bengaluru;puducherry;maharashtra - mumbai;job;uttar pradesh;maharashtra;professor;punjab;jharkhandThu, 20 May 2021 12:10:15 GMT
క‌రోనా రెండోద‌శ‌లో ఎంత విజృంభిస్తుందో చూస్తూనే ఉన్నాం. అల్ల‌క‌ల్లోలంగా మారిన కొవిడ్ వాతావ‌ర‌ణంవ‌ల్ల మ‌ర‌ణాలు ఏ దేశంలో లేనివిధంగా ఎక్కువ సంఖ్య‌లో న‌మోద‌వుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్ల‌దీస్తున్న ప్ర‌జ‌ల‌కు శాస్త్ర‌వేత్త‌లు మ‌రో ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించే వార్త చెప్పారు. మృతుల సంఖ్య మ‌రో వారం రోజులు ఇలాగే కొన‌సాగుతుందని తేల్చిచెప్పారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో ఉధృత దశ ముగిసింది. మరికొన్ని రాష్ట్రాలలో ఇంకా ఉధృత ద‌శ రాలేదుకాబ‌ట్టి మ‌ర‌ణాలు పెరుగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. నిపుణుల లెక్కల ప్రకారం రానున్న రోజుల్లో తమిళనాడు, పంజాబ్, అసోం, హిమాచల్‌ ప్రదేశ్‌, పుదుచ్చేరిలో కరోనా ఉధృతంగా ఉంటుంద‌ని, 6 నుంచి 8 నెలల్లో దేశంలో కరోనా మూడోద‌శ కల్లోలం సృష్టించే అవకాశం ఉందంటున్నారు.

ముప్పు త‌ప్పించుకున్న‌ రాష్ట్రాలు!
గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్‌, కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, గోవాలో ప్రస్తుతానికి కరోనా ఉధృతంగా వ్యాపించే దశ ముగిసినట్లేనని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, పంజాబ్, అసోం, హిమాచల్‌ ప్రదేశ్‌లో మాత్రం ఆ ద‌శ ముగియ‌లేద‌న్నారు. మే 29-31 మ‌ధ్య త‌మిళ‌నాడు, మే 22న పంజాబ్‌, మే 24వ తేదీన హిమాచల్‌ ప్రదేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి ప‌తాక‌స్థాయికి చేరుకోనుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఆ స‌మ‌యంలో ప్ర‌భుత్వంతోపాటు ప్ర‌జ‌లంద‌రూ అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రాకుండా ఉండ‌ట‌మే అత్యంత శ్రేయ‌స్క‌ర‌మ‌ని సూచిస్తున్నారు.

మే చివ‌రి నాటికే?
దేశవ్యాప్తంగా మే చివరి నాటికే కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని కాన్పూర్‌ ఐఐటీ ప్రొఫెసర్ మనీందర్ అగ‌ర్‌వాల్ చెప్పారు. మే నెలాఖ‌రుకు ప్రతిరోజు 1.5 లక్షల కేసుల చొప్పున నమోదవుతాయని…. జూన్‌లో ఆ సంఖ్య 20 వేలకు తగ్గుతుందన్నారు. జులైలో కరోనా రెండోద‌శ ముగుస్తుంద‌ని, ఆరు నెలల తర్వాత మూడో ద‌శకు అవ‌కాశం ఉంద‌ని కాన్పూర్ ఐఐటీ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగ‌వంతంగా జ‌ర‌గ‌డ‌మొక్క‌టే ప‌రిష్కార‌మ‌ని, రెండు డోసుల వ్యాక్సిన్ అత్యంత భ‌ద్ర‌త క‌ల్పిస్తుందంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'థూ' అన్న ఆఫీసర్ కి రఘు రామ బాణం?

"కొమరం భీమ్ " రెబల్.. అంటున్న బాలీవుడ్ స్టార్ !

వావ్‌: ఎన్టీఆర్‌కు జీ తెలుగు స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్‌...!

ఎన్టీఆర్ 30 ఫ‌స్ట్ లుక్‌... స్మార్ట్‌లుక్‌లో చంపేశాడు

జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా నటించిన 2 సినిమాలివే ?

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 9 బెస్ట్ సినిమాలు ఇవే..!

ఎన్‌టీఆర్ ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడో తెలుసా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>