PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp6aa9b896-3c39-4eba-9bfb-a1ec4f8823f2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp6aa9b896-3c39-4eba-9bfb-a1ec4f8823f2-415x250-IndiaHerald.jpgప్రకృతి అందాలకు ప్రసిద్ధమైన అరకులో రాజకీయాలు ఎప్పుడు ఒక పార్టీకే అనుకూలంగా ఉంటాయి. గతంలో టీడీపీకి ఉండే అరకులో వైఎస్సార్ ఎంట్రీతో పరిస్తితి మారిపోయింది. అరకు పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ సత్తా చాటేది. ఇక కాంగ్రెస్ తర్వాత వైసీపీ హవా నడుస్తోంది. 2014 ఎన్నికల్లో రాష్టంలో టీడీపీ హవా కొనసాగిన అరకు పార్లమెంట్‌లో మాత్రం వైసీపీ డామినేషన్ కనిపించింది.tdp;prakruti;tiru;y. s. rajasekhara reddy;congress;2019;parliment;assembly;cycle;tdp;local language;ycp;araku valleyఆ అందాల పార్లమెంట్‌ స్థానంలో సైకిల్ తిరగడం కష్టమేనా?ఆ అందాల పార్లమెంట్‌ స్థానంలో సైకిల్ తిరగడం కష్టమేనా?tdp;prakruti;tiru;y. s. rajasekhara reddy;congress;2019;parliment;assembly;cycle;tdp;local language;ycp;araku valleyThu, 20 May 2021 04:00:00 GMTప్రకృతి అందాలకు ప్రసిద్ధమైన అరకులో రాజకీయాలు ఎప్పుడు ఒక పార్టీకే అనుకూలంగా ఉంటాయి. గతంలో టీడీపీకి ఉండే అరకులో వైఎస్సార్ ఎంట్రీతో పరిస్తితి మారిపోయింది. అరకు పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ సత్తా చాటేది. ఇక కాంగ్రెస్ తర్వాత వైసీపీ హవా నడుస్తోంది. 2014 ఎన్నికల్లో రాష్టంలో టీడీపీ హవా కొనసాగిన అరకు పార్లమెంట్‌లో మాత్రం వైసీపీ డామినేషన్ కనిపించింది.


అరకు పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. అలాగే ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న అరకు, పాలకొండ, సాలూరు, పాడేరు, కురుపాం, రంపచోడవరం నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగిరింది. కేవలం పార్వతిపురంలో మాత్రం టీడీపీ గెలిచింది. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో పాడేరు, రంపచోడవరం, అరకు ఎమ్మెల్యేలని పార్టీలోకి లాగేసుకున్నారు. మిగిలినవారిని లాగడానికి చూసిన కుదరలేదు.


ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి పరిస్తితి పూర్తిగా మారిపోయింది. మొత్తం వైసీపీనే క్లీన్‌స్వీప్ చేసింది. అరకు పార్లమెంట్ స్థానాన్ని భారీ మెజారిటీతో కైవసం చేసుకోగా, అసెంబ్లీ స్థానాలని సైతం భారీ మెజారిటీలతో గెలుచుకుంది. ఇప్పటికీ అరకు పార్లమెంట్ పరిధిలో వైసీపీ బాగా బలంగా ఉంది. అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయినా సరే వైసీపీ హవా తగ్గలేదు. ఇక్కడ ప్రజలు ఎక్కువగా జగన్‌ని అభిమానిస్తున్నారు. అందుకే వైసీపీ ఆధిక్యం కొనసాగుతుంది. పైగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు బాగా ప్లస్ అవుతున్నాయి.


అయితే వీటితో పాటు గిరిజన ప్రజలకు విద్యా, వైద్య సదుపాయాలు మెరుగయ్యేలా చూస్తే ఇంకా బాగుంటుంది. అలాగే రవాణా సౌకర్యం మెరుగుపడాల్సిన అవసరముంది. ఇక ఇవన్నీ ప్రభుత్వం పట్టించుకుంటే ఇంకా వైసీపీకి తిరుగుండదు. ప్రస్తుతానికైనా అరకు పార్లమెంట్‌లో వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం వైసీపీ సత్తా చాటింది. దీని బట్టి చూసుకుంటే అందాల అరకులో సైకిల్ తిరగడానికి ఇబ్బందే అని చెప్పొచ్చు. వచ్చే ఎన్నికల్లో సైతం అరకులో వైసీపీ జెండా ఎగిరేలాగానే ఉంది.   




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తమిళ్ డైరెక్టర్స్ వెంట పడుతున్న మెగా హీరోలు ?

బస్సులోనే ఆక్సీజన్ .. బెంగళూరులో అద్భుత ప్రయోగం..

ఈ ప్ర‌శ్న‌లు పొలిటీషియ‌న్ ను అడిగే ద‌మ్ముందా : రేణూ దేశాయ్

షాకింగ్: అక్కడ 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు..!

కరోనా మూడో వేవ్ వస్తే.. అంత దారుణంగానా..?

బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన అయేషా టాకియా భర్త..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>