SportsN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/teamindia-womencricketer-covid3134e812-5d98-4175-9079-b0f95c992521-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/teamindia-womencricketer-covid3134e812-5d98-4175-9079-b0f95c992521-415x250-IndiaHerald.jpgహైదరాబాద్: కొవిడ్ తో ఇబ్బందుల్లో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ సభ్యురాలు.. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ క్రికెటర్ స్రవంతి నాయుడుకు భారత హ్యాండ్ బాల్ సమాఖ్య అధ్యక్షుడు అరిశనపల్లి జగన్ మోహన్ రావు అండగా నిలిచారు. కష్టకాలంలో ఉన్న స్రవంతి కుటుంబానికి ఆయన గురువారం ఆర్థిక సాయం అందించారు. కరోనా వైరస్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నా స్రవంతి తల్లిదండ్రులకు తనవంతుగా రూ.రెండు లక్షలు సహాయం చేశారు. స్రవంతి తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఇక, స్రవంతి పరిస్థితి తెలుసుకున్న భteamindia,womencricketer,covid;gopichand;editor mohan;hyderabad;virat kohli;cricket;india;jagan;telangana;central government;coronavirusమ‌హిళా క్రికెట‌ర్‌కి అండ‌గా జగన్ మోహన్ రావుమ‌హిళా క్రికెట‌ర్‌కి అండ‌గా జగన్ మోహన్ రావుteamindia,womencricketer,covid;gopichand;editor mohan;hyderabad;virat kohli;cricket;india;jagan;telangana;central government;coronavirusThu, 20 May 2021 20:52:36 GMTహైదరాబాద్: కొవిడ్ తో ఇబ్బందుల్లో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ సభ్యురాలు.. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ క్రికెటర్ స్రవంతి నాయుడుకు భారత హ్యాండ్ బాల్ సమాఖ్య అధ్యక్షుడు అరిశనపల్లి జగన్ మోహన్ రావు అండగా నిలిచారు. కష్టకాలంలో ఉన్న స్రవంతి కుటుంబానికి ఆయన గురువారం ఆర్థిక సాయం అందించారు. కరోనా వైరస్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నా స్రవంతి తల్లిదండ్రులకు తనవంతుగా రూ.రెండు లక్షలు సహాయం చేశారు. స్రవంతి తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఇక, స్రవంతి పరిస్థితి తెలుసుకున్న భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ రూ. 6.77 లక్షలు, హెచ్ సీఏ రూ. 3 లక్షలు ఆమెకు ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే.
దేశ వ్యాప్తంగా క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తుంది.ఇటు క్రీడాకారులు క‌రోనాబారిన ప‌డి ప్రాణాలు కోల్పోతున్న ప‌రిస్థితి నెల‌కొంది.క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఐపీఎల్ సైతం వాయిదా వేయ‌డం జ‌రిగింది.కొవిడ్ రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో మాజీ అథ్లెట్లు, కోచ్‌లను ఆదుకునే కార్యక్రమానికి కేంద్ర క్రీడా శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్), ఒలింపిక్ సంఘం (ఐఓసీ) కలిసి శ్రీకారం చుట్టాయి. ఇందుకోసం తెలంగాణ నుంచి భారత హ్యాండ్ బాల్ స‌మాఖ్య అధ్య‌క్ష‌డు జగన్ మోహన్ రావు, రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఐఓసీ ప్రతినిధులుగా నియమితులయ్యారు. వైద్య, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ అథ్లెట్లు, కోచ్‌లు ఆన్ లైన్ లో ఈ లింక్ (www.research.net/r/sai-ioa-covid-19) ఓపెన్ చేసి తమ వివరాలు నమోదు చేసుకుంటే తగిన సాయం చేయనున్నామని జగన్మోహన్ రావు తెలిపారు. ఒకసారి తమ పేరు నమోదు చేసుకోగానే ఐఓసీ నుంచి తమకు సమాచారం అందుతుందని దానిని పరిశీలించి తక్షణమే తాము స్పందించనున్నామని ఆయన చెప్పారు. ఐఓసీ, రాష్ట్ర క్రీడా మంత్రిత్వశాఖతో సమన్వయం చేసుకొని కరోనా సోకి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సహాయం అందించడం.. అలానే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి తగిన సహాయం అందించడానికి కృషి చేస్తామని జగన్మోహన్ రావు తెలిపారు. 


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కోవిడ్ రోగుల‌కు చిరు గుడ్ న్యూస్‌ ..!

డైరెక్ట్ అటాక్ .. నో కాంప్ర‌మైజ్ .. కేసీఆర్ కీల‌క నిర్ణ‌యాలు

ఎన్టీఆర్ లోని రొమాంటిక్ యాంగిల్ ను కూడా పరిచయం చేసిన బృందావనం..ఇద్దరితో..!!

'ఎన్టీఆర్' వాడే '9999' నెంబర్ వెనక ఉన్న అసలు రహస్యం అదే..!!

ఈ ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగ్స్ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి..!!

ఎన్టీఆర్ - 32 అనౌన్స్ మెంట్ ఆరోజే .... ??

త్రివిక్రమ్ ని దెబ్బ కొట్టిన పుష్ప



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>