MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/akhandaae542e4f-a063-4314-a8bc-21e75f9e6174-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/akhandaae542e4f-a063-4314-a8bc-21e75f9e6174-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ ఈ పేరు తెలియని వారుండరు. బాలయ్య ఫైట్స్, డైలాగ్‌లకు అభిమానులు కాదు భక్తులున్నారనడంలో అతిశయోక్తి ఏమీలేదు. తన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో బిగ్ స్క్రీన్‌పై బాలయ్య చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే బాలయ్య సినిమా రిలీజ్ అంటే థియేటర్ల దగ్గర అభిమానులు హోరెత్తుతారు. ఎలాగైన బాలయ్య సినిమాను ఫస్ట్‌ డే ఫస్ట్ షో చూడాలని తాపత్రయ..akhanda;balakrishna;boyapati srinu;geetha;kranthi;kranti;pragya jaiswal;tara;thaman s;makar sakranti;cinema;sangeetha;sankranthi;nandamuri balakrishna;director;october;nandamuri taraka rama rao;yashasvi jaiswal;sankranti;racchaఅఖండ ఇప్పుడు మిస్సయితే.. వచ్చేది అప్పుడే..?అఖండ ఇప్పుడు మిస్సయితే.. వచ్చేది అప్పుడే..?akhanda;balakrishna;boyapati srinu;geetha;kranthi;kranti;pragya jaiswal;tara;thaman s;makar sakranti;cinema;sangeetha;sankranthi;nandamuri balakrishna;director;october;nandamuri taraka rama rao;yashasvi jaiswal;sankranti;racchaThu, 20 May 2021 12:45:00 GMTనందమూరి బాలకృష్ణ ఈ పేరు తెలియని వారుండరు. బాలయ్య ఫైట్స్, డైలాగ్‌లకు అభిమానులు కాదు భక్తులున్నారనడంలో అతిశయోక్తి ఏమీలేదు. తన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో బిగ్ స్క్రీన్‌పై బాలయ్య చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే బాలయ్య సినిమా రిలీజ్ అంటే థియేటర్ల దగ్గర అభిమానులు హోరెత్తుతారు. ఎలాగైన బాలయ్య సినిమాను ఫస్ట్‌ డే ఫస్ట్ షో చూడాలని తాపత్రయ పడుతుంటారు. అయితే ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమాలో నటిస్తున్నాడు.


సినిమా ప్రారంభం నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తించింది. అంతేకాకుండా ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నాడన్న వార్త ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత అధికం చేసింది. అంతేకాకుండా ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. అంతేకాకుండా  ఈ సినిమా చిత్రీకరణ కూడా కాస్త మిగిలిఉంది. ఈ సినిమా షూటింగ్‌ను కరోనా తగ్గుముఖం పట్టిన వెంటనే తిరిగి ప్రారంభించనున్నారని సమాచారం. దాంతో ప్రస్తుతం ఈ సినిమా విడుదలపై నెట్టింట అనేక వార్తలు వస్తున్నాయి.  ఈ సినిమా విడుదల ఎప్పుడు, ఎలా జరుగుతందన్న విషయాలపై ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి.

 

అయితే తాజాగా మూవీ మేకర్స్ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా రిలీజ్ ఈ ఏడాది అక్టోబర్‌లో ఉండొచ్చని టాక్ నడుస్తోంది. ఇకవేళ ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యమై అక్టోబర్ నాటికి పూర్తి కాకపోతే ఇక బాలయ్య సంక్రాంతి పోరులో దిగుతాడని సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ, బాలయ్య అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తారక్ పై లోకేష్ కామెంట్స్ .. వైరల్ !!

రూటు మారుస్తున్న జూనియర్ ఎన్టీఆర్...?

ఆనాడు బాలకృష్ణ.. ఈరోజు ఎన్టీఆర్.. అభిమానుల దేవుళ్ళు..!!

ఆ ప్ర‌మాదంతో జూ. ఎన్టీఆర్‌లో వ‌చ్చిన మార్పులేమిటో తెలుసా?

తాను మాత్రమే కాదు తనవారు ఎదిగేలా ఎన్టీఆర్ సలహాలు..!!

క్లాసికల్ డ్యాన్స్ ఇరగదీస్తున్న ఎన్టీఆర్...ఎంత ముచ్చటగా ఉందంటే..?

"కొమరం భీమ్ " రెబల్.. అంటున్న బాలీవుడ్ స్టార్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>