EditorialThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/black-fungus33c0b85f-0c57-4a39-be7f-0181ce86d7b4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/black-fungus33c0b85f-0c57-4a39-be7f-0181ce86d7b4-415x250-IndiaHerald.jpgబ్లాక్ ఫంగ‌స్ సోకిన వారిలో ముక్కు నుండి అసాధార‌ణ‌మైన న‌లుపు రంగు స్రావం రావ‌డం, త‌ల‌నొప్పి, కంటి నొప్పి, క‌ళ్ల‌చుట్టూ వాపు, చూపు మంద‌గించ‌డం, క‌ళ్లు ఎరుపుగా మార‌డం, క‌న్ను మూసుకుపోవ‌డం, తెర‌వ‌లేక పోవ‌డం వంటివి ఉంటే బ్లాక్ ఫంగ‌స్ ల‌క్ష‌ణాలుగా గుర్తించాల్సి ఉంటుంది. అంతేకాక ముఖం తిమ్మిరిగా ఉండ‌టం, నోరు తెర‌వ‌లేక పోవ‌డం, న‌మ‌ల‌డంలో ఇబ్బందిగా ఉంటే బ్లాక్ ఫంగ‌స్‌కు సోకింద‌ని గుర్తిచండానికి ల‌క్ష‌ణాలుగా భావించాల‌ని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. అయితే ఈ ఫంగ‌స్ సోకింద‌ని భావిస్తే వెంట‌నే నేత్ర వైద్య నిపుణుBlack fungus;mandula;twitterబ్లాక్ ఫంగస్ : ఎలా గుర్తించాలో తెలుసా ?బ్లాక్ ఫంగస్ : ఎలా గుర్తించాలో తెలుసా ?Black fungus;mandula;twitterThu, 20 May 2021 11:08:00 GMTదేశ‌వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ విజృంభ‌ణ కొన‌సాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుద‌ల‌తో పాటు మ‌ర‌ణాల సంఖ్య ఆందోళ‌నకు గురిచేస్తున్నాయి. ఇదే క్ర‌మంలో బ్లాక్ ఫంగ‌స్ ప్ర‌జ‌ల‌ను మ‌రింత ఆందోళ‌న‌కు గురిచేస్తుంది. ఇప్ప‌టికే ఈ ఫంగ‌స్ బారిన ప‌డి దేశ‌వ్యాప్తంగా వంద‌లాది మంది మృత్యువాత ప‌డ్డారు. ఈ బ్లాక్‌ ఫంగ‌స్‌పై పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న లేక ప‌లువురు ప్రాణాల‌మీద‌కు తెచ్చుకుంటున్నారు. తాజాగా బ్లాక్ ఫంగ‌స్‌(మ్యూకోమైకోసిస్‌) కేసుల‌ను గుర్తించ‌డం, సంర‌క్ష‌ణ కోసం ఎయిమ్స్ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. అతి మ‌ధుమేహం ఉన్న‌వారు, అధిక మోతాదులో స్టెరాయిడ్లు వాడేవారికి ఈ బ్లాక్ ఫంగ‌స్ ముప్పు ఎక్కువ‌గా ఉంటుంద‌ని ఎయిమ్స్ కోవిడ్ వార్డు వైద్యులు పేర్కొంటున్నారు.

దేశ‌వ్యాప్తంగా బ్లాక్ ఫంగ‌స్ కేసులు న‌మోద‌వుతున్నాయి. మహారాష్ట్ర‌లో ఈ ఫంగ‌స్ సోకి 90మంది మ‌ర‌ణించ‌గా, రాజ‌స్థానంలో 100మందికిపైగా బ్లాక్ ఫంగ‌స్ ఇన్ఫెక్ష‌న్ సోకి చికిత్స పొందుతున్నారు. దీంతో రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం బ్లాక్ ఫంగ‌స్‌ను అటు వ్యాధిగా ప్ర‌క‌టించి చికిత్స‌కోసం ప్ర‌త్యేక వార్డును కూడా ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ బ్లాక్ ఫంగ‌స్ ప్ర‌భావం క‌నిపిస్తుంది. అయితే ఎక్కువ స్థాయిలో మ‌ధుమేహం, డ‌యాబెటిక్ కెటోయాసిడోసిస్ ఉన్న‌వారు, మోతాదుకు మించి స్టెరాయిడ్స్, టోసిలిజుమాబ్ వాడే రోగులు ఫంగ‌స్ బారిన ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఎయిమ్స్ తెలిపింది. అదేవిధంగా రోగ‌నిరోధ‌క మందులు అధికంగా వాడ‌టం, యాంటీ కాన్స‌ర్ చికిత్స పొందేవారు, ధీర్ఘ‌కాలికంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు, కొవిడ్ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌వారిపై ఈ వైర‌స్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. ఈ ఫంగ‌స్ బారినుండి బ‌య‌ట‌ప‌డిన‌వారిని క్ర‌మం త‌ప్ప‌కుండా వైద్యులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఎయిమ్స్ వైద్యులు సూచిస్తున్నారు.

బ్లాక్ ఫంగ‌స్ సోకిన వారిలో ముక్కు నుండి అసాధార‌ణ‌మైన న‌లుపు రంగు స్రావం రావ‌డం, త‌ల‌నొప్పి, కంటి నొప్పి, క‌ళ్ల‌చుట్టూ వాపు, చూపు మంద‌గించ‌డం, క‌ళ్లు ఎరుపుగా మార‌డం, క‌న్ను మూసుకుపోవ‌డం, తెర‌వ‌లేక పోవ‌డం వంటివి ఉంటే బ్లాక్ ఫంగ‌స్ ల‌క్ష‌ణాలుగా గుర్తించాల్సి ఉంటుంది. అంతేకాక ముఖం తిమ్మిరిగా ఉండ‌టం, నోరు తెర‌వ‌లేక పోవ‌డం, న‌మ‌ల‌డంలో ఇబ్బందిగా ఉంటే బ్లాక్ ఫంగ‌స్‌కు సోకింద‌ని గుర్తిచండానికి ల‌క్ష‌ణాలుగా భావించాల‌ని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. అయితే ఈ ఫంగ‌స్ సోకింద‌ని భావిస్తే వెంట‌నే నేత్ర వైద్య నిపుణుల‌ను సంప్ర‌దించాల‌ని వారు సూచించారు. రెగ్యుల‌ర్‌గా చికిత్స తీసుకోవ‌టం, ఎప్ప‌టిక‌ప్పుడు మ‌ధుమేహం తీవ్ర‌త‌ను చెక్‌చేయించుకోవ‌టం వంటివి చేయాల్సి ఉంటుంది. వ్యాధి నిర్ధార‌ణ కోసం సిటీ స్కాన్‌, ఎంఆర్ ఐ ప‌రీక్ష‌లు, పారానాస‌ల్ సైన‌సెస్ అవ‌స‌ర‌మైతే డాక్ట‌ర్ స‌ల‌హా మేర‌కు చేయాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.



" style="height: 626px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మాజీ సీఎంను బలికొన్న క‌రోనా

వావ్‌: ఎన్టీఆర్‌కు జీ తెలుగు స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్‌...!

ఎన్టీఆర్ 30 ఫ‌స్ట్ లుక్‌... స్మార్ట్‌లుక్‌లో చంపేశాడు

జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా నటించిన 2 సినిమాలివే ?

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 9 బెస్ట్ సినిమాలు ఇవే..!

ఎన్‌టీఆర్ ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడో తెలుసా..!

బిగ్ అప్డేట్ : అదిరిపోయిన కొమరం భీమ్ లుక్ ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>