MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsb318c713-2d1a-451f-a0bb-cbd2e2d3d3d6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsb318c713-2d1a-451f-a0bb-cbd2e2d3d3d6-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ హీరో ర‌జినీకాంత్ కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ర‌జినికాంత్ కు కేల‌వం కోలీవుడ్ లోనే కాక హిందీ, తెలుగు, మ‌ల‌యాళ భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. అయితే చాలా మంది హీరోల‌కు ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కానీ ర‌జిని కాంత్ కు అప్ప‌ట్లోనే జ‌పాన్ లో కూడా అభిమానులు ఉన్నారు. రజినీ సినిమా విడుద‌లైందంటే చాలు జ‌పాన్ లో పండ‌గ వాతావ‌ర‌ణ‌మే. అయితే ఇప్పుడు మ‌ళ్లీ అంత‌టి క్రేజ్ సంపాదించుకున్న హీరో ఎవ‌రా అని చూస్తే అది ఎన్టీయార్ కే ద‌క్కింది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ jr-ntr;view;ntr;ashok;ram pothineni;japan;rrr movie;cinema;rajani kanth;kollywood;tamil;hollywood;youtube;you tube;hindi;hero;nandamuri taraka rama raoఆ విష‌యంలో ర‌జినీ త‌ర‌వాత ఎన్టీయారే... !ఆ విష‌యంలో ర‌జినీ త‌ర‌వాత ఎన్టీయారే... !jr-ntr;view;ntr;ashok;ram pothineni;japan;rrr movie;cinema;rajani kanth;kollywood;tamil;hollywood;youtube;you tube;hindi;hero;nandamuri taraka rama raoThu, 20 May 2021 09:23:00 GMTతమిళ స్టార్ హీరో ర‌జినీకాంత్ కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ర‌జినికాంత్ కు కేల‌వం కోలీవుడ్ లోనే కాక హిందీ, తెలుగు, మ‌ల‌యాళ భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. అయితే చాలా మంది హీరోల‌కు ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కానీ ర‌జిని కాంత్ కు అప్ప‌ట్లోనే జ‌పాన్ లో కూడా అభిమానులు ఉన్నారు. రజినీ సినిమా విడుద‌లైందంటే చాలు జ‌పాన్ లో పండ‌గ వాతావ‌ర‌ణ‌మే. అయితే ఇప్పుడు మ‌ళ్లీ అంత‌టి క్రేజ్ సంపాదించుకున్న హీరో ఎవ‌రా అని చూస్తే అది ఎన్టీయార్ కే ద‌క్కింది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కు సైతం జ‌పాన్ లో అభిమానులు ఉన్నారు. ఎన్టీఆర్ సినిమా వ‌చ్చిందంటే చాలు జ‌పాన్ లో టికెట్ చిర‌గాల్సిందేన‌ట‌. ఎన్టీఆర్ ప్ర‌తి సినిమాను జ‌పాన్ అభిమానులు చూస్తార‌ట‌. ఒక యేడాది క్రితం జపాన్ లో ఎన్టీఆర్ పాట‌కు జ‌ప‌నీస్ జంట టిక్ టాక్ లో చేసిన డ్యాన్స్ వీడియో తెగ వైర‌ల్ అయింది. 2006లో విడుద‌లైన అశోక్ సినిమాలోని గోల గోల పాట‌కు జ‌పనీస్ జంట అచ్చం ఎన్టీఆర్-స‌మీరారెడ్డిని దింపేశారు. దాంతో జ‌పాన్ లో ఎన్టీఆర్ కు సైతం ర‌జినీ రేంజ్ లో క్రేజ్ ఉంద‌ని తెలిసిపోయింది.  

ఆ వీడియోను చూసి ఇక్క‌డ ఎన్టీఆర్ అభిమానులు సంబురాలు చేసుకున్నారు. త‌మ‌ హీరో క్రేజ్ చూసి మురిసిపోయారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియాకు ప‌రిచ‌యం అవుతున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ కొముర భీం పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుద‌లైన పోస్ట‌ర్లు అభిమానులను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. అంతే కాకుండా రామ్ ఫ‌ర్ భీం అంటూ విడుద‌ల చేసిన వీడియో యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ వీడియోకు మిలియ‌న్ల కొద్దీ వ్యూవ్స్ ల‌క్ష‌ల కొద్దీ లైకులు వ‌చ్చాయి. ఈ చిత్రానికి జ‌క్క‌న హాలీవుడ్ టెక్నిషియ‌న్స్ తో గ్రాఫిక్ వ‌ర్క్ చేయిస్తున్నారు. అంటే ఈ సినిమా హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోద‌ని ఇప్టటి వ‌ర‌కూ విడుద‌ల చేసిన వీడియోలు చూస్తేనే అర్థం అవుతుంది. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్యూలో ఎన్టీఆర్ కూడా అదే విష‌యాన్ని చెప్పారు. ఇక ఈ సినిమా విడుద‌ల‌యితే తెలుగు రాష్ట్రాల ఎన్టీఆర్ అభిమానులే కాదు... జ‌పాన్ లోని ఎన్టీఆర్ అభిమానులకు కూడా పండ‌గే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌రోనా నియంత్ర‌ణలో ఏపీ దేశానికే ఆద‌ర్శం..!!

అభిమానే నిర్మాతగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా...?

బర్త్ డే స్పెషల్ : ఎన్టీఆర్.. పడిలేచిన కెరటం !

పాలిటిక్స్ లోకి ఎన్టీఆర్.. ఎవరూ ఊహించని సమాధానం!

తాత మనవడిలో కామన్ పాయింట్స్ ఇవే.. !

కరోనాతో మాజీ సీఎం మృతి..!!

ఎన్టీఆర్ గురించి షాలినికి సీనియర్ ఎన్టీఆర్ ఏం చెప్పారో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>