PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona4762cbe2-2489-45d5-8385-87ceb4ad96ee-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona4762cbe2-2489-45d5-8385-87ceb4ad96ee-415x250-IndiaHerald.jpgప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాపించ‌డానికి అనేక మార్గాల‌ను ఎంచుకుంటోంది. ఒకరినుంచి మరొకరికి నోటితుంపర్ల‌ ద్వారా వ్యాపించే కరోనా ఇప్పుడు గాల్లోనూ వేగంగా వ్యాపిస్తోందని తేలింది. అలాగే కంటి ద్వారా కరోనా సోకుతుందని ఇప్ప‌టికే అనేక అధ్యయనాల్లో తేలింది. కంటిద్వారా వైర‌స్ వ్యాపించడమ‌నేది కళ్లకు అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. కరోనాతోకంటి నుంచి సుల‌భంగా శ‌రీరంలోకి? కంటికి ముప్పు మాత్రమే కాద‌ని.. కంటిలోని కణాలను తీవ్రంగా నాశనం చేస్తుందని ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు.corona;santoshi;coronavirusక‌ళ్ల ద్వారా క‌రోనా వ్యాప్తి??క‌ళ్ల ద్వారా క‌రోనా వ్యాప్తి??corona;santoshi;coronavirusThu, 20 May 2021 14:27:00 GMTప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాపించ‌డానికి అనేక మార్గాల‌ను ఎంచుకుంటోంది. ఒకరినుంచి మరొకరికి నోటితుంపర్ల‌ ద్వారా వ్యాపించే కరోనా ఇప్పుడు గాల్లోనూ వేగంగా వ్యాపిస్తోందని తేలింది. అలాగే కంటి ద్వారా కరోనా సోకుతుందని ఇప్ప‌టికే అనేక అధ్యయనాల్లో తేలింది. కంటిద్వారా వైర‌స్ వ్యాపించడమ‌నేది కళ్లకు అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. కరోనాతో కంటికి ముప్పు మాత్రమే కాద‌ని.. కంటిలోని కణాలను తీవ్రంగా నాశనం చేస్తుందని ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు.

కంటి నుంచి సుల‌భంగా శ‌రీరంలోకి?
కరోనా కంటి నుంచి శరీరంలోకి సులభంగా ప్రవేశించి క‌ణాల‌ను నాశనం చేస్తుందని గుర్తించారు. అమెరికాకు చెందిన మౌంట్‌ సైనాయ్ ఆసుప‌త్రి ఆధ్వర్యంలో ఈ కొత్త అధ్యయయ‌నం జ‌రిగింది. కంటిలోని స్రావాలను ఆధారంగా చేసుకుని వైరస్‌ శరీరంలోకి ప్రయాణిస్తుందని తేల్చారు. కంటిలోని కణాల నాశనం చేయడమే కాకుండా ACE2 ద్వారా వైరస్‌ శరీరంలోకి చేరుతుందని పరిశోధకులు కనుగొన్నారు. కంటిలోని ముందు భాగమైన లింబస్‌ వైరస్‌కు ఎక్కువగా ప్రభావితమ‌వుతోంద‌ని గుర్తించారు. కార్నియాకు తక్కువ ముప్పు ఉండ‌టం సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మంటున్నారు. ముఖంలోని ప్రతి భాగం వైరస్‌ను శరీరంలోకి పంపేందుకు వాహకంగా మారుతుంద‌ని, తరచూ చేతులు శుభ్రపరచుకోవాలని, ముఖం, క‌ళ్లు, నోరు  తాకకుండా ఉండాలని సూచిస్తున్నారు.

ఫేస్ షీల్డ్‌లు వాడ‌టం మంచిది!
ఫేస్‌ షీల్డ్‌ల వాడకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. రెండు మాస్క్‌లు ధ‌రించ‌డంతోపాటు ఈ ఫేస్ షీల్డ్‌ల‌వ‌ల్ల ఎదుటివారి నుంచి వ‌చ్చే నోటి తుంప‌ర్లుకానీ, గాలికానీ, క‌ళ్ల‌ద్వారాకానీ వ‌చ్చే వైర‌స్ వాహ‌కాల నుంచి ర‌క్ష‌ణ ఉంటుంద‌ని, ఇది క‌చ్చితంగా అంద‌రూ ఉప‌యోగించాల‌ని అధ్య‌య‌నంలో పాల్గొన్న శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. కంటికి చుట్టూ ర‌క్ష‌ణ క‌ల్పించే ఫ్రేమ్‌తో కూడిన క‌ళ్ల‌ద్దాల‌నైనా కచ్చితంగా వాడాల‌ని సూచిస్తున్నారు. విట్రో స్టెమ్‌ సెల్‌ నమూనాలను ఉప‌యోగించి కరోనా బారిన పడినవారి నమూనాలను సేకరించారు. ఆర్‌ఎన్‌ఏ సీక్వెన్సింగ్‌ చేయగా కంటిలోని లోపలి కణజాలంపై వైరస్‌ ప్రభావాన్ని గుర్తించారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆర్ఆర్ఆర్ ఎపిసోడ్‌లో కీలక ప్రశ్న..

త్రివిక్రమ్ ని దెబ్బ కొట్టిన పుష్ప

కన్న తల్లి వల్లే ఆ హీరోయిన్ సినిమా కెరీర్ నాశనం అయ్యిందా..?

మహారాష్ట్ర నేతలు: "మోదీ" ఎందుకీ పక్షపాతం ?

'ఎన్టీఆర్' కి టాలీవుడ్లో ఎంత మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసా..??

పెళ్లి గురించి ఓపెన్ అయిన మహానటి...

ఇదేం నటన అన్నారు.. నటన కే ప్రతి రూపం అయ్యాడు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>