PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-25fe05fe-070c-4af1-8b3c-6ca7ba67727e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-25fe05fe-070c-4af1-8b3c-6ca7ba67727e-415x250-IndiaHerald.jpgరాజకీయ నాయకులో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. ఈ విషయంలో చంద్రబాబు కి ఒక రూట్ అయితే జగన్ ది మరో బాట. ఆయనదంతా డైరెక్ట్ రూటే. చెప్పాలనుకున్నది చెబుతారు. చేయాలనుకున్నది చేస్తారు. జగన్ రాజకీయమే అలా దూకుడుగా సాగుతూ వస్తోంది. jagan;tara;jagan;ycp;dookuduఆ విషయంలో తగ్గేది లేదంటున్న జగన్... ?ఆ విషయంలో తగ్గేది లేదంటున్న జగన్... ?jagan;tara;jagan;ycp;dookuduThu, 20 May 2021 19:00:00 GMTరాజకీయ నాయకులో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. ఈ విషయంలో చంద్రబాబు కి ఒక రూట్ అయితే జగన్ ది మరో బాట. ఆయనదంతా డైరెక్ట్ రూటే. చెప్పాలనుకున్నది చెబుతారు. చేయాలనుకున్నది చేస్తారు. జగన్ రాజకీయమే అలా దూకుడుగా సాగుతూ వస్తోంది.

ఇక ముఖ్యమంత్రిగా జగన్ ని తీసుకుంటే ఆయనకంటూ కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు రాష్ట్రం మీద ఉన్నాయి. రాష్ట్రంలో సంక్షేమం అన్న మాట వినిపిస్తే పక్కన జగన్ పేరు రాయాల్సిందే. అలా అన్నట్లుగానే జగన్ లక్షా 31 వేల కోట్లతో ఏపీలో గత రెండేళ్ళల్లో నేరుగా పేదల ఇళ్లకే నగదుని చేరవేశారు. ఒక విధంగా దేశంలోనే ఇది ఒక రికార్డుగా చూడాలి. ఇంత పెద్ద మొత్తంలో డబ్బుని అది కూడా రెండవ వ్యక్తి ప్ర‌మేయం లేకుండా లబ్దిదారుల ఖాతలోకి ట్రాన్స్ ఫర్ చేయడం అంటే అది విశేష పరిణామంగా చెప్పాలి. మరో వైపు చూసుకుంటే జగన్ దృష్టిలో అభివృద్ధికి అర్ధాలు వేరు. పేదవాడు నిన్నటి కంటే నేడు బాగుంటే అదే అభివృద్ధి అని జగన్  అంటున్నారు. నాలుగు బిల్డింగులు కట్టేసి దానినే అభివృద్ధి అనుకోమని చెబితే తాను నమ్మను అంటున్నారు. అంటే జగన్ అభివృద్ధి అంటే ముందు పేద వాడి కడుపు నింపడానికే ప్రాధాన్యత ఇస్తారు అన్నది క్లారిటీగా చెప్పేశారు అన్న మాట.

మరి ఏపీలో సంక్షేమ రధం ఎదురులేకుండా సాగుతోంది. ఆ విషయంలో వంక పెట్టడానికే లేదు. తాజా బడ్జెట్ లోనూ జగన్ ఇదే సంగతి స్పష్టం చేశారు. కానీ అభివృద్ధి లేని సంక్షేమం వల్ల అప్పులు కుప్ప తప్ప రాష్ట్రం బాగుపడదు అంటున్న విపక్షాలకు జగన్ ఏం సమాధానం చెబుతారో చూడాలి. ఎవెరెన్ని చెప్పినా కూడా తాను తగ్గేది లేదు అంటున్న జగన్ సంక్షేమ సారధిగానే ఎప్పటికీ గుర్తుండిపోవాలనుకుంటున్నారు. మరి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా వైసీపీ సర్కార్ కి యాక్షన్ ప్లాన్ అవసరమని మేధావులు అంటున్నారు.



















Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గూడూరు రైల్వే స్టేషన్లో తృటిలో తప్పిన ప్రమాదం..

ఎన్టీఆర్ లోని రొమాంటిక్ యాంగిల్ ను కూడా పరిచయం చేసిన బృందావనం..ఇద్దరితో..!!

'ఎన్టీఆర్' వాడే '9999' నెంబర్ వెనక ఉన్న అసలు రహస్యం అదే..!!

ఈ ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగ్స్ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి..!!

ఎన్టీఆర్ - 32 అనౌన్స్ మెంట్ ఆరోజే .... ??

త్రివిక్రమ్ ని దెబ్బ కొట్టిన పుష్ప

కన్న తల్లి వల్లే ఆ హీరోయిన్ సినిమా కెరీర్ నాశనం అయ్యిందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>