SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/spiritualitye5332a6a-0808-410b-a88d-47611bb47949-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/spiritualitye5332a6a-0808-410b-a88d-47611bb47949-415x250-IndiaHerald.jpgజీవితంలో మనుషులు అందరూ సంతోషంగా ఉండలేరు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన బాధలు ఉంటాయి. కొందరికి కుటుంబ కలహాలు ఉండొచ్చు, ఆర్థిక పరమైన బాధలు ఉండొచ్చు, వ్యక్తిగత జీవిత సమస్య అంటే వివాహం కాకుండా ఉండొచ్చు. అయితే ఇలాంటి వారికి ఎన్ని వ్రతాలు, నోములు చేసినా పెళ్లి మాత్రం అవకుండానే ఉంటుంది. SPIRITUALITY;deva;jeevitha rajaseskhar;manu;marriage;letter;cow slaughter;v;santoshamమీకు వివాహం కావడం లేదా ఇలా చేసి చూడండి ?మీకు వివాహం కావడం లేదా ఇలా చేసి చూడండి ?SPIRITUALITY;deva;jeevitha rajaseskhar;manu;marriage;letter;cow slaughter;v;santoshamThu, 20 May 2021 00:12:43 GMTజీవితంలో మనుషులు అందరూ సంతోషంగా ఉండలేరు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన బాధలు ఉంటాయి. కొందరికి కుటుంబ కలహాలు ఉండొచ్చు, ఆర్థిక పరమైన బాధలు ఉండొచ్చు, వ్యక్తిగత జీవిత సమస్య అంటే వివాహం కాకుండా ఉండొచ్చు. అయితే ఇలాంటి వారికి ఎన్ని  వ్రతాలు, నోములు చేసినా పెళ్లి మాత్రం అవకుండానే ఉంటుంది. ఎన్నో  ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉంటారు.  మీలో ఎటువంటి లోపం లేకపోయినా ఏ ఒక్క సంబంధమూ కుదరక పోతుండండం మిమ్మల్ని చాలా కలవరపెడుతూ ఉంటుంది.  అయితే అలాంటి వారు గురువారం నాడు ఈ ఒక్క పని చేసి చేస్తే మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. గురువారం నాడు బియ్యపు పిండిని నీళ్లలో తడిపి ఉండల్లాగా చేసుకోవాలి. ఆ బియ్యపు ఉండ మీద చిటికెడు పసుపు వేసి మీ ఇష్ట దైవానికి నమస్కరించుకుని మీరు తయారు చేసుకున్ననటువంటి బియ్యపు ఉండని గోమాతకు అనగా ఆవుకు తినిపించండి. 

ఇలా చేయడం వల్ల సకల దేవతల ఆశీర్వాదం పొంది అన్ని దోషాలు తొలగి పోయి త్వరలోనే మీ వివాహానికి సంబందించి శుభ వార్తను వింటారని చెబుతున్నారు పండితులు. ఇలా చేసిన వారికి అతి త్వరలోనే మంచి సంబంధం కుదిరి ఓ ఇంటివారు అవుతారని తెలుపుతున్నారు జ్యోతిష్య నిపుణులు. అలాగే  శనిగ్రహాల చట్టూ 3 వారాల పాటు క్రమం తప్పకుండా ప్రదక్షణాలు చేసినా, కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుందని అంటున్నారు మన పండితులు. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఈ బియ్యపు ఉండను గురువారం నాడు మాత్రమే గోమాతకు తినిపించాల్సి ఉంటుంది. అది కూడా ఎవరికైతే వివాహం  కావాల్సి ఉందో వారే స్వయంగా  వారి చేతుల మీదుగా ఆవుకి మనస్పూర్తిగా ఆ బియ్యపు ఉండను తినిపించాలి. 

ఇలా చేసిన కొద్ది రోజుల్లోనే ఆ వ్యక్తికి మంచి సంబంధం కుదిరి వివాహం జరుగుతుందని చెబుతున్నారు.  మీరు ఇలాంటివి చేసే సమయంలో ప్రధానంగా ఆ దేవునిపై పూర్తి విశ్వాసాన్ని ఉంచాలి. అప్పుడే మీ ఇష్ట కార్యం సత్వరమే సఫలీకృతం అవుతుందని అంటున్నారు పండితులు. మరి మీలో ఎవరైనా ఇలాంటి వారు ఉంటే ఈ కార్యాన్ని ఈ రోజు నుండే ప్రారంభించండి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్కడ జనసేనతో వైసీపీ ఎమ్మెల్యేకి ఇబ్బందేనా?

బస్సులోనే ఆక్సీజన్ .. బెంగళూరులో అద్భుత ప్రయోగం..

ఈ ప్ర‌శ్న‌లు పొలిటీషియ‌న్ ను అడిగే ద‌మ్ముందా : రేణూ దేశాయ్

షాకింగ్: అక్కడ 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు..!

కరోనా మూడో వేవ్ వస్తే.. అంత దారుణంగానా..?

బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన అయేషా టాకియా భర్త..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>