PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-black-fungus475b8c24-7bdf-4584-a9e0-97f1ac17c4a5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-black-fungus475b8c24-7bdf-4584-a9e0-97f1ac17c4a5-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి కొంతమంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో బ్లాక్ ఫంగస్ గురించి ఎక్కువగా వింటున్నాము.black fungus;population;sugar;central government;v;coronavirus;rekha vedavyasబ్లాక్ ఫంగస్ పై ఉదాసీనత వద్దు..!బ్లాక్ ఫంగస్ పై ఉదాసీనత వద్దు..!black fungus;population;sugar;central government;v;coronavirus;rekha vedavyasWed, 19 May 2021 12:00:00 GMTదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి కొంతమంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో బ్లాక్ ఫంగస్ గురించి ఎక్కువగా వింటున్నాము. ఈ వ్యాధితో బాధపడేవారిలో ముందుగానే వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. కాబట్టి ఇలాంటి వారికి ఇది సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీటిలో మధుమేహంకూడా ఒకటి.

అయితే డయాబెటిక్ పేషెంట్ లకు బ్లాక్ ఫంగస్ ప్రాణాంతకంగా మారుతోందని అంటున్నారు. కరోనా వచ్చిన వారు పోషక ఆహారం తీసుకోవడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిక్ పేషెంట్లు కూడా వైద్యుల సలహా మేరకు వారి ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలని చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలని వైద్యాధికారులు చెబుతున్నారు.

ఇక ఇదిలా ఉండగా దేశంలో కరోనా వైరస్ ని అరికట్టడానికి పలు రాష్ట్రాలలో లాక్ డౌన్, కర్ఫ్యూని విధించారు. అయితే  దేశంలో మహమ్మారి క్రమంగా క్షీణిస్తున్నట్టు అర్థమవుతోందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. ఈ నెల 17 నాటికి దేశ జనాభాలో 1.8% మందికే వైరస్‌ సోకిందని, ఇంకా 98% మందికి ఈ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. నీతి ఆయోగ్‌ (ఆరోగ్య విభాగం) సభ్యుడు వీకే పాల్‌ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. చాలా రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి రేఖ నిలకడగా ఉందన్నారు.

మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయని, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని చెప్పారు. వైరస్‌ పునరుత్పత్తి సంఖ్య ఒకటి కంటే తక్కువగానే ఉన్నందున... మహమ్మారి క్షీణిస్తున్నట్టుగా శాస్త్రీయ కోణంలో భావించవచ్చన్నారు. దేశంలో ఇప్పటివరకూ 1.8% జనాభా కొవిడ్‌కు గురైనట్టు ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. అంటే సుమారు 98% మందికి ఇంకా వైరస్‌ ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల సంఖ్య ప్రస్తుతం తక్కువగానే ఉందని, అలాగని ఉదాసీనంగా ఉండటానికి వీల్లేదన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తండ్రి కొడుకులతో నటించిన 10 మంది హీరోయిన్లు వీళ్లే..

"బ్లాక్ ఫంగస్" కు అందుబాటులో మెడిసిన్ ? ఎక్కడో తెలుసా ?

బ‌ర్త్ డే స్పెష‌ల్ : పాట‌ల మాంత్రికుడు సిద్ శ్రీరామ్.. !

పవర్ స్టార్ 28 వ సినిమా నుండి అద్దిరిపోయే వార్త..!!

ఇండస్ట్రీలో లెస్బియన్‌గా నటించిన హీరోయిన్లు వీళ్లే..!

ఎన్నారైల‌ను పెళ్లాడిన టాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు.. !

భాయ్ అంటే మజాకా..! డిజాస్టర్ టాక్‌తోనూ అన్ని కోట్లు కొల్లగొట్టిందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>