PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-198db54408-0a4d-49ff-a121-009a4ad2acea-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-198db54408-0a4d-49ff-a121-009a4ad2acea-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ గురించి చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ లేదు. దీనిని ఎదుర్కునేందుకు ప్రభుత్వం, వైద్యులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిలో భాగంగా ఎన్నో వైద్యవిధానాలు, వివిధ రకాల మందుల సహాయంతో ఈ మహమ్మారిని నిలువరించేందకు కృషి..covid-19;mandula;nellore;ayurveda;aaviriఅల్లోపతి అద్భుతమా.. ఆయుర్వేదం అంత అలుసా..?అల్లోపతి అద్భుతమా.. ఆయుర్వేదం అంత అలుసా..?covid-19;mandula;nellore;ayurveda;aaviriWed, 19 May 2021 17:07:00 GMTమందుల సహాయంతో ఈ మహమ్మారిని నిలువరించేందకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్లాస్మా థెరపీ, ఎన్నో టీకాలు, ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. అత్యవసర చికిత్స పేరిట కరోనా మొదటి వేవ్ సమయం నుంచి ఎందరికో ప్లాస్మా థెరపీ చేస్తున్న సంగతి తెలిసిందే.
 

మొదట కరోనా బాధితులకు ప్లాస్మా థెరపీ చేయడం ద్వారా కాపాడవచ్చని అప్పట్లో వైద్యులు నిర్థరించారు. ఈ క్రమంలో ఎందరో ప్లాస్మాను దానం చేశారు. అదే విధంగా ఎంతో మంది ఖర్చు ఎక్కువైనప్పటికీ ప్రాణ భయంతో ఈ థెరపీకి ఓకే చెప్పారు. దేశ వ్యాప్తంగా ఈ థెరపీని ఇప్పటి వరకు లక్షల్లో చేయించుకున్నారు. ఈ థెరపీకి లక్షల్లో బిల్లులు కూడా వేశారు. దీని ద్వారా కరోనాను జయించవచ్చని ప్రజలు నమ్మారు. వారిని వైద్యులు నమ్మించారు. ఎంతో నమ్మకంగా దీని ద్వారా కరోనాను నిలువరించ వచ్చని వైద్యులు ధీమాగా చెప్పారు. అయితే ఇటీవల ఈ థెరపీ ద్వారా లాభం లేదని, కరోనాను నిలువరించేందుకు ఈ థెరపీ పనిచేయదని వైద్యాధికారులు తేల్చారు. దాంతో ఇకపై ఈ థెరపీను చేయొద్దని తెలిపారు.


ప్లాస్మా తరువాత ప్రజల్లో ఎక్కువ నమ్మకం సంపాదించిన ఔషధం రెమిడీసివిర్. ఈ ఇంజక్షన్ కూడా కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని వైద్యులు నమ్మపలికారు. దీనిని ప్రతి రోగికి ఆరు డోసులు వేస్తే కరోనా నుండి పూర్తి రక్షణ లభిస్తుందని వైద్యులు చెప్పారు. దాంతో రోగులు ధర ఎక్కువైనప్పటికీ రెమిడిసివిర్‌ కొనుగోలు చేసేందుకు అమితాసక్తి చూపారు. దీంతో రెమిడిసివిర్ నల్లబజారుకు కూడా చేరింది. ఒక్కొక్క ఇంజక్షన్‌ను లక్షలు పోసి కొనుగోలు చేశారు. అయితే దీనిని కూడా ఎందుకు పనికిరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా తేల్చి చెప్పింది.


అయితే ఇన్నాళ్లుగా ఆసుపత్రులు కరోనా మొదటి వేవ్ సమయం నుంచి ప్లాస్మా థెరపీ అని, రెమిడిసివిర్ అని లక్షల్లో ప్రజా ధనాన్ని అర్జించాయి. వారికి మార్తదర్శకాలు జారీ చేసిన ఐసీఎమ్‌ఆర్, డబ్లూహెచ్‌ఓ ఇన్నాళ్లూ ఎందుకు మౌనం పాటించాయి. వాటి ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదని తెలిసి కూడా ఏ వైద్యం అందుబాటులో లేదంటూ వాటిని ప్రోత్సహించాయి. అయితే అదే విధంగా ఆయుర్వేద వైద్యులు ఇస్తున్న ఔషధాలను మాత్రం పరీక్షించాలంటూ నిలిపివేస్తున్నారు. ఇదే తరహా ఘటన ఇటీవల నెల్లూరులో చోటుచేసుకుంది.


నెల్లూరుకు చెందిన ఓ ఆయుర్వేద వైద్యుడు ఈ మహమ్మారి సమయంలో తన వంతు సహాయంగా అక్కడి వారికి ఉచితంగా తన సొంత వైద్యం చేస్తున్నాడు. అతడి వైద్యానికి రోజురోజుకి ప్రజాదరణ గణనీయంగా పెరిగింది. మొదట వందల మంది వచ్చిన వారు ఇప్పుడు వేలల్లో వస్తున్నారు. పచ్చ కర్పూరం, మిరియాలతో అతడు చేస్తున్న ఔషధం కరోనాతో పోరాడేందుకు పనిచేస్తుందని ప్రజలు నమ్మారు. దాంతో ప్రతి రోజు ఆయన వద్ద ఆ ఔషధాన్ని తీసుకునేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు. ఈ విషయం అధికారులకు తెలియడంతో అతడు వెంటనే ఆ ఔషధాన్ని పంచడం ఆపివేయాలని అధికారులు సూచించారు. అంతేకాకుండా అతడు తయారు చేస్తున్న ఔషధాన్ని పరీక్షలకు పంపుతామని తెలిపారు. ఈ ఔషధం కచ్చితంగా కరోనాపై పనిచేస్తుందన్న రుజువు లేకపోవడంతో దీనిని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.



అయితే ఎటువంటి ఆధారం లేకుండా ప్లాస్మా థెరపీ, రెమిడిసివీర్ ఇంజక్షన్‌లకు అనుమతి నిచ్చిన వైద్య అధికారులు ఇప్పుడు ఈ ఆయుర్వేద ఔషదాన్ని ఎందుకు నిలిపివేస్తున్నారు. కరోనా ప్రారంభం అయిన కొత్తల్లో దీనిని ఎదుర్కొనేందుకు ఆవిరి పట్టమని, కషాయాలు తాగమని ప్రభుత్వాలు మార్గదర్వకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆవిరి పట్టడం ద్వారా కరోనా తగ్గుతుందని ఎటువంటి రుజువు లేక పోయినప్పటికీ వైద్యులు దానిని ఎందుకు ప్రోత్సహించారని, ఇప్పుడు ఆయుర్వేద ఔషధాలను ఎందుకు నిలిపివేస్తున్నారని ప్రజల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిని బట్టి చూస్తుంటే ప్రభుత్వ, వైద్యుల దృష్టిలో అల్లోపతి అద్భుతంగాను ఆయుర్వేదం అంటే అలుసుగాను కనిపిస్తున్నట్లు ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందింస్తుందో వేచి చూడాలి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెళ్లే మహానటి పాలిటి శాపం అయిందా  .... ??

దేశంలోనే ఆ పెద్ద కంపెనీ ఓనర్ మన టాలీవుడ్ హీరోయిన్ భర్త

అప్ డేట్ లేదా ... డైరెక్ట్ రిలీజా ... నిజమే ..... ??

హాలీవుడ్ పిలిచి అవకాశం ఇస్తే రిజెక్ట్ చేసిన 10 స్టార్స్

లాక్ డౌన్ లో చనిపోయిన 18 మంది సెలబ్రిటీలు వీళ్లే..

పవన్ కి తలనొప్పిగా మారుతున్న మూడు సినిమాలు..!!

మెగా హీరో ఫ్యాన్స్‌కు షాక్‌.. అయ్యో ఇలా జ‌రిగిందేంటి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>