PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics-611d14eb-ae79-4079-a582-3ec7e0d6c695-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics-611d14eb-ae79-4079-a582-3ec7e0d6c695-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో వైద్య ఆరోగ్య రంగం విషయంలో సిఎం వైఎస్ జగన్ చాలా సీరియస్ గా దృష్టి పెడుతున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే ఈ విషయంలో మాత్రం ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. రాజకీయంగా రోజు రోజుకి కూడా వైద్య ఆరోగ్య శాఖపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నా సరే సిఎం జగన్ మాత్రం తగ్గడం లేదు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే వైద్య ఆరోగ్య రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కీలక అంశాలకు సంబంధించి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఈ కరోనా సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా కూడా జాగ్రత్తjagan,ycp,ap;kumaar;anil music;ankhita;jagan;andhra pradesh;arogyasri;anil kumar singhalబ్లాక్ ఫంగస్ విషయంలో జగన్ కీలక నిర్ణయం...!బ్లాక్ ఫంగస్ విషయంలో జగన్ కీలక నిర్ణయం...!jagan,ycp,ap;kumaar;anil music;ankhita;jagan;andhra pradesh;arogyasri;anil kumar singhalWed, 19 May 2021 19:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో వైద్య ఆరోగ్య రంగం విషయంలో సిఎం వైఎస్ జగన్ చాలా సీరియస్ గా దృష్టి పెడుతున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే ఈ విషయంలో మాత్రం ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. రాజకీయంగా రోజు రోజుకి కూడా వైద్య ఆరోగ్య శాఖపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నా సరే సిఎం జగన్ మాత్రం తగ్గడం లేదు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే వైద్య ఆరోగ్య రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కీలక అంశాలకు సంబంధించి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.

ఈ కరోనా సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు. ఇక నాలుగు బోధనాస్పత్రుల్లో సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ సదుపాయాలను క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా సీఎం  వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. జాతీయ స్థాయి ప్రమాణాలతో అస్పత్రుల అభివృద్ధి చేస్తున్నాం అని జగన్ అన్నారు. అన్ని బోధన ఆస్పత్రులలో డయాగ్నస్టిక్‌ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా వైద్య సేవలు, పరీక్షలు అందిస్తామని ఆయన వివరించారు.

ఆ పరికరాల నిర్వహణ బాధ్యత ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఇస్తామని చెప్పారు. కోవిడ్‌ సంక్షోభంలో ప్రతి ఒక్కరిలో ఎంతో ఒత్తిడి ఉందని వైద్యులు, నర్సులు, ఆస్పత్రుల సిబ్బంది మొదలు..గ్రామాల్లో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, వలంటీర్లు అందరూ ఒత్తిడిలో ఉన్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో, అంకిత భావంతో పని, అందుకే కరోనా మహమ్మారిని ఎదుర్కోగలుగుతున్నాం అని ఆయన కొనియాడారు. అందువల్లనే మన దగ్గర మరణాలు కూడా తక్కువే అని అన్నారు జగన్. ఎవ్వరూ సహనం కోల్పోవద్దు. సంయమనంతో ఉండండి అని సూచించారు. మంచితనంతో కింది స్థాయి సిబ్బందితో పని చేయించాలి అని ఆయన సూచించారు. కోవిడ్ అనంతరం మూకర్ మయోసిస్ మేనేజ్ మెంట్ (బ్లాక్ ఫంగస్) కోసం చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కోవిడ్ వచ్చి తగ్గి బ్లాక్ ఫంగస్ బారినపడ్డ వారి కోసం కన్ను, ముక్కు, తదితర సర్జరీలకు ఆరోగ్యశ్రీలో ప్యాకేజీలు నిర్ణయిస్తూ ఈ ఉత్తర్వులు  ఇచ్చారు. ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీకాల తయారికి 9 కంపెనీలకు కేంద్రం అనుమతి...

షాకింగ్: అక్కడ 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు..!

కరోనా మూడో వేవ్ వస్తే.. అంత దారుణంగానా..?

బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన అయేషా టాకియా భర్త..

ఆ న‌టీమ‌ణి భ‌ర్త‌కు అప్ప‌ట్లోనే సొంత విమానం ఉండేద‌ట‌..

పెళ్లే మహానటి పాలిటి శాపం అయిందా  .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>