PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/corona9a50c57a-6201-461f-beb7-35b1cdc0e8bb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/corona9a50c57a-6201-461f-beb7-35b1cdc0e8bb-415x250-IndiaHerald.jpgకొవిడ్ బారిన ప‌డిన వ్య‌క్తుల‌కు 14 రోజుల స్వీయ నిర్బంధం త‌ప్పినిస‌రి. ఈ రెండువారాల గ‌డువు ముగియ‌గానే చాలామంది త‌మ‌కు వైర‌స్ త‌గ్గిపోయిందంటూ బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నారు. శ‌రీరంలో వైర‌స్ నెగెటివ్ చూపించినంత‌మాత్రాన పూర్తిగా త‌గ్గిపోయింద‌నుకోవ‌డం అపోహేనంటున్నారు వైద్య‌నిపుణులు. కొవిడ్ నుంచి కోలుకున్న త‌ర్వాత కూడా అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. వైర‌స్ నేరుగా ఊపిరితిత్తుల‌పై దాడిచేస్తుండ‌టంతో గ‌తంలో కిడ్నీ స‌మ‌స్య‌లున్న‌వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, వీరు 14 రోజులు గ‌డ‌వ‌గానే త‌గ్గిపోయింద‌నుకోcorona;mandulaమూత్ర‌పిండాల మార్పిడి చేసుకున్న‌వారికి ప్రాణ‌హాని??మూత్ర‌పిండాల మార్పిడి చేసుకున్న‌వారికి ప్రాణ‌హాని??corona;mandulaWed, 19 May 2021 08:23:46 GMTకొవిడ్ బారిన ప‌డిన వ్య‌క్తుల‌కు 14 రోజుల స్వీయ నిర్బంధం త‌ప్పినిస‌రి. ఈ రెండువారాల గ‌డువు ముగియ‌గానే చాలామంది త‌మ‌కు వైర‌స్ త‌గ్గిపోయిందంటూ బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నారు. శ‌రీరంలో వైర‌స్ నెగెటివ్ చూపించినంత‌మాత్రాన పూర్తిగా త‌గ్గిపోయింద‌నుకోవ‌డం అపోహేనంటున్నారు వైద్య‌నిపుణులు. కొవిడ్ నుంచి కోలుకున్న త‌ర్వాత కూడా అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. వైర‌స్ నేరుగా ఊపిరితిత్తుల‌పై దాడిచేస్తుండ‌టంతో గ‌తంలో కిడ్నీ స‌మ‌స్య‌లున్న‌వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని,  వీరు 14 రోజులు గ‌డ‌వ‌గానే త‌గ్గిపోయింద‌నుకోకుండా మూడునెల‌ల విశ్రాంతి తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

కిడ్నీ స‌మ‌స్య‌లున్న‌వారిలో వ్యాధినిరోధ‌క‌శ‌క్తి త‌క్కువ‌?
కిడ్నీ స‌మ‌స్య‌లున్న‌వారిలో వ్యాధినిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉంటుంది. కొవిడ్ సోకే అవ‌కాశాలు వీరికి ఎక్కువ‌గా ఉంటాయి. మూత్ర‌పిండాల మార్పిడి చేసుకున్న‌వారికి, తీవ్ర‌మైన కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో డ‌యాల‌సిస్ చేయించుకున్న‌వారికి ప్రాణ‌హాని ఉంటోంద‌ని వైద్యులు తెలియ‌జేస్తున్నారు. క‌రోనా మొద‌టి ద‌శ‌లో తీవ్ర‌మైన కిడ్నీ వ్యాధులు, డ‌యాల‌సిస్‌పై ఉన్న‌వారు.. కిడ్నీ మార్పిడి చేయించుకున్న‌వారిలో మ‌ర‌ణాలు 25 శాతం ఉన్న‌ట్లు అంత‌ర్జాతీయ అధ్య‌య‌నాల్లో తేలింది. క‌రోనా రెండోద‌శ‌  ఉధృతంగా ఉండ‌టంతో కిడ్నీవ్యాధులున్న‌వారు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందేన‌ని, క‌చ్చితంగా టీకా వేయించుకోవాల‌ని సూచిస్తున్నారు.

ర‌క్త‌పోటును నియంత్రించుకుంటుండాలి!!
మ‌ధుమేహాన్ని, ర‌క్త‌పోటును ఎప్ప‌టిక‌ప్పుడు నియంత్రించుకోవాలి. కొన్ని ర‌కాల కిడ్నీ వ్యాధుల‌కు చికిత్స‌లో భాగంగా దీర్ఘ‌కాలం స్టెరాయిడ్లు, రోగ‌నిరోధ‌క‌శ‌క్తిని త‌గ్గిచే మందులు వాడుతుంటారు. అలాంటివారు వైద్యుల‌ను సంప్ర‌దించి వాటిలో ఏ మందులు కొన‌సాగించాలో, వేటి మోతాదు త‌గ్గించాలో తెలుసుకొని ఉప‌యోగిస్తే మంచిది. వైర‌స్ సోక‌వ‌డంవ‌ల్ల కిడ్నీల్లోని పొర‌లు దెబ్బ‌తిన్న‌వారిలో కొద్దికాలానికి మ‌ళ్లీ సాధార‌ణ స్థితి ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. క‌రోనా ఉంచి కోలుకున్న త‌ర్వాత కూడా మూత్ర‌పిండాల్లో స‌మ‌స్య‌లు కొన‌సాగుతున్న‌వారి మూత్రంలో ప్రొటీన్‌, ఎర్ర ర‌క్త‌క‌ణాలు పోవ‌డంవంటి స‌మ‌స్య‌లు కొన‌సాగుతున్నాయి. కొవిడ్ న‌య‌మైనా మూత్ర‌పిండాల స‌మ‌స్య పూర్తిగా త‌గ్గేవ‌ర‌కు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఇష్టానుసారం నొప్పిని త‌గ్గించే మాత్ర‌లు వాడ‌కూడ‌దు. నీరు ఎక్కువ‌గా తీసుకుంటుండాలి. హైబీపీకి వాడే కొన్ని మందులు కిడ్నీల్లోని ఏసీఈ-2 ఎంజైమ్ పై ప్ర‌భావం చూపుతున్నాయి. బీపీ మందులు వాడేవారు వైద్యుణ్ని సంప్ర‌దించి మాత్ర‌మే వాడాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నేపాల్ లో భూకంపం

రాజమౌళి అభిప్రాయంతో ఏకీభవించలేకపోతున్న జూనియర్ చరణ్ ?

కరోనా వైరస్‌ ముమ్మాటికీ చైనా సృష్టేనా..?

స్టార్ హీరోలతో పోటీకి సిద్దమవుతున్న జక్కన్న..!

ఈటెలకి రియల్ సీన్ చూపిస్తున్నారా... ?

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం..!!

ఒక్క హిట్టు కోసం ఎదురుచూపు... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>