PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-5557c7b7-aaea-4b74-ac5c-ee21e154ae45-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-5557c7b7-aaea-4b74-ac5c-ee21e154ae45-415x250-IndiaHerald.jpgదేశంలో ఇపుడు సార్వత్రిక ఎన్నికలు లేవు. లోక్ సభ ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ కచ్చితమైన సమయం ఉంది. మోడీ రెండవ సారి అధికారంలోకి వచ్చి రెండేళ్ళు మాత్రమే అయింది. కానీ ఇపుడు దేశంలో ఎందుకో పదేళ్ల యూపీయే పాలనతో ఏడేళ్ళ మోడీ ఏలుబడిని పోల్చి చూస్తున్నారు. modi;modi;bharatiya janata party;congress;petrol;oil;vegetable market;international;nijam;party;coronavirusఏడేళ్లలో ఇంత జరిగిందా... ?ఏడేళ్లలో ఇంత జరిగిందా... ?modi;modi;bharatiya janata party;congress;petrol;oil;vegetable market;international;nijam;party;coronavirusWed, 19 May 2021 22:00:00 GMTదేశంలో ఇపుడు సార్వత్రిక ఎన్నికలు లేవు. లోక్ సభ ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ కచ్చితమైన సమయం ఉంది. మోడీ రెండవ సారి అధికారంలోకి వచ్చి రెండేళ్ళు మాత్రమే అయింది. కానీ ఇపుడు దేశంలో ఎందుకో పదేళ్ల యూపీయే పాలనతో ఏడేళ్ళ మోడీ ఏలుబడిని పోల్చి చూస్తున్నారు.

దానికి రెండవ దశలో పీక్స్ చేరిన కరోనా వైరస్  ప్రధాన కారణం అని చెప్పాలి. నిజంగా కరోనా కనుక ఈ ప్రపంచంలో లేకపోతే రాకపోతే ఇంత తొందరగా మోడీ మీద జనాలకు కూడా వ్యతిరేకత వచ్చే అవకాశమైతే అక్షరాలా  లేదు.  కానీ కరోనాతో ఒక్కసారి పేదలు, మధ్యతరగతి జీవితాలు తల్లకిందులు అయ్యాయి. దాని మీద గత అయిదేళ్ళలో మోడీ సర్కర్ తీసుకున్న నిర్ణయాల ప్రభావం దారుణంగా పడిపోయింది.

మోడీ 2017లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్ధిక వ్యవస్థ మీద పెద్ద దెబ్బ పడింది. ఇక జీఎస్టీ విధానంతో పన్నులు ఒక్కసారిగా పెరిగాయి. అలాగే దేశంలో అనేక రంగాలు కునారిల్లాయి. ఇంకో వైపు చూస్తే క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో తగ్గినా కూడా దేశంలో మాత్రం పెట్రోల్ ధరలు పెంచుకుంటూనే పోయారు. ఇపుడు ఇవన్నీ కలసి గుర్తుకు వస్తున్నాయి.

కరోనాకు మందు లేకపోయినా ప్రైవేట్ ఆసుపత్రులు దోచుకుంటున్న తీరుతో కూడా మధ్యతరగతి వర్గాలు మండిపోతున్నాయి. సెకండ్ వేవ్ ని గట్టిగా కట్టడి చేసి ఉంటీ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అన్నదే జనాల ఆలోచన. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ తమ పదేళ్ల ఏలుబడిలోనూ మోడీ ఏడేళ్ళ పాలనలోనూ దేశంలో వివిధ రంగాల పరిస్థితి మీద రూపొందించిన ఒక  నివేదిక ఇపుడు కలకలం రేపుతోంది.

ఆ నివేదిక మేరకు చూస్తే దేశంలో యూపీయే ఏలుబడిలో పేదలు 270 మిలియన్లుగా ఉంటే కేవలం ఏడేళ్ల కాలంలోనే వారి సంఖ్య 400కి పైరిగిందిట‌. జీడీపీ కూడా మైనస్ ఏడు శాతానికి ఎగబాకితే కాంగ్రెస్ ఏలుబడిలో జీడీపీ ఏడు నుంచి ఎనిమిది శాతం ఉంది అంటున్నారు. ఇక నిరుద్యోగం చూసుకున్నా కూడా నాలుగు శాతం నుంచి పదకొండు శాతానికి ఎగబాకిందిట. ఇవన్నీ మోడీ ఏలుబడిలోనే జరిగాయని కాంగ్రెస్ నిందిస్తోంది. మరి రానున్న మూడేళ్ళ కాలంలో అన్ని రంగాలను పట్టాలెక్కించి కొంతైన సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం బీజేపీ పెద్దలకు ఉందని అంటున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్కడ జనసేనతో వైసీపీ ఎమ్మెల్యేకి ఇబ్బందేనా?

బస్సులోనే ఆక్సీజన్ .. బెంగళూరులో అద్భుత ప్రయోగం..

ఈ ప్ర‌శ్న‌లు పొలిటీషియ‌న్ ను అడిగే ద‌మ్ముందా : రేణూ దేశాయ్

షాకింగ్: అక్కడ 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు..!

కరోనా మూడో వేవ్ వస్తే.. అంత దారుణంగానా..?

బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన అయేషా టాకియా భర్త..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>