MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-vindhya-innovative-idea2560123f-a8a4-497b-a1ec-e7e2b6cee72d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-vindhya-innovative-idea2560123f-a8a4-497b-a1ec-e7e2b6cee72d-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మరి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ వైరస్ బారినపడే వారి సంఖ్య లక్షల్లో నమోదు అవుతున్నాయి.చాలా మంది ప్రజలు సమయానికి వైద్యం అందక చనిపోయిన వారే ఎక్కువగా ఉంటున్నారు.Anchor Vindhya;deva;mandula;bus;hero;oxygen;v;coronavirusయాంకర్ వింధ్యా వినూత్న ఆలోచన..!యాంకర్ వింధ్యా వినూత్న ఆలోచన..!Anchor Vindhya;deva;mandula;bus;hero;oxygen;v;coronavirusWed, 19 May 2021 09:00:00 GMTదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మరి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ వైరస్ బారినపడే వారి సంఖ్య లక్షల్లో నమోదు అవుతున్నాయి.చాలా మంది ప్రజలు సమయానికి వైద్యం అందక చనిపోయిన వారే ఎక్కువగా ఉంటున్నారు. హాస్పిటల్స్‌లో ఆక్సిజన్‌, బెడ్స్‌ కొరత వల్ల వైద్య సదుపాయాలు అందక ఎంతోమంది తమ సొంతవారి కళ్లముందే ప్రాణాలు విడుస్తున్నారు.

అయితే సోనూసూద్.. కరోనా కష్టకాలంలో బాగా వినిపించిన ఈ పేరు ఇది. ప్రభుత్వాలను మించి పెద్దమనసుతో పేదలకు సాయం అందించడానికి ముందుకు వచ్చాడు సోనూసూద్. కరోనా కారణంగా వింధించిన లాక్ డౌన్ వల్ల వేలాది మంది కార్మికులు గ్రామాలకు వెళ్లలేక ఇబ్బందిపడుతున్న సమయంలో వారిపాలిట దేవుడు అయ్యాడు. బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి కార్మికులను తమ గ్రామాలకు చేర్చి వారి కన్నీళ్లు తుడిచాడు. అంతటితో సోను సాయం ఆగిపోలేదు. వేదికగా సాయం కోరిన ప్రతిఒక్కరికి తనవంతు సహాయం అందిస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు. రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశ నలుమూలలనుంచి ఎవరు సాయం కోరిన సోనూసూద్ చేస్తూ వచ్చారు.

ఇక సోను పెద్ద మనసుకు ఎన్నో అవార్డులు.. దేశమంతటా ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం బెడ్స్, ఆక్సిజన్ లేని కోవిడ్ పేషెంట్లకు సోనూసూద్ తన వంతు సహకారం అందిస్తున్నారు. సోనూసూద్‌ కోవిడ్‌ బాధితుల కోసం సొంతంగా ఫౌండేషన్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా కోవిడ్‌ బాధితులకు మందులు, ఆక్సిజన్‌ పంపిణి చేస్తూ సమయానికి ఆదుకుంటున్నారు. దీంతో ఆయన ఫౌండేషన్‌కు విరాళాలు ఇచ్చేందుకు పలువురు సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు.

తాజాగా యాంకర్‌, ఐపీఎల్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగు హోస్ట్‌ వింధ్యా సైతం వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. తన దగ్గరున్న ఖరీదైన దుస్తులను వేళం వేసి వాటి ద్వారా వచ్చిన డబ్బులను సోనూ సూద్‌ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్‌ చేసింది. ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని తన సహా నటీనటులకు ఆమె విజ్ఞప్తి చేసింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివిర్‌ ఔట్..?

"బ్లాక్ ఫంగస్" వీరికి ప్రాణాంతకం కానుందా ?

గుడ్‌ న్యూస్‌: బ్లాక్‌ ఫంగస్‌కు ఆయుష్‌ వైద్యం

నేపాల్ లో భూకంపం

బైడెన్‌ దంపతుల వార్షిక ఆదాయం ఎంతో తెలుసా ?

రాజమౌళి అభిప్రాయంతో ఏకీభవించలేకపోతున్న జూనియర్ చరణ్ ?

కరోనా వైరస్‌ ముమ్మాటికీ చైనా సృష్టేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>