PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdpf622f392-f26b-4daf-8672-499a32005a35-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdpf622f392-f26b-4daf-8672-499a32005a35-415x250-IndiaHerald.jpgఏపీలో టీడీపీకి కాస్త బలంగా ఉండే జిల్లాల్లో కృష్ణా జిల్లా కూడా ఒకటి. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లాలో టీడీపీకి మంచి ఫలితాలు వచ్చేవి. అలాగే టీడీపీ అధికారంలోకి రావడానికి కృష్ణా జిల్లా బాగా ఉపయోగపడేది. అయితే 2014 వరకు జిల్లాలో టీడీపీ బాగానే బలంగా కనిపించింది. కానీ 2019 ఎన్నికల తర్వాత జిల్లాలో వైసీపీ బలంగా తయారైంది.tdp;krishna;tiru;vamsi;krishna river;jagan;2019;mp;district;vallabhaneni vamsi;assembly;mla;minister;cycle;tdp;local language;ycp;kovvur;kothapalli;tiruvuru;party;kothapalli samuel jawaharఅక్కడ సైకిల్ తోక్కేవాళ్లు కావాలి..!అక్కడ సైకిల్ తోక్కేవాళ్లు కావాలి..!tdp;krishna;tiru;vamsi;krishna river;jagan;2019;mp;district;vallabhaneni vamsi;assembly;mla;minister;cycle;tdp;local language;ycp;kovvur;kothapalli;tiruvuru;party;kothapalli samuel jawaharWed, 19 May 2021 12:45:00 GMTఏపీలో టీడీపీ కాస్త బలంగా ఉండే జిల్లాల్లో కృష్ణా జిల్లా కూడా ఒకటి. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లాలో టీడీపీకి మంచి ఫలితాలు వచ్చేవి. అలాగే టీడీపీ అధికారంలోకి రావడానికి కృష్ణా జిల్లా బాగా ఉపయోగపడేది. అయితే 2014 వరకు జిల్లాలో టీడీపీ బాగానే బలంగా కనిపించింది. కానీ 2019 ఎన్నికల తర్వాత జిల్లాలో వైసీపీ బలంగా తయారైంది.


ఆ ఎన్నికల్లో జగన్ వేవ్‌లో వైసీపీ 14 అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీటు గెలుచుకుంది. అటు టీడీపీ రెండు అసెంబ్లీ, ఒక ఎంపీ సీటు మాత్రమే గెలుచుకుంది. అయితే ఇందులో గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో టీడీపీకి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ మాత్రమే మిగిలారు. అటు ఓడిపోయిన నేతలు కూడా పార్టీలో పెద్దగా కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వం దెబ్బకు పలువురు టీడీపీ నేతలు సైడ్ అయిపోయారు. అసలు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం ఒక్కటీ చేయడం లేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం జిల్లాలో టీడీపీకి ఘోరమైన ఫలితాలు వచ్చాయి.


ముఖ్యంగా నాయకత్వం వీక్‌గా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ అడ్రెస్ లేకుండా పోయింది. అలా టీడీపీ నాయకత్వం వీక్‌గా ఉన్న నియోజకవర్గాల్లో తిరువూరు ముందు వరుసలో ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఓడిపోయిన కే‌ఎస్ జవహర్, ప్రస్తుతం కొవ్వూరు రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఇక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.


అయితే స్వామిదాస్ 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచారు. ఇక 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. దీంతో 2019లో మాజీ మంత్రి జవహర్‌ని తిరువూరులో నిలబెట్టారు. ఆయన కూడా జగన్ వేవ్‌లో ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక జవహర్ మళ్ళీ తన పాత నియోజకవర్గం కొవ్వూరుపై దృష్టిపెట్టారు. దీంతో తిరువూరులో సైకిల్‌ని నడిపించే నాథుడు లేకుండా పోయాడు. స్వామిదాస్ సైతం సైలెంట్‌గానే ఉంటున్నారు. ఇలా నాయకులు సరిగ్గా లేకపోవడం వల్ల తిరువూరులో టీడీపీ బాగా వీక్ అయిపోయింది.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వైరల్ : సెక్స్ చేసేటప్పుడు శబ్దాలు వస్తున్నాయి అని ఫిర్యాదు ఎక్కడంటే.?

సోనమ్‌ భర్త ఆస్తి విలువ అన్ని కోట్లా..?

ఆహా : సాయి పల్లవి అనుకోని అతిధి..!!

మోది ప‌స తగ్గింది : అల్ జ‌జీరా

బన్నీపై రుసరుసలాడుతున్న హీరోయిన్..

తండ్రి కొడుకులతో నటించిన 10 మంది హీరోయిన్లు వీళ్లే..

"బ్లాక్ ఫంగస్" కు అందుబాటులో మెడిసిన్ ? ఎక్కడో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>