PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/saganampatama-swachandamga-poyela-cheyadama834b45de-c1e5-496f-af79-6bfa47768096-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/saganampatama-swachandamga-poyela-cheyadama834b45de-c1e5-496f-af79-6bfa47768096-415x250-IndiaHerald.jpgతాజా ప‌రిణామాల‌తో ఈట‌ల రాజేంద‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోనే తిష్ట‌వేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప‌ట్టుకోల్పోతే మ‌ళ్లీ తిరిగి సంపాదించుకోవ‌టం క‌ష్ట‌మ‌ని భావిస్తున్న ఆయ‌న‌.. మండ‌లాల, మేజ‌ర్ పంచాయ‌తీల వారీగా తెరాస నేత‌ల‌తో స‌మావేశాలు అయ్యేందుకు నిర్ణ‌యించుకున్నార‌ట‌. అయితే ఇప్ప‌టికే ప‌లువురు జ‌డ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, స‌ర్పంచ్‌లు గంగుల‌తో భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ నిర్ణ‌య‌మే మానిర్ణ‌య‌మ‌ని వారు స్ప‌ష్టం చేశారు. వారు స్వ‌చ్ఛందంగా మ‌ద్ద‌తు ప‌ల‌క‌లేద‌ని, గంగుల ఒత్తిడితోనే అలా చేసుంటార‌ని భావిస్తుetela rajender;view;kcr;telangana rashtra samithi trs;రాజీనామా;mla;minister;central government;party;huzurabadసాగ‌నంప‌డ‌మా ..? స్వ‌చ్ఛందంగా వెళ్లేలా చేయ‌డ‌మా?సాగ‌నంప‌డ‌మా ..? స్వ‌చ్ఛందంగా వెళ్లేలా చేయ‌డ‌మా?etela rajender;view;kcr;telangana rashtra samithi trs;రాజీనామా;mla;minister;central government;party;huzurabadWed, 19 May 2021 06:27:00 GMTహుజురాబాద్ కేంద్రంగా రాజ‌కీయం హీటెక్కుతోంది. అక్క‌డి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఈట‌ల రాజేంద‌ర్ రాజ‌కీయ పునాదుల‌ను పెకిలించేందుకు టీఆర్ఎస్ ఆప‌రేష‌న్ హుజురాబాద్ చేప‌ట్టిన విష‌యం విధిత‌మే. దీనిలో భాగంగా అధిష్టానం మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌ను రంగంలోకి దింపి క్యాడ‌ర్ చేజార‌కుండా చూస్తోంది. కేసీఆర్ వ్యూహాలతో ముందుకెళ్తున్న గంగుల నియోజ‌క‌వ‌ర్గంలో ఈట‌ల హ‌వాకు చెక్‌పెట్టుకుంటూ వ‌స్తున్నాడు. ఈట‌ల‌కు అనుచ‌రులుగా ఉన్న‌వారినిసైతం పార్టీ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని చెప్పించ‌డంలో గంగుల స‌క్సెస్ అవుతున్నారు. క్ర‌మంగా హుజురాబాద్‌లో రాజేంద‌ర్ త‌న ప‌ట్టును కోల్పోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో మంగ‌ళ‌వారం నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లిన ఆయ‌న మంత్రి గంగుల‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. గంగుల సైతం ఈట‌ల‌పై విరుచుకుప‌డ్డారు.

తాజా ప‌రిణామాల‌తో ఈట‌ల రాజేంద‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోనే తిష్ట‌వేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప‌ట్టుకోల్పోతే మ‌ళ్లీ తిరిగి సంపాదించుకోవ‌టం క‌ష్ట‌మ‌ని భావిస్తున్న ఆయ‌న‌.. మండ‌లాల, మేజ‌ర్ పంచాయ‌తీల వారీగా తెరాస నేత‌ల‌తో స‌మావేశాలు అయ్యేందుకు నిర్ణ‌యించుకున్నార‌ట‌. అయితే ఇప్ప‌టికే ప‌లువురు జ‌డ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, స‌ర్పంచ్‌లు గంగుల‌తో భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ నిర్ణ‌య‌మే మానిర్ణ‌య‌మ‌ని వారు స్ప‌ష్టం చేశారు. వారు స్వ‌చ్ఛందంగా మ‌ద్ద‌తు ప‌ల‌క‌లేద‌ని, గంగుల ఒత్తిడితోనే అలా చేసుంటార‌ని భావిస్తున్న ఈట‌ల‌.. వారితోసైతం భేటీ అయ్యేందుకు స‌మాయ‌త్తం అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డంతో పౌరుషంతో ఈట‌ల ఎమ్మెల్యే ప‌ద‌వికిసైతం రాజీనామా చేస్తారులే అని సీఎం కేసీఆర్, తెరాస నేత‌లు భావిస్తూ వ‌చ్చారు. ఈట‌ల మాత్రం రూట్‌మార్చి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డే వ‌ర‌కు రాజీనామా చేయ‌వ‌ద్ద‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఈట‌ల‌ను బ‌లవంతంగా ఎమ్మెల్యే ప‌ద‌వికి, పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసేలా చేసేందుకు పార్టీ అధిష్టానం వ్యూహాత్మ‌కంగా ముందుకెళ్తుంది. ద‌మ్ముంటే రాజీనామా చెయ్ అంటూ ప‌దేప‌దే రెచ్చ‌గొట్ట‌డం ద్వారా ఈట‌ల‌ను స్వ‌చ్ఛందంగా పార్టీ నుంచి వైదొలిగేలా చేయాల‌న్న భావ‌న‌లో ఆ పార్టీ నేత‌లు ఉన్నారు. అలా కాకుంటే బ‌లవంతంగా పార్టీని నుండి స‌స్పెండ్ చేస్తే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న‌పై అధిష్టానం ధృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈట‌ల‌ను ఇర‌కాటంలో పెట్టి ఉక్కిరిబిక్కిరి చేసేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాలు అమ‌లు చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెలకి రియల్ సీన్ చూపిస్తున్నారా... ?

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం..!!

ఒక్క హిట్టు కోసం ఎదురుచూపు... ?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!

స్టార్ ప్రొడ్యూసర్ తో సాయి పల్లవి ఫైట్ ?... అసలేం జరిగింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>