PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajendarf512ec3b-fc51-45c1-bc29-228eb1106c2b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajendarf512ec3b-fc51-45c1-bc29-228eb1106c2b-415x250-IndiaHerald.jpgకేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. హుజారాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌ను కట్టడి చేసేందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఈటల ఫ్యాక్టర్‌ను సమర్థంగా ఎదుర్కొనే బాధ్యతను ఆయన పార్టీలోని కీలక ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఈటల రాజేందర్‌కు సొంత నియోజకవర్గంలోని పార్టీపై గట్టి పట్టు ఉంది. ఈ విషయం ఇప్పటికే ఆయన అనుకూల వర్గాలు ప్రెస్ మీట్ల ద్వారా వెల్లడి చేశాయి. అయితే.. పార్టీయే ఫైనల్‌.. వ్యక్తులు కాదు అనే విషయాన్ని హైలెట్ చేసేలా కేసీఆర్ వ్యూహ రచన సిద్ధం చేస్తున్నారు. etela-rajendar;view;kcr;kamalakar;rachana;tiru;gangula kamalakar;thanneeru harish rao;district;backward classes;huzur nagar;minister;press;local language;karimnagar;partyఈటల బాణంపై కేసీఆర్‌ హరీశ్ అస్త్రం..?ఈటల బాణంపై కేసీఆర్‌ హరీశ్ అస్త్రం..?etela-rajendar;view;kcr;kamalakar;rachana;tiru;gangula kamalakar;thanneeru harish rao;district;backward classes;huzur nagar;minister;press;local language;karimnagar;partyWed, 19 May 2021 10:00:00 GMTకేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. హుజారాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌ను కట్టడి చేసేందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఈటల ఫ్యాక్టర్‌ను సమర్థంగా ఎదుర్కొనే బాధ్యతను ఆయన పార్టీలోని కీలక ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఈటల రాజేందర్‌కు సొంత నియోజకవర్గంలోని పార్టీపై గట్టి పట్టు ఉంది. ఈ విషయం ఇప్పటికే ఆయన అనుకూల వర్గాలు ప్రెస్ మీట్ల ద్వారా వెల్లడి చేశాయి. అయితే.. పార్టీయే ఫైనల్‌.. వ్యక్తులు కాదు అనే విషయాన్ని హైలెట్ చేసేలా కేసీఆర్ వ్యూహ రచన సిద్ధం చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్‌ లో ఉపఎన్నిక వస్తే.. దీటుగా ఎదుర్కొనేందుకు పార్టీని సమాయత్తం చేసే బాధ్యతను కేసీఆర్ హరీశ్‌కు అప్పగించారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ కేడర్‌ ఈటల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకునే బాధ్యతను కేసీఆర్ రాష్ట్ర స్థాయిలో మంత్రి హరీశ్ రావు, బి.వినోద్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాకే చెందిన బీసీ మంత్రి గంగుల కమలాకర్ ఈటలపై తరచూ విమర్శలు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో మంత్రి గంగుల కమలాకర్‌ తో సమన్వయం చేసుకుంటూ పార్టీపై ఈటల తిరుగుబాటు ప్రభావం లేకుండా చేయాలన్నది కేసీఆర్ వ్యూహంగా ఉంది.

ఈటలను కట్టడి చేసే రాజకీయ తంత్రంలో హరీశ్ రావుకు సహాయపడేందుకు క్షేత్ర స్థాయిలో మరో నలుగురు ముఖ్య నేతలకు కూడా హుజూరాబాద్‌ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, మండలాలకు నలుగురు ముఖ్య నేతలను ఇన్‌చార్జిలుగా నియమించారు. హుజూరాబాద్‌లో కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, ఇల్లంతకుంట, జమ్మికుంట మండలాల్లో శాతవాహన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు ఇన్‌చార్జీలుగా పనిచేస్తారు.

ఇక ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు వీణవంక, కిమ్స్‌ రవీందర్‌రావుకు కమలాపూర్‌ మండల బాధ్యతలు అప్పగించారు. తమకు అప్పగించిన మండలాలు, మున్సిపాలిటీల్లో పార్టీ కేడర్‌తో పాటు, స్థానిక సంస్థల ప్రతినిధులు, సర్పంచ్‌లు పార్టీ వెంట నడిచేలా చేయడం వీరి బాధ్యత. మొత్తం మీద ఈటల ప్రభావం పార్టీపై పడకుండా కేసీఆర్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ల పెళ్లి వెనుక దాగి ఉన్న రహస్యం ఇదే..

NTR అభిమానులకు విజ్ఞప్తి ...!!

కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివిర్‌ ఔట్..?

సోనూ ప్రశ్నకు ఆసుపత్రుల మైండ్ బ్లాక్ ?

"బ్లాక్ ఫంగస్" వీరికి ప్రాణాంతకం కానుందా ?

గుడ్‌ న్యూస్‌: బ్లాక్‌ ఫంగస్‌కు ఆయుష్‌ వైద్యం

నేపాల్ లో భూకంపం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>