EditorialVijayaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/jagan-ycp-stalin-dmk-jayalalita-karunanidhi-chandrababu-84516b9d-226d-465c-8d19-e2923c0bccfe-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/jagan-ycp-stalin-dmk-jayalalita-karunanidhi-chandrababu-84516b9d-226d-465c-8d19-e2923c0bccfe-415x250-IndiaHerald.jpgఇంతకీ స్టాలిన్ తీసుకున్న రెండు నిర్ణయాలు ఏమిటంటే మొదటిది జయలలిత హయాంలో మొదలైన అమ్మ క్యాంటిన్లను కంటిన్యు చేయటం, రెండోది కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు అసెంబ్లీలోని అన్నీ పార్టీల ఎంఎల్ఏలతో కమిటి వేయటం. స్టాలిన్ తీసుకున్న నిర్ణయంతో తమిళనాడులో కక్షా రాజకీయాలకు దాదాపు ఫులిస్టాప్ పడినట్లే అనే అనుకోవాలి. కరోనా సంక్షోభం నివారణకు ప్రతిపక్ష ఎంఎల్ఏలతో కమిటి వేసినా ఛైర్మన్ గా స్టాలినే ఉంటారు. అందులోను యావత్ అధికారయంత్రాంగమంతా స్టాలిన్ చేతిలోనే ఉంటారు కాబట్టి ఎలాంటి సమస్యలూ ఎదురుకావు. ఏదేమైనా రాష్టjagan ycp stalin dmk jayalalita karunanidhi chandrababu;cbn;jayalalitha;mithra;shatru;udhayanidhi stalin;korcha;jagan;andhra pradesh;west bengal - kolkata;government;tamilnadu;tdp;stalin;coronavirus;santoshamహెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కూడా స్టాలిన్ను ఎందుకు అనుసరించకూడదు ?హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కూడా స్టాలిన్ను ఎందుకు అనుసరించకూడదు ?jagan ycp stalin dmk jayalalita karunanidhi chandrababu;cbn;jayalalitha;mithra;shatru;udhayanidhi stalin;korcha;jagan;andhra pradesh;west bengal - kolkata;government;tamilnadu;tdp;stalin;coronavirus;santoshamWed, 19 May 2021 05:00:00 GMTరాజకీయాల్లో శాశ్వత శతృవులు..శాశ్వత మిత్రులుండరనేది నానుడి. రాజకీయాల్లో ప్రత్యర్ధులే కానీ శతృవులుండరనే విషయాన్ని నేతలు మరచిపోయి చాలా కాలమే అయ్యింది.  ప్రత్యర్ధులను శతృవులుగా చూస్తు ఆధిపత్య పోరాటాలు చేస్తున్న వాళ్ళని, ప్రభుత్వంలోని అధికారపార్టీపై బురదచల్లేందుకు ప్రతిరోజు ప్రయత్నిస్తున్న వాళ్ళు దేశంలో కొల్లలుగా కనిపిస్తారు. ఇలాంటి పరిస్ధితి ఏపి, పశ్చిమ బెంగాల్ తో పాటు చాలా రాష్ట్రాల్లో రోజూ చూస్తున్నదే. అయితే తాజగా తమిళనాడులో మొదలైన స్టాలిన్ రాజకీయాలను చూస్తుంటే సంతోషంగా ఉంది. తమిళనాడులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న స్టాలిన్ తీసుకున్న రెండు నిర్ణయాలు ప్రజాస్వామ్యవాదులందరు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.




ఇంతకీ స్టాలిన్ తీసుకున్న రెండు నిర్ణయాలు ఏమిటంటే మొదటిది జయలలిత హయాంలో మొదలైన అమ్మ క్యాంటిన్లను కంటిన్యు చేయటం, రెండోది కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు అసెంబ్లీలోని అన్నీ పార్టీల ఎంఎల్ఏలతో కమిటి వేయటం. స్టాలిన్ తీసుకున్న నిర్ణయంతో తమిళనాడులో కక్షా రాజకీయాలకు దాదాపు ఫులిస్టాప్ పడినట్లే అనే అనుకోవాలి. కరోనా సంక్షోభం నివారణకు ప్రతిపక్ష ఎంఎల్ఏలతో కమిటి వేసినా ఛైర్మన్ గా స్టాలినే ఉంటారు. అందులోను యావత్ అధికారయంత్రాంగమంతా స్టాలిన్ చేతిలోనే ఉంటారు కాబట్టి ఎలాంటి సమస్యలూ ఎదురుకావు. ఏదేమైనా రాష్ట్రంలో సంక్షోభంలో కూరుకుపోతున్న సమయంలో ప్రతిపక్షాలను కూడా కలుపుకుని పోవటం శుభపరిణామమనే చెప్పాలి.




సరే తమిళనాడు విషయాన్ని పక్కన పెట్టేసి ఏపి రాజకీయాలను చూద్దాం. 2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాజకీయాలు చాలా అధ్వాన్నమైపోయాయనే చెప్పాలి. ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా రాజకీయాల్లో లేకుండానే చేయాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా జగన్ను దెబ్బ కొట్టేందుకు ఫిరాయింపులను ఏ స్ధాయిలో ప్రోత్సహించారో అందరు చూసిందే. సరే ఖర్మంచాలక టీడీపీ ఓడిపోయి చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాన్ని గబ్బుపట్టిద్దామనే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర రాజకీయాలు చాలా భ్రష్టుపట్టిపోయాయి. సరే చంద్రబాబు ఎంతటి నీచ రాజకీయాలు చేస్తున్నా జగన్ హుందా రాజకీయాలు మొదలుపెడితే మంచి ప్రారంభం అన్నట్లే లెక్క. కక్షారాజకీయాల్లో చంద్రబాబును కాకుండా స్టాలిన్ను ఎందుకు జగన్ ఆదర్శంగా తీసుకోకూడదు ?




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రజలకు గుడ్ న్యూస్.. తెలంగాణ మంత్రి గొప్ప నిర్ణయం?

ఈటెలకి రియల్ సీన్ చూపిస్తున్నారా... ?

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం..!!

ఒక్క హిట్టు కోసం ఎదురుచూపు... ?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>