PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-19dfb425d1-20c3-4bb0-a8cd-11c77993d2c0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-19dfb425d1-20c3-4bb0-a8cd-11c77993d2c0-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా దేశ ప్రజలు కంటినిండా నిద్ర కూడా పోలేకపోతున్నారు. ఎప్పుడు ఎలా సోకుతుందా అని భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ మొదటి వేవ్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతోంది. గతేడాది కరోనా వ్యాప్తితో పోల్చుకుంటే సెకండ్ వేవ్ నరకాన్ని తలపిస్తుంది. కరోనా..covid-19;delhi;brazil;south africa;canada;american samoa;kanna lakshminarayana;october;central government;vకరోనా మూడో వేవ్ వస్తే.. అంత దారుణంగానా..?కరోనా మూడో వేవ్ వస్తే.. అంత దారుణంగానా..?covid-19;delhi;brazil;south africa;canada;american samoa;kanna lakshminarayana;october;central government;vWed, 19 May 2021 20:00:00 GMTన్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా దేశ ప్రజలు కంటినిండా నిద్ర కూడా పోలేకపోతున్నారు. ఎప్పుడు ఎలా సోకుతుందా అని భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ మొదటి వేవ్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతోంది. గతేడాది కరోనా వ్యాప్తితో పోల్చుకుంటే సెకండ్ వేవ్ నరకాన్ని తలపిస్తుంది. కరోనా కారణంగా ప్రతిరోజూ మరణిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇదే సమయంలో దేశంలో కరోనా గురించి పరిశోధకులు చెప్తున్నది వింటే అందరూ షాక్ అవ్వాల్సిందే.


దేశంలో కరోనా మూడో వేవ్ రావడం కచ్చితంగా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న వేగాన్ని బట్టి చూస్తే థర్డ్ వేవ్ సెకండ్ వేవ్‌ను మించి భయంకరంగా ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. అయితే ఒకవేళ దేశంలో థర్డ్ వేవ్ మొదలైతే ఎన్నాళ్ళు కొనసాగుతుంది?, ఎప్పుడు వస్తుంది?,  అనే విషయాల గురించి ఇంకా స్పష్టత లేదని అధికారులు తెలిపారు. అయితే ఇప్పటికే దేశంలో అనేక కరోనా వేరియంట్లు ఉన్నాయి. వాటిలో బీ 1.617 వేరియంట్ అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ వేరియంట్ ఇప్పటికే ప్రపంచంలో యూకే, బ్రెజిల్, సౌతాఫ్రికా, అమెరికా దేశాల్లో కూడా వ్యాప్తి చెందింది.


అయితే ఈ వేరియంట్ అన్ని వేరియంట్లు కన్నా 15 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోంది. కానీ ఇది తక్కువ ప్రాంతాలకు పరిమితమైందని, ఇటువంటి వేరియంట్లు మరిన్ని కొత్త వేరియంట్లను ఉత్పత్తి చేస్తాయని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. అంతేకాకుండా దేశంలో ప్రస్తుతం ఉన్న వేరియంట్లను చూస్తే థర్డ్ వేవ్ తప్పదని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. అయితే కరోనా మొదటి వేవ్ సమయంలో బాధితుడి ఊపిరితిత్తులను నాశనం చేయడానికి 10 రోజుల సమయం తీసుకుంది. ఇక సెకండ్ వేవ్ సమయంలో చూస్తే కేవలం 5-7 రోజుల్లో ఊపిరితిత్తులను పూర్తిగా నాశనం చేస్తోంది. ఇదే విధంగా థర్డ్ వేవ్ వస్తే కేవలం 2-3 రోజుల్లోనే ఊపిరితిత్తులను నాశనం చేసి, బాధితులను ఐసీయూలో పడేస్తుందని, ప్రస్తుతం ఆంధ్రాలో ఉన్న వేరియంట్ ఇదే పని చేస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.



ఇదిలా ఉంటే మొదటి వేవ్‌లో  మధ్య వయసు వారిని వైరస్ టార్గెట్ చేస్తే సెకండ్ వేవ్‌లో యువకులను దెబ్బతీసింది. ఈ ప్రకారం చూస్తే థర్డ్ వేవ్‌లో 18 ఏళ్ళ లోపు వారికి ఎక్కువ ప్రమాదం అని నిపుణులు వాదిస్తున్నారు. అయితే ఇప్పటికే బారత్‌లో 18 ఏళ్ల లోపు వారికి ఈ ఏడాది అక్టోబర్ నాటికి వ్యాక్సిన్ తీసుకువస్తామని వ్యాక్సిన్ తయారీ సంస్థలు చెబుతున్నాయి. ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఫైజర్ కంపెనీ 18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ తయారు చేసింది. దీనికి కెనడా అనుమతినిచ్చింది. త్వరలో మన దేశంలో కూడా ఇదే విధంగా చిన్నారులకు వ్యాక్సిన్ తయారు చేయకపోతే థర్డ్ వేవ్‌ను కట్టడి చేయడం కష్టమవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇజ్రాయెల్ యుద్దం.. పాలస్తీనాతోనా..లేక హమాస్ తోనా ?

షాకింగ్: అక్కడ 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు..!

బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన అయేషా టాకియా భర్త..

ఆ న‌టీమ‌ణి భ‌ర్త‌కు అప్ప‌ట్లోనే సొంత విమానం ఉండేద‌ట‌..

పెళ్లే మహానటి పాలిటి శాపం అయిందా  .... ??

దేశంలోనే ఆ పెద్ద కంపెనీ ఓనర్ మన టాలీవుడ్ హీరోయిన్ భర్త



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>