MoviesMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/nagarjuna-amalafbd538eb-903f-4b53-9362-474302f86de4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/nagarjuna-amalafbd538eb-903f-4b53-9362-474302f86de4-415x250-IndiaHerald.jpgహీరో హీరోయిన్లుగా సినిమాల్లో క‌లిసి న‌టించాక‌.. ఆ త‌ర్వాత నిజ‌జీవితంలో పెళ్లిపీట‌లెక్కిన‌ జంట‌లు చిత్ర ప‌రిశ్ర‌మలో చాలానే ఉన్నాయి. అయితే వారిలో మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్‌గా, భార్యాభ‌ర్త‌ల అనుబంధానికి అస‌లైన నిర్వ‌చ‌నంలా నిలిచేవారు మాత్రం కొద్దిమందే. టాలీవుడ్‌లో అలాంటి జంట‌గా గ‌త త‌రంలో విజ‌య‌నిర్మ‌ల‌- కృష్ణ నిలిస్తే.. ఈ త‌రంలో అక్కినేని నాగార్జున‌- అమ‌ల‌ను ముందుగా చెప్పుకోవాలి. నాగార్జున‌, అమ‌ల జంట‌గా 7 చిత్రాల్లో క‌లిసి న‌టించారు. వీటిలో నాగార్జున కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన శివ చిత్రం కూడా ఉంది.nagarjuna-amala;nagarjuna akkineni;shiva;jeevitha rajaseskhar;krishna;nageshwara rao akkineni;prema;cinema;love;lord siva;hero;bengali;fatherఎప్ప‌టికీ మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ ఆ జంట‌..?ఎప్ప‌టికీ మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ ఆ జంట‌..?nagarjuna-amala;nagarjuna akkineni;shiva;jeevitha rajaseskhar;krishna;nageshwara rao akkineni;prema;cinema;love;lord siva;hero;bengali;fatherWed, 19 May 2021 19:34:35 GMTహీరో హీరోయిన్లుగా సినిమాల్లో క‌లిసి న‌టించాక‌.. ఆ త‌ర్వాత నిజ‌జీవితంలో పెళ్లిపీట‌లెక్కిన‌ జంట‌లు చిత్ర ప‌రిశ్ర‌మలో చాలానే ఉన్నాయి. అయితే వారిలో మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్‌గా, భార్యాభ‌ర్త‌ల అనుబంధానికి అస‌లైన నిర్వ‌చ‌నంలా నిలిచేవారు మాత్రం కొద్దిమందే. టాలీవుడ్‌లో అలాంటి జంట‌గా గ‌త త‌రంలో విజ‌య‌నిర్మ‌ల‌- కృష్ణ నిలిస్తే.. ఈ త‌రంలో అక్కినేని నాగార్జున‌- అమ‌ల‌ను ముందుగా చెప్పుకోవాలి. నాగార్జున‌, అమ‌ల జంట‌గా 7 చిత్రాల్లో క‌లిసి న‌టించారు. వీటిలో నాగార్జున కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన శివ చిత్రం కూడా ఉంది. వెండితెర‌పై వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ గొప్ప‌గా పండేది. అయితే నిజ‌జీవితంలోనూ అది వీరిని జంట‌గా మారుస్తుంద‌ని మాత్రం అప్ప‌ట్లో ఎవ‌రూ ఊహించ‌నిది. దీనికి కార‌ణం.. అమ‌లకు విజ‌య‌వంత‌మైన హీరోయిన్‌గా పేరున్నా.. ఆమె తెలుగ‌మ్మాయి కాదు. పైగా కుటుంబ నేప‌థ్యం కూడా చాలా సాధార‌ణ‌మైన‌ది. కాని నాగార్జున కేవ‌లం స్టార్ హీరో మాత్ర‌మేకాదు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు రెండుక‌ళ్లుగా ద‌శాబ్దాల‌పాటు చిత్ర ప‌రిశ్ర‌మ‌నేలిన ఇద్ద‌రు మేటిన‌టుల్లో ఒక‌రైన ఏఎన్ఆర్ కొడుకు. ఒక‌పెద్ద చిత్ర‌నిర్మాణ సంస్థ‌, ప్ర‌ముఖ స్టూడియోకు వార‌సుడు.
 
 అయితే ఇలాంటివి అడ్డొస్తే అది నిజ‌మైన‌ప్రేమ ఎలా అవుతుంది..?  నిర్ణ‌యం సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఓ ఫైన్ డే.. నాగ్.. అమ‌ల‌కు ఐల‌వ్‌యూ చెప్పేశాడు. నీకిష్ట‌మైతే జీవితాంతం నీతో క‌లిసి న‌డుస్తాన‌ని ఆమె క‌ళ్లలోకి చూస్తూ అడిగాడు.. అంతే.. అప్ప‌టికే నాగ్‌పై మ‌న‌సునిండా ప్రేమ నింపుకుని, ఆ మాట‌కోస‌మే ఎదురుచూస్తున్న అమ‌ల క‌ళ్లు ఉద్వేగంతో ఆనంద‌భాష్పాలు రాల్చాయి. ఆ త‌రువాత వారిద్ద‌రి జంట క‌లిసి ఏడ‌డుగులు న‌డ‌వ‌డానికి ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌లేదు. వీరిద్ద‌రి వివాహం ఏఎన్ఆర్ కు ఇష్టం లేద‌ని, ఆయ‌న‌ అంగీక‌రించ‌లేద‌ని ఇలా ఎవ‌రికి న‌చ్చిన‌ట్టుగా వారు అప్ప‌ట్లో ప్ర‌చారం చేసినా వారి అన్యోన్య జీవితం ఇలాంటి రూమ‌ర్ల‌ను ప‌టాపంచ‌లు చేసింది.అంతేకాదు..ఏఎన్ఆర్ కూడా అమ‌ల ప‌ట్ల త‌న వాత్స‌ల్యాన్ని ప‌లుసార్లు చాటుకున్నారు కూడా.


 అమ‌ల 1967లో కోల్‌క‌తా న‌గ‌రంలో జ‌న్మించింది. ఆమె తండ్రి బెంగాలీ. ఆయ‌న ఇండియ‌న్ నేవీలో అధికారి. త‌ల్లి ఐరిష్ మ‌హిళ‌. భ‌ర‌త‌నాట్యంలో ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకున్న ఆమె ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్ర‌ముఖ త‌మిళ‌ ద‌ర్శ‌కుడు టి. రాజేంద‌ర్ నాట్య ప్ర‌ధాన‌మైన ఓ సినిమాలో అమ‌ల‌ను న‌టింప‌జేసేందుకు ఆమె త‌ల్లిని రిక్వెస్ట్ చేసి ఒప్పించాడు. అమ‌ల తెరంగేట్రం చేసిన ఆ సినిమా మైథిలీ ఎన్నై కాథ‌లి. ఈ చిత్రం బాక్సాఫీసు వ‌ద్ద ఘ‌న‌విజ‌యాన్ని సాధించ‌డంతో అమ‌లను వ‌రుస‌గా అవ‌కాశాలు వెతుక్కుంటూ వ‌చ్చాయి. ద‌క్షిణాది భాష‌ల‌న్నింటిలో ఆమె ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించింది. నాగ్‌తో వివాహ‌మ‌య్యాక సినిమాల‌కు విరామం ఇచ్చిన అమ‌ల స్వ‌చ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి మూగ‌జీవుల ర‌క్ష‌ణ కోసం చేస్తున్న‌ కృషి ఆమెకు సేవారంగంలోను ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతేకాదు.. ఆమె మంచి మ‌న‌సునూ అంద‌రికీ చాటిచెప్పింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇజ్రాయెల్ యుద్దం.. పాలస్తీనాతోనా..లేక హమాస్ తోనా ?

షాకింగ్: అక్కడ 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు..!

కరోనా మూడో వేవ్ వస్తే.. అంత దారుణంగానా..?

బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన అయేషా టాకియా భర్త..

ఆ న‌టీమ‌ణి భ‌ర్త‌కు అప్ప‌ట్లోనే సొంత విమానం ఉండేద‌ట‌..

పెళ్లే మహానటి పాలిటి శాపం అయిందా  .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>