PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-and-chandrababu-380c7ca0-a8af-494b-a9ce-90aef6e90038-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-and-chandrababu-380c7ca0-a8af-494b-a9ce-90aef6e90038-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలది చాలా ముఖ్యమైన పాత్ర. ప్రభుత్వం చేసే తప్పులని ఎత్తి చూపుతూ, ప్రజలు కష్టాల్లో ఉంటే వారికి అండగా ఉంటూ ప్రభుత్వానికి ధీటుగా ఉండాల్సింది ప్రతిపక్షమే. అయితే ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీని, అధికారంలో ఉన్న పార్టీ తోక్కేసే ప్రయత్నాలు చేస్తుంది. 2014 నుంచి ఏపీలో ఇదే పరిస్తితి కొనసాగుతుంది. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ, ప్రతిపక్ష వైసీపీని లేకుండా చేయాలని చూసింది.jagan and chandrababu;cbn;jagan;andhra pradesh;2019;history;assembly;tdp;success;ycp;partyజగన్‌కు ప్లస్ అయినచోటే బాబుకు కలిసొస్తుందా?జగన్‌కు ప్లస్ అయినచోటే బాబుకు కలిసొస్తుందా?jagan and chandrababu;cbn;jagan;andhra pradesh;2019;history;assembly;tdp;success;ycp;partyWed, 19 May 2021 14:00:00 GMTరాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలది చాలా ముఖ్యమైన పాత్ర. ప్రభుత్వం చేసే తప్పులని ఎత్తి చూపుతూ, ప్రజలు కష్టాల్లో ఉంటే వారికి అండగా ఉంటూ ప్రభుత్వానికి ధీటుగా ఉండాల్సింది ప్రతిపక్షమే. అయితే ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీని, అధికారంలో ఉన్న పార్టీ తోక్కేసే ప్రయత్నాలు చేస్తుంది. 2014 నుంచి ఏపీలో ఇదే పరిస్తితి కొనసాగుతుంది. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ, ప్రతిపక్ష వైసీపీని లేకుండా చేయాలని చూసింది.


వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలని తమ పార్టీలోకి లాగేసుకుంది. అలాగే అసెంబ్లీలో ప్రతిపక్షానికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్‌ని టీడీపీ ఎమ్మెల్యేలు హేళన చేసేవారు. అసెంబ్లీలో జగన్‌పై వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. అటు బయట కూడా ప్రతిపక్షాన్ని ఎక్కడికక్కడ నిర్భందించడానికే చూసింది. దీంతో జగన్ అసెంబ్లీని సైతం బహిష్కరించి ప్రజల్లో తిరగడం చేశారు. సుదీర్ఘంగా పాదయాత్ర చేశారు.


దీంతో 2019 ఎన్నికల్లో జగన్‌కు ఏ రేంజ్‌లో ఫలితం వచ్చిందో తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తూ 151 సీట్లు వైసీపీకి వచ్చాయి. టీడీపీకి కేవలం 23 సీట్లు వచ్చాయి. ఇక ఇక్కడ నుంచి సీన్ రివర్స్ అయింది. అటు బయట కావొచ్చు, అసెంబ్లీలో కావొచ్చు వైసీపీ ప్రభుత్వం టీడీపీకి చుక్కలు చూపించడం మొదలుపెట్టింది. అసలు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబుని వైసీపీ ఎమ్మెల్యేలు ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఈ విధంగా అసెంబ్లీలో పూర్తిగా వైసీపీ ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. ఇక అసెంబ్లీ సమావేశాలు జరిగితే చాలు టీడీపీకి చుక్కలే అని అర్ధమైపోయేది.


అయితే చివరిగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ పూర్తిగా చేతులెత్తేసింది. చివరిలో సమావేశాలని బహిష్కరించింది. ఇక తాజాగా జరగబోయే బడ్జెట్ సమావేశాలని సైతం టీడీపీ బహిష్కరించింది. అలాగే భవిష్యత్‌లో జరగబోయే సమావేశాల్లో పాల్గొంటుందా లేదా అనేది కూడా డౌటే. అయితే అప్పుడు అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించి జగన్ ప్రజల్లో తిరిగి బంపర్ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు సమావేశాలు బహిష్కరిస్తున్నారు. కానీ ప్రజల్లో మాత్రం తిరగడం లేదు. బాబుతో పాటు టీడీపీ నేతలు ఇంటికే పరిమితమవుతున్నారు. దీని బట్టి చూస్తే జగన్‌కు వచ్చిన సక్సెస్ బాబుకు వస్తుందని చెప్పడం కాస్త డౌటే.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ సిటీలో మరణ మృదంగం..215 మంది మృతి..!!

ఏపీ బడ్జెట్ లో పిల్లల కోసం సర్ప్రైజ్ ?

బాలీవుడ్‌పై ఆ హీరియిన్ దృష్టి.. అందుకోసమేనట..?

సోనమ్‌ భర్త ఆస్తి విలువ అన్ని కోట్లా..?

ఆహా : సాయి పల్లవి అనుకోని అతిధి..!!

మోది ప‌స తగ్గింది : అల్ జ‌జీరా

బన్నీపై రుసరుసలాడుతున్న హీరోయిన్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>