EditorialGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/jagan-chandra-babu-ap-assembly-budget-sessionc753a7a6-d287-4e7f-be5f-07029cc06a5a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/jagan-chandra-babu-ap-assembly-budget-sessionc753a7a6-d287-4e7f-be5f-07029cc06a5a-415x250-IndiaHerald.jpgబడ్జెట్ సమావేశాల్లో అధికార పక్షాన్ని నిలదీద్దామని ప్రతిపక్షాలు, ప్రతిపక్షాన్ని నిలువరిద్దామని అధికార పక్షం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. అయితే కొవిడ్ ఉధృతి కారణంగా ఏపీలో బడ్జెట్ సమావేశాల సవాళ్లు, ప్రతిసవాళ్లు వినిపించేలా లేవు. కేవలం ఒక్కరోజే ఏపీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఒక్కరోజు సమావేశాలను కూడా ప్రతిపక్షం బహిష్కరించబోతున్నట్టు సమాచారం. ప్రతిపక్షంలేని అసెంబ్లీ సమావేశాలు, ఒక్కరోజయినా, వందరోజులయినా సందడి ఉండదనేది వాస్తవం. jagan, chandra babu, ap assembly, budget session;raghu;ramakrishna;tiru;andhra pradesh;tirupati;assembly;husband;arrest;tdp;local language;ycp;aprilఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సవాళ్లు లేనట్టే..ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సవాళ్లు లేనట్టే..jagan, chandra babu, ap assembly, budget session;raghu;ramakrishna;tiru;andhra pradesh;tirupati;assembly;husband;arrest;tdp;local language;ycp;aprilWed, 19 May 2021 09:00:00 GMTబడ్జెట్ సమావేశాల్లో అధికార పక్షాన్ని నిలదీద్దామని ప్రతిపక్షాలు, ప్రతిపక్షాన్ని నిలువరిద్దామని అధికార పక్షం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. అయితే కొవిడ్ ఉధృతి కారణంగా ఏపీలో బడ్జెట్ సమావేశాల సవాళ్లు, ప్రతిసవాళ్లు వినిపించేలా లేవు. కేవలం ఒక్కరోజే ఏపీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఒక్కరోజు సమావేశాలను కూడా ప్రతిపక్షం బహిష్కరించబోతున్నట్టు సమాచారం. ప్రతిపక్షంలేని అసెంబ్లీ సమావేశాలు, ఒక్కరోజయినా, వందరోజులయినా సందడి ఉండదనేది వాస్తవం.

కొవిడ్ ఉధృతి నేపథ్యంలో ఈనెల 20 (గురువారం) ఒక్కరోజే ఉభయ సభలను సమావేశ పరచి, ఏపీ బడ్జెట్ ను ఆమోదిస్తారు. ఉదయం 9 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ రాజ్‌ భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగిస్తారు. ఆ తర్వాత గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి, బడ్జెట్ సమావేశాన్ని ప్రారంభిస్తారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెడతారు. ద్రవ్య వినిమయ బిల్లు, వివిధ శాఖల పద్దులు, ఆర్డినెన్స్‌ల స్థానంలో తీసుకొస్తున్న బిల్లులకు సభ ఆమోదం తెలపాల్సి ఉంటుంది.

కొవిడ్ ప్రభావం, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మార్చిలో నిర్వహించాల్సిన ఏపీ బడ్జెట్‌ సమావేశాలు వాయిదా పడ్డాయి. 3 నెలలపాటు (ఏప్రిల్‌ నుంచి జూన్‌) ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెడుతోంది. అయితే ఈ సమావేశాలను బహిష్కరించాలని ప్రతిపక్షనేత చంద్రబాబు నిర్ణయించారని అంటున్నారు. స్థానిక ఎన్నికలతోపాటు, తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల ప్రభావంతో చంద్రబాబు ఈ సమావేశాలకు దూరంగా ఉంటున్నారని, పక్క రాష్ట్రంలో ఉండిపోయారంటూ ఆల్రడీ వైసీపీ విమర్శల దాడి మొదలు పెట్టింది.

మరోవైపు టీడీపీ నేతలు మాత్రం ఒక్కరోజు సమావేశాలు పెట్టి, అసెంబ్లీ నుంచి పారిపోతోంది వైసీపీయేనని సెటైర్లు వేస్తున్నారు. రాష్ట్రంలో కొవిడ్ తోపాటు, అనేక సమస్యలున్నాయని, చర్చించేందుకు ధైర్యం లేక, సమావేశాలను ఒక్కరోజుకే పరిమితం చేశారని విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు. రఘురామకృష్ణంరాజు అరెస్ట్ సహా అనేక విషయాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారనే భయం వారిలో ఉందని అంటున్నారు. మొక్కుబడి సమావేశాలకు తాము రావట్లేదని చెబుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివిర్‌ ఔట్..?

"బ్లాక్ ఫంగస్" వీరికి ప్రాణాంతకం కానుందా ?

గుడ్‌ న్యూస్‌: బ్లాక్‌ ఫంగస్‌కు ఆయుష్‌ వైద్యం

నేపాల్ లో భూకంపం

బైడెన్‌ దంపతుల వార్షిక ఆదాయం ఎంతో తెలుసా ?

రాజమౌళి అభిప్రాయంతో ఏకీభవించలేకపోతున్న జూనియర్ చరణ్ ?

కరోనా వైరస్‌ ముమ్మాటికీ చైనా సృష్టేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>