QuotesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/maachi-maata4babd4ab-ec2d-4c4d-93b3-307c6b4d1c5f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/maachi-maata4babd4ab-ec2d-4c4d-93b3-307c6b4d1c5f-415x250-IndiaHerald.jpgజీవితంలో ఎవరైనా ఏదైనా సాదించాలి అనుకునేటప్పుడు ముందుగా చిన్నచిన్న అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇక ఆ అడుగులకు బలం ఎక్కువ అయినప్పుడు పరుగు మొదలవుతుంది. ఒకవేళ నువ్వు వేసే అడుగు సరిగా లేకపోతే, ఆ పరుగు కష్టమవుతుంది.. కానీ ఎందులోనైనా ముందుకు వెళ్లాలన్న ఆలోచన ఉంటే, తప్పకుండా మీరు కష్టపడతారు. అందులో దాగి ఉన్న అర్థాలను, మెలకువలను నేర్చుకుంటారు. అయినా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యి, మిమ్మల్ని అడుగులు వేయనీకుండా మీ దారిని అడ్డుకుంటే, కొత్త దారిలోకి వెళ్లాలని డిసైడ్ అవ్వడం నేర్చుకోవాలి.. ఏదైనా సాధించాలనుకునMAACHI MAATA;jeevitha rajaseskharమంచిమాట: అడుగేస్తున్న ప్రతిసారి పడిపోతుంటే ఎగరడం నేర్చుకో..మంచిమాట: అడుగేస్తున్న ప్రతిసారి పడిపోతుంటే ఎగరడం నేర్చుకో..MAACHI MAATA;jeevitha rajaseskharWed, 19 May 2021 06:00:00 GMT
జీవితంలో ఎవరైనా ఏదైనా సాదించాలి అనుకునేటప్పుడు ముందుగా చిన్నచిన్న అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇక ఆ అడుగులకు బలం ఎక్కువ అయినప్పుడు పరుగు మొదలవుతుంది. ఒకవేళ నువ్వు వేసే అడుగు సరిగా లేకపోతే, ఆ పరుగు కష్టమవుతుంది.. కానీ ఎందులోనైనా ముందుకు వెళ్లాలన్న ఆలోచన ఉంటే, తప్పకుండా మీరు కష్టపడతారు. అందులో దాగి ఉన్న అర్థాలను, మెలకువలను నేర్చుకుంటారు. అయినా  కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యి,  మిమ్మల్ని అడుగులు వేయనీకుండా మీ దారిని అడ్డుకుంటే, కొత్త దారిలోకి వెళ్లాలని డిసైడ్ అవ్వడం నేర్చుకోవాలి..

ఏదైనా సాధించాలనుకునేటప్పుడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉండకుండా, ఎంత కష్టం వచ్చినా ఆ పనిని సాధించేవరకు నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి.. ఒకవేళ  ఏదైనా కొత్త దారిలో వెళ్లాలనుకున్నప్పుడు, ఆ కొత్తదారి  గురించి నాకేమీ తెలియదు అనుకున్నప్పుడు అక్కడ మళ్ళీ చిన్నచిన్న అడుగులు వేయాల్సి ఉంటుంది. పెద్దగా అడుగుల వేయడానికి  చాలా సమయం పట్టవచ్చు. కానీ ఆ టైం ఎక్కువ పడుతుంది అని అనుకున్నప్పుడు మీరు మరో కొత్తదారి తీసుకోవాలి. ఇక అక్కడ  కూడా ఇలాగే చిన్నచిన్న అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇక మీరు వేసే అడుగులు ఆగిపోయాక మిగిలి ఉన్న దారి లో ఏవేవో కొత్త కొత్త అడుగులు మీకు కనిపిస్తుంటాయి..

ఇక మీరు సాధించలేనిది, ఎదుటి వ్యక్తి సాధించగలిగారు అన్న కోపం కలుగుతుంది. అప్పుడు ఎందుకు వదిలేసాను  అన్న బాధ ఎక్కువై, మీ మీద మీకే అసహ్యం కలగవచ్చు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మానేస్తారు.  తిట్టుకోవడం,  నా వల్ల కాదనుకోవడం, బాధపడుతూ కాలం వెళ్లదీయడం లాంటివి మానేయాలి.. ప్రస్తుతం కాలాన్ని మీకు కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు . ప్రతి సారి మీరు ఇంతకుముందు నడవలేక పోయిన దారి ని తలచుకుంటూ కాలం వెళ్ళదీయకూడదు. తెలివిగల వారు దారిలో ఎదురయ్యే ముళ్ళకంపలను ఎగిరి అవతలకు పడతారు. ఇక మీరు కూడా ఏదైనా సమస్య వచ్చిందని డీలా పడిపోతే, జీవితంలో ఏది సాధించలేరు. కాబట్టి కష్టమైనా నష్టమైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడే దేన్నైనా సాధించగలరు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రజలకు గుడ్ న్యూస్.. తెలంగాణ మంత్రి గొప్ప నిర్ణయం?

ఈటెలకి రియల్ సీన్ చూపిస్తున్నారా... ?

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం..!!

ఒక్క హిట్టు కోసం ఎదురుచూపు... ?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>